అన్వేషించండి

Honda CB125 Hornet మైలేజ్‌ టెస్టింగ్‌ - రియల్‌ వరల్డ్‌ రిజల్ట్స్‌ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

మైలేజ్‌ టెస్ట్‌లో Honda CB125 Hornet మంచి మార్కులు సాధించింది. సిటీ రైడ్‌లో, హైవే మీద బాగా పెర్ఫార్మ్‌ చేసింది. అన్ని విషయాలు యంగ్‌ రైడర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Honda CB125 Hornet Mileage Test Specifications: హోండా కంపెనీ, 125cc సెగ్మెంట్‌లో కొత్తగా తీసుకువచ్చిన బైక్‌ CB125 Hornet మైలేజ్‌ టెస్ట్‌ ఫలితాలు బయటకొచ్చాయి. యంగ్‌ & డైనమిక్‌ రైడర్లను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను డిజైన్‌ చేశారు. కంఫర్ట్‌, పనితీరు, ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ మూడు అంశాల్లోనూ ఈ బైక్‌ హోండా స్టాండర్డ్స్‌కి తగ్గట్టు నిలిచింది.

ఇంజిన్‌ వివరాలు
Honda CB125 Hornet బైక్‌లో 123.94cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 7,500rpm వద్ద 11.1 hp పవర్‌, 6,000rpm వద్ద 11.2 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ కలిగిన ఈ బైక్‌లో TFT డిస్‌ప్లే కూడా ఉంది. ఇందులోని ఎకో ఇండికేటర్‌ ఫీచర్‌, రైడర్‌ ఈ బైక్‌ను ఎఫిషియెంట్‌గా రైడ్‌ చేయడంలో ఉపయోగపడుతుంది.

మైలేజ్‌ టెస్ట్‌ ఫలితాలు
టెస్ట్‌ రన్‌లో హోండా CB125 హార్నెట్‌ సిటీ రైడ్‌లో లీటరుకు 59.8 km, హైవే రైడ్‌లో లీటరుకు 69.3 km మైలేజ్‌ ఇచ్చింది. సగటు చూస్తే దాదాపు 63.5 km/l వచ్చింది. ఈ ఫలితాలు 125cc బైక్‌లలో చాలా అద్భుతమని చెప్పాలి.

టెస్టింగ్‌ సమయంలో, ఈ మోటార్‌ సైకిల్‌ను హైవే మీద గంటకు 60-70 km స్పీడ్‌లో ఎక్కువ సేపు నడిపారు. 75 km/h దాటగానే ఇంజిన్‌లో కొంచెం వైబ్రేషన్స్‌ వచ్చాయని టెస్ట్‌ రైడర్స్‌ వెల్లడించారు. అయినప్పటికీ, ఎకానమి రైడ్‌ రేంజ్‌లో ఈ చాలా బైక్‌ స్మూత్‌గా నడిచింది.

సిటీ రైడ్‌ అనుభవం
సిటీలో ట్రాఫిక్‌ పరిస్థితుల్లో కూడా ఈ బైక్‌ ఫర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. తేలికైన క్లచ్‌, సాఫ్ట్‌ గేర్‌ షిఫ్టింగ్‌ వంటివి ఈ బండిని హ్యాండిల్‌ చేయడం సింపుల్‌గా మార్చాయి. ఎకో ఇండికేటర్‌ సాయంతో సరిగా గేర్‌ మార్చుకుంటూ నడిపితే ఈ బైక్‌ అద్భుతమైన మైలేజ్‌ ఇస్తుంది.

టెస్టింగ్‌ ఎలా చేశారు?
ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ టెస్టింగ్‌లో, టెస్ట్‌ రైడర్లు ఈ బండి ఫ్యూయల్‌ ట్యాంక్‌ను ఫుల్‌ చేశారు. కంపెనీ సిఫారసు చేసిన టైర్‌ ప్రెజర్‌ సెట్‌ చేశారు. ఆ తర్వాత సిటీ, హైవే రెండు మార్గాల్లో స్థిరమైన స్పీడ్‌లతో బైక్‌ను నడిపారు. చివరగా ట్యాంక్‌ను మళ్లీ నింపి, ప్రయాణ దూరాన్ని లీటర్లతో పోల్చి ఖచ్చితమైన మైలేజ్‌ లెక్కలు తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ధర
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, హోండా CB125 హార్నెట్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1,02,770. అన్ని పన్నులతో కలుపుకుని దీని ఆన్‌-రోడ్‌ రేటు దాదాపు రూ. 1.30 లక్షలు. నగరం & డీలప్‌షిప్‌ను బట్టి ఈ రేటు కాస్త మారవచ్చు.

హోండా CB125 హార్నెట్‌.. లుక్స్‌లో, మైలేజ్‌లో, రైడింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌లోనూ యువ రైడర్ల అంచనాలకు సరిపోయేలా ఉంది. రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో కంఫర్ట్‌గా నడిపే బైక్‌ కావాలనుకునేవారికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్‌.

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget