టాప్ సేఫ్టీ & స్మార్ట్ AI తో పరిగెత్తే Citroen Aircross X - ₹8.2 లక్షల్లో చక్కటి డీల్!
Citroen Aircross X safety rating: కేవలం ₹8.2 లక్షల ధరకు లాంచ్ అయిన సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X, ఇప్పుడు 5-స్టార్ BNCAP రేటింగ్ సాధించింది. బడ్జెట్ రేటులో దీని ఫీచర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి.

Citroen Aircross X 5 Star Safety AI Features: ఫ్రెంచ్ వాహన తయారీ కంపెనీ సిట్రోయెన్ కొత్త కాంపాక్ట్ SUV ఎయిర్‌క్రాస్ X... భారత్ ఎన్‌క్యాప్ (BNCAP) నుంచి 5-స్టార్ భద్రతా రేటింగ్ పొందింది. ఈ రేటింగ్, ఈ కారు దృఢత్వం & విశ్వసనీయతను ప్రతిబింబిస్తుంది. మరో విశేషం ఏంటంటే.... సిట్రోయెన్ కంపెనీ, Aircross X ను చాలా అందుబాటు ధరకు లాంచ్ చేసింది. కేవలం ₹8.2 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే ఈ కారు చాలా హ్యాచ్‌బ్యాక్‌ల కంటే చవకైనది & స్పేస్, డిజైన్, ఫీచర్ల పరంగా ప్రీమియం SUV ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
డిజైన్ & ఇంటీరియర్
కొత్త సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X చాలా ఆధునికంగా & రిఫైన్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. కొత్త బాడీ కలర్స్, లెథరెట్ డాష్‌బోర్డ్ ఫినిషింగ్ & రీడిజైన్ చేసిన ఇంటీరియర్ థీమ్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది, దీంతో ఈ కారు మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. అత్యంత ముఖ్యమైన మార్పు దాని 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇది మెరుగైన ఇంటర్‌ఫేస్ & సున్నితమైన రెన్సాన్స్‌లను కలిగి ఉంది. 360 డిగ్రీల కెమెరా, CARA వాయిస్ అసిస్టెంట్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి. పుష్-బటన్ స్టార్ట్, కూల్డ్ సీట్లు, LED ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్, కొత్త గేర్ లివర్ డిజైన్ & ఎయిర్ కండిషన్డ్ సెంటర్ స్టోరేజ్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి, దీంతో దీని ఇంటీరియర్ ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇంజిన్ & పనితీరు
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X బేస్ వేరియంట్ 82 bhp, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది, ఇది రోజువారీ సిటీ డ్రైవింగ్‌కు అనువైనది. X Plus & X Max వేరియంట్‌లలో 110 hp, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది మృదువైన & శక్తిమంతమైన పనితీరును అందిస్తుంది. ఈ ఇంజిన్‌ను టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేశారు, ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ SUV పొడవు 4 మీటర్లకు పైగా ఉంటుంది, ఇది క్యాబిన్‌ను విశాలంగా & కుటుంబానికి అనుకూలంగా చేస్తుంది.
5-స్టార్ భద్రత రేటింగ్
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X భద్రత పరంగా అసాధారణమైన పెర్ఫార్మెన్స్ చేసింది. ఇటీవల, భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఈ SUVలో అధిక-బలం కలిగిన స్టీల్ ఫ్రేమ్, ఆరు ఎయిర్ బ్యాగులు, EBDతో ABS & ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. బలమైన బ్రేకింగ్ సిస్టమ్ & రిఫైన్డ్ సస్పెన్షన్ సెటప్ - సిటీ & హైవే పరిస్థితులలో అద్భుతమైన పట్టును & నియంత్రణను అందిస్తాయి.
ధర & వేరియంట్లు
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X ధర ₹8.2 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవగా, టాప్-స్పెక్ ఎయిర్‌క్రాస్ X Max వేరియంట్ ధర ₹13 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ SUV 7-సీట్ల కాన్ఫిగరేషన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ ధర పరిధిలో ఇది - Maruti Fronx, Tata Nexon & Hyundai Exter వంటి పాపులర్ మోడళ్లతో పోటీ పడుతుంది. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X కు కొన్ని హై-ఎండ్ ఫీచర్లు లేకపోయినా... ధర, భద్రత & డిజైన్ పరంగా డబ్బుకు తగిన విలువను అందిస్తుంది.





















