Car loan Interest Rate: ఏ బ్యాంక్ అతి తక్కువ వడ్డీకి కార్ లోన్ ఇస్తుంది.. టాప్ 5 లిస్ట్ చూసి ఫిక్స్ అవ్వండి
Car loan in India: గత కొన్నేళ్ల నుంచి, ముఖ్యంగా కరోనా వ్యాప్తి తరువాత చాలా కుటుంబాలకు కారు కొనాలని భావిస్తున్నాయి. మీరు కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు తెలుసుకోండి.

Car loan Interest rate In India: భారతదేశంలో గత కొన్నేళ్లుగా కార్ల వినియోగం భారీగా పెరిగింది. తమ ఆదాయానికి తగినట్లుగా ప్లాన్ చేసుకుని కార్లు కొంటున్నారు. కొంత మొత్తం డౌన్ పేమెంట్ చేసి ఈఎంఐ ద్వారా సొంత కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. సొంత వాహనం ఉండాలని భావించడంతో కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కానీ కారు ధర లక్షల రూపాయలు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కారు కొనడానికి బ్యాంకు నుండి రుణం తీసుకునే అవకాశాలను పరిశీలిస్తుంటారు. అయితే ఏ బ్యాంక్ కారు లోన్ తక్కువ వడ్డీకి ఇస్తుందని ఎంచుకోవడం ముఖ్యమే.
బ్యాంకు నుండి తీసుకున్న రుణాన్ని EMI ద్వారా చెల్లిస్తుంటారు. దేశంలోని వివిధ బ్యాంకులు వివిధ వడ్డీ రేట్లకు కార్ లోన్‌లను అందిస్తున్నాయి. మీరు కూడా మీ సొంత కారు కలను నెరవేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా, దేశంలోని వివిధ బ్యాంకుల కార్ లోన్ వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవాలి. దాంతో మీకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లదు. తక్కువ వడ్డీకే కారు కొనుగోలు చేయవచ్చు. అలాగే, మీరు ఉత్తమ కార్ లోన్‌ను ఎంచుకోవచ్చు. ఇక్కడ బ్యాంకుల వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం...
1. కార్ లోన్ విషయంలో వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. ICICI బ్యాంక్ తన కస్టమర్లకు 8.5 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ అందిస్తోంది. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్ లోన్ వడ్డీ రేటు 8.75 శాతం. యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు 8.8 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ అందిస్తోంది.
2. IDBI బ్యాంక్ తన కస్టమర్లకు 7.95 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్‌లు ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో కస్టమర్లకు కార్ లోన్ వడ్డీ రేటు 8.15 శాతం. కెనరా బ్యాంక్ కార్ లోన్‌లపై 8.20 శాతం వడ్డీ రేటు అమలు చేస్తుంది
3. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB Car Loan) తన కస్టమర్లకు 7.85 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్‌లను అందిస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 7.90 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్‌లు ఇస్తుంది.
కార్ లోన్ తీసుకునే ముందు, మీరు ఈ బ్యాంకుల వడ్డీ రేట్లను తెలుసుకోవడమే సరిపోదు. ఎందులో తక్కువ వడ్డీకి కారు లోన్ వస్తుంది, బ్యాంక్ ఈఎంఐ కండీషన్లు లాంటి పూర్తి వివరాలు కంపేర్ చేసుకోవాలి. ఆ తర్వాతే కార్ లోన్ తీసుకోవడంపై మీరు నిర్ణయం తీసుకోవాలి. కార్ లోన్ తీసుకునేటప్పుడు కొన్ని శాతం వడ్డీ రేటు తగ్గించడం ద్వారా మీకు కొన్ని వేల రూపాయలు ఆదా అవుతాయి.






















