అన్వేషించండి

ఈ కార్లపై డిస్కౌంట్లను మిస్‌ అవ్వొద్దు - 2026 అప్‌డేట్స్‌ ముందు భారీ ఆఫర్లు

2026 ఫేస్‌లిఫ్ట్‌లకు ముందు స్కోడా కుషాక్‌, కియా సెల్టోస్‌, మహీంద్రా XUV700, టాటా పంచ్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. రూ.2.5 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి, పైగా వీటి కోసం వెయిటింగ్‌ పీరియడ్‌ లేదు.

Car Discounts 2025 India: 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుండటంతో భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో డిస్కౌంట్‌ సీజన్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. 2026లో కొత్త ఫేస్‌లిఫ్ట్‌లు, అప్‌డేటెడ్‌ మోడళ్లను తీసుకురావడానికి తయారీదారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న పాత స్టాక్‌ను క్లియర్‌ చేయడానికి కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్లకు వెయిటింగ్‌ పీరియడ్‌ లేకపోవడం కొనుగోలుదారులకు పెద్ద ప్లస్‌గా మారింది.

ఇప్పుడు మార్కెట్‌లో రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త మోడల్‌ కోసం ఎదురు చూడాలా? లేక భారీ డిస్కౌంట్‌తో ఇప్పుడే కారు తీసుకోవాలా? అనే సందిగ్ధంలో ఉన్నవారికి ఈ వివరాలు స్పష్టత ఇస్తాయి.

Skoda Kushaq - డిస్కౌంట్‌: రూ.2.50 లక్షల వరకు

2026 జనవరిలో స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌ అవుతుందనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కుషాక్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. డీలర్‌ లెవెల్‌లో సుమారు రూ.2.50 లక్షల డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇందులో రూ.50 వేల ఎక్స్చేంజ్‌ బోనస్‌ కూడా ఉంటుంది.
కొన్ని కార్పొరేట్‌, స్క్రాపేజ్‌ ఆఫర్లతో కలిపి రూ.3.25 లక్షల వరకు లాభం ఉంటుందని కంపెనీ అధికారికంగా చెబుతోంది.
ప్రస్తుతం స్కోడా కుషాక్ ధరలు రూ.10.61 లక్షల నుంచి రూ.18.43 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉన్నాయి.

Outgoing Kia Seltos - డిస్కౌంట్‌: రూ.1.60 లక్షల వరకు

2026లో తొలి లాంచ్‌గా కొత్త జనరేషన్‌ కియా సెల్టోస్‌ రానుంది. జనవరి 2న లాంచ్‌ అయ్యే ఈ మోడల్‌ ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుత సెల్టోస్‌పై రూ.1.60 లక్షల వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు. ఇందులో రూ.40 వేల ఎక్స్చేంజ్‌ బోనస్‌ ఉంటుంది.
ప్రస్తుతం కియా సెల్టోస్ ధరలు రూ.10.79 లక్షల నుంచి రూ.19.81 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉన్నాయి.

Mahindra XUV700 - డిస్కౌంట్‌: రూ.80 వేల వరకు

మహీంద్రా తాజాగా XUV700 ఫేస్‌లిఫ్ట్‌ను టీజ్‌ చేసింది. ఇది XUV 7XO పేరుతో 2026 జనవరి 5న లాంచ్‌ కానుంది. ఈ నేపథ్యంలో కొంతమంది డీలర్లు ప్రస్తుత XUV700పై రూ.80 వేల వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.
ఈ SUV ధరలు ప్రస్తుతం రూ.13.66 లక్షల నుంచి రూ.23.71 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉన్నాయి.

Tata Punch - డిస్కౌంట్‌: రూ.80 వేల వరకు

టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ను కంపెనీ ఇప్పటికే రోడ్‌ టెస్టింగ్‌లో పెట్టింది. 2026లో మిడ్‌ సైకిల్‌ అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉంది. దీనికంటే ముందు ప్రస్తుత పంచ్‌పై కూడా రూ.80 వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
టాటా పంచ్ ధరలు ప్రస్తుతం రూ.5.50 లక్షల నుంచి రూ.9.30 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉన్నాయి.

కొత్త మోడల్‌ కోసం ఎదురుచూడాలనుకునేవారికి 2026 మంచి సంవత్సరం. కానీ డబ్బుకు ఎక్కువ విలువ కావాలనుకునే వారికి ఈ డిస్కౌంట్లు అరుదైన అవకాశం. వెయిటింగ్‌ పీరియడ్‌ లేకుండా, తక్కువ ధరకు మంచి కారు తీసుకోవాలంటే ఇదే సరైన సమయం.

గమనిక: డిస్కౌంట్లు నగరం, డీలర్‌, స్టాక్‌ ఆధారంగా మారుతాయి. ఖచ్చితమైన ఆఫర్ల కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget