అన్వేషించండి

Car Price Drop Diwali: ఈ దీపావళి నాటికి చాలా కార్లు చవగ్గా వస్తాయి - GST తగ్గింపు ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా?

GST Reduction on Cars: GST నిర్మాణంలో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025 దీపావళి నాటికి హ్యాచ్‌బ్యాక్‌లు & చిన్న కార్లు చాలా చౌకగా మారవచ్చు.

GST Reduction Impact on Car Prices: కొత్త కారు కొనబోయేవాళ్లకు ఇది కచ్చితంగా బంపర్‌ న్యూస్‌. వస్తువులు & సేవల పన్ను (GST) నిర్మాణంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఈ ఆగస్టు 15న, ఎర్రకోట పైనుంచి ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ, దేశంలో పన్ను నిర్మాణాన్ని సులభంగా మార్చడం & ప్రజల ప్రయోజనాలపై మాట్లాడారు. అప్పటి నుంచి, ఇది కార్ల ధరలను ఎంత ప్రభావితం చేస్తుందనే చర్చ మొదలైంది. 

చిన్న కారు కొనడానికి దీపావళి సరైన సమయమేనా?
ప్రస్తుతం చిన్న కార్లపై 28 శాతం GST & ప్రత్యేక సెస్ విధిస్తున్నారు, దీనివల్ల మొత్తం పన్ను దాదాపు 29 శాతానికి చేరుకుంది. ఇకపై, పన్ను రేట్లను మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్త ప్రతిపాదన ప్రకారం, హ్యాచ్‌బ్యాక్‌లు & చిన్న కార్లను 18 శాతం స్లాబ్‌లోకి తీసుకురావాలనే, ఈ ఏడాది దీపావళి (2025 Diwali) నాటికి దీనిని అమల్లోకి తీసుకురావాన్న ప్రణాళిక ఉంది. దీని అర్థం.. హ్యాచ్‌బ్యాక్‌లు & చిన్న కార్లను కొనుగోలు చేసే వాళ్లు దీపావళి నాటికి పెద్ద ఉపశమనం పొందవచ్చు. 4 మీటర్ల కంటే తక్కువ (సబ్‌-4 మీటర్‌) & 1200cc వరకు ఇంజిన్‌ కెపాసిటీతో పెట్రోల్, CNG లేదా LPG కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, దీపావళి మీకు సరైన సమయం కావచ్చు. దీపావళి నాటికి కొత్త పన్ను నిర్మాణాన్ని అమల్లోకి తెచ్చే పని ఇప్పటికే ప్రారంభమైంది కూడా.

SUVలు & లగ్జరీ కార్లపై ప్రభావం ఎంత?
SUVలు & పెద్ద వాహనాల కొనుగోలుపై ప్రస్తుతం 43 శాతం నుంచి 50 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. కొత్త GST వ్యవస్థలో, వీటిని 40 శాతం ప్రత్యేక శ్లాబ్‌లో ఉంచవచ్చు. దీని అర్థం SUVలు & లగ్జరీ కార్లపై పెద్దగా ఉపశమనం ఉండదు. కానీ, పన్ను నిర్మాణం మునుపటి కంటే సరళంగా & పారదర్శకంగా మారుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికొస్తే, అక్కడ ఎటువంటి మార్పు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం GST మాత్రమే విధిస్తున్నారు & దీనిని భవిష్యత్తులో కూడా కొనసాగించవచ్చు. అంటే, ఎలక్ట్రిక్ కార్‌ కొనుగోలుదారులు ఎటువంటి అదనపు భారాన్ని మోయాల్సిన అవసరం లేదు & అదనపు ప్రయోజనం కూడా ఉండదు.

వాహనాలపై GST ప్రభావం ఎలా ఉంటుంది?
కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను కేవలం రెండు ప్రధాన శ్లాబుల్లోకి (5 శాతం & 18 శాతం) తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. లగ్జరీ వస్తువులు & సిగరెట్లు వంటి కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై 40 శాతం పన్ను విధిస్తారు. ఇది పన్ను వ్యవస్థను సులభతరం చేస్తుంది. వాహనాల విషయంలో ఇంజిన్ సామర్థ్యం లేదా పొడవుకు సంబంధించి తలెత్తే గందరగోళాలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. ఈ ప్రతిపాదన అమలైతే, చిన్న కార్ల ధరల్లో పెద్ద తగ్గింపును మనం చూడవచ్చు. ఫలితంగా, ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతుంది & ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు పెరుగుతాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు సానుకూల ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది.

ఆగస్టు 21న మంత్రుల కమిటీ సమావేశమై, జీఎస్టీ రేటులో మార్పు ప్రతిపాదనను చర్చిస్తుంది. ఆ తర్వాత, సెప్టెంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ దీపావళికి కారు కొనడం లాభదాయకమైన డీల్‌ కావచ్చు.

టాప్ హెడ్ లైన్స్

నెలకు రూ.2500 EMIతో TVS Apache RTR 160 4V కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, లోన్‌ ఎంత వస్తుంది?
TVS Apache RTR 160 4V కొనడానికి రూ.25,000 ఉంటే చాలు, మిగిలిన డబ్బును బ్యాంక్‌ లోన్‌గా ఇస్తుంది!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
బజాజ్ చేతక్ EVని ఇంటికి తెచ్చుకోవడానికి లోన్‌ ఫెసిలిటీ.. కనీస డౌన్‌పేమెంట్‌, EMI పూర్తి వివరాలు
Bajaj Chetak C2501 ఎలక్ట్రిక్ స్కూటర్‌.. నెలకు కేవలం రూ.1500 EMIతో మీ సొంతం!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Indrakeeladari Arrangements: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ ఉత్సవ్ కు తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
Embed widget