అన్వేషించండి

Royal Enfield Scram 440 - ఆరో గేర్‌తో పంచ్‌ పెంచిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

Royal Enfield Scram 440, టెస్ట్‌ డ్రైవ్‌లో 100 km వేగాన్ని కేవలం 11 సెకన్లలో చేరింది. Scram 411 కంటే వేగంగా, సాఫ్ట్‌ గేర్‌బాక్స్‌తో కొత్త 6-స్పీడ్‌ రైడింగ్‌ అనుభూతిని ఇస్తోంది.

Royal Enfield Scram 440 price performance: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, రోడ్డుపై తనకున్న ప్రత్యేక ఇమేజ్‌కి మరో పంచ్‌ జోడించింది - అదే Scram 440. ఇది Scram 411 కి నెక్ట్స్‌ లెవెల్‌గా వచ్చింది - శక్తి, వేగం, సౌకర్యం మూడింటినీ మరింత మెరుగుదలను చూపిస్తోంది. కొత్త ఇంజిన్‌, 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ & రిఫైన్డ్‌ రోల్‌-ఆన్‌ పర్ఫార్మెన్స్‌తో యువ రైడర్ల కోసం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఈ బండిని సీరియస్‌గా తీసుకొచ్చింది.

ఇంజిన్‌ & పవర్‌
Scram 440 లో ఉన్న 443cc బోర్డ్‌-అవుట్‌ ఇంజిన్‌, పాత Himalayan 411 కంటే 3mm ఎక్కువ బోర్‌ కలిగి ఉంది. ఇది 6,250 rpm వద్ద 25.4 hp పవర్, 4,000 rpm వద్ద 34 Nm టార్క్ ఇస్తుంది. పాత Scram 411 లో 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉన్నా, 440 లో 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ చేరడం వల్ల హైవే క్రూజింగ్‌ అనుభవం సాఫీగా మారింది.

యాక్సిలరేషన్‌ టెస్ట్‌ ఫలితాలు
టెస్టింగ్‌ సమయంలో రోడ్లు ఎక్కువగా పొడిగా ఉన్నప్పటికీ, ఇటీవలి వర్షాల నేపథ్యంలో అక్కడక్కడ తేమ ఉన్న ప్యాచెస్‌ ఎదురయ్యాయి. Scram 411 తో పోలిస్తే... 0 నుంచి గంటకు 80 km వేగాన్ని అందుకునే వరకు పెద్ద తేడా లేకపోయినా, 100 km/h స్పీడ్‌కి 11 సెకన్లలో చేరడం Scram 440 కి గట్టి ప్లస్‌ పాయింట్‌. ఇది Scram 411 కంటే దాదాపు ఒక సెకన్‌ త్వరగా చేరింది. పైగా, గేర్‌బాక్స్‌ చాలా స్మూత్‌గా పని చేస్తుంది, కానీ క్లచ్‌ కాస్త హెవీగా అనిపిస్తుంది.

రోల్‌-ఆన్‌ టెస్ట్‌ వివరాలు

ఇంజిన్‌ రెస్పాన్స్‌ మెరుగైందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు.

2వ గియర్‌ రన్‌: 2.56 సెకన్లు

3వ గియర్‌ రన్‌: 4.63 సెకన్లు

4వ గియర్‌ రన్‌: 4.46 సెకన్లు

పాత Scram 411 తో పోలిస్తే, 50-80 km రేంజ్‌లో సుమారుగా 1.5 సెకన్ల వేగవంతమైన తేడాను Scram 440 టెస్టింగ్‌ టైమ్‌లో గమనించాం. అంటే, Scram 411 కంటే దాదాపు ఒకన్నర సెకన్ల ముందే Scram 440 ఈ స్పీడ్‌ను అందుకుంటోంది.

బ్రేకింగ్‌ సామర్థ్యం
Scram 440 ముందు, వెనుక రెండింటిలోనూ డిస్క్‌ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయల్‌ చానల్‌ ABS తో రైడర్‌కు మరింత ఎక్కువ నియంత్రణ లభిస్తుంది. పాత మోడల్‌ కంటే బ్రేకింగ్‌లో కొంచెం బెటర్‌నెస్‌ కనిపించింది. ప్రత్యేకంగా హార్డ్‌ బ్రేకింగ్‌ సమయంలో ABS చాలా బాగా పని చేసింది. కావాలనుకుంటే, వెనుక ABS‌ ను డిసేబుల్‌ చేసే ఆప్షన్‌ కూడా ఉంది, అనుభవం గల రైడర్లకు ఇది అదనపు ఫీచర్‌.

లుక్‌ & వేరియంట్లు
Scram 440 బైక్‌ మామూలు కంఫర్ట్‌తో కాకుండా అడ్వెంచర్‌ స్పిరిట్‌తో రూపుదిద్దుకుంది. కలర్స్‌ ఆధారంగా వేరియంట్ల ధరలు మారతాయి. “Force Blue” కలర్‌ వేరియంట్‌ది అత్యధిక ధర, “Trail Green” కలర్‌ బైక్‌ తక్కువ ధరతో ఉన్నాయి. రెండింట్లోనూ LED హెడ్‌ల్యాంప్స్‌ & స్విచ్‌ఎబుల్‌ ABS స్టాండర్డ్‌గా వస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో ధర
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో Scram 440 ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 2,23,131. అన్ని పన్నులు కలుపుకుని, ఇది దాదాపు రూ. 2,92,000 ఆన్‌-రోడ్‌ రేటుకు వస్తుంది. నగరం & డీలర్‌షిప్‌ను బట్టి రేటు కాస్త మారవచ్చు.

ఒకే బైక్‌తో అన్ని రకాల ప్రయాణాలు చేయాలనుకునే రైడర్లకు Royal Enfield Scram 440 ఒక పర్ఫెక్ట్‌ ఛాయిస్‌. శక్తిమంతమైన ఇంజిన్‌, స్మూత్‌ గేర్‌బాక్స్‌, కంఫర్ట్‌ రైడ్‌ - ఇవన్నీ కలిసి ఈ బండిని “అడ్వెంచర్‌ రైడింగ్‌”కి సరైన పార్ట్‌నర్‌గా నిలబెట్టాయి.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కారు నడుస్తున్నప్పుడు సౌండ్ తప్పనిసరి, కొత్త రూల్స్ ఇవే!
ఎలక్ట్రిక్ కారు నడుస్తున్నప్పుడు సౌండ్ తప్పనిసరి, కొత్త రూల్స్ ఇవే!
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
KTR: కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
Hot Water For Blood Pressure : వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
Embed widget