అన్వేషించండి

Car Accident Tips: ప్రమాదం జరిగినప్పుడు భయపడవద్దు.. నష్టాన్ని నివారించడానికి ఈ పనులు చేయండి

Car Accident Insurance Claim : ప్రమాద స్థలంలో కారు పార్కింగ్ లైట్లను ఆన్ చేసి అప్రమత్తంగా ఉండటంతో పాటు, ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే సమాచారం అందించడం ద్వారా పెద్ద నష్టాల నుండి బయటపడవచ్చు.

సాధారణంగా మన వెహికల్ ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే మనం భయాందోళనకు గురవుతాం. కొన్ని సందర్భాల్లో టెన్షన్ పడి, ఆందోళనలో అన్నీ మర్చిపోతుంటారు. అలా చాలా మందికి జరుగుతుంటుంది. మరోవైపు రోజురోజుకూ జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలి. అయితే ఒకవేళ ప్రమాదం జరిగినట్లయితే, పెద్ద నష్టాల నుండి తప్పించుకోవడానికి మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

ప్రమాదం జరిగిన తర్వాత టెన్షన్ పడకుండా, మొదట మీకు తగిలిన గాయాల తీవ్రత గురించి తెలుసుకోండి. మీ పరిస్థితి బాగున్నట్లు అయితే, కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించాలి. ఈ చిట్కాలు మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల నుంచి కాపాడటమే కాకుండా మీ భద్రతకు కూడా అవసరం. ఆ వివరాలను ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోండి. 

రోడ్డు ప్రమాదాల సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి
-  చాలా సందర్భాల్లో తమ తప్పు లేకపోయినా రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశం నుంచి వెంటనే పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడానికి బదులు, ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఘటనా స్థలం నుండి పారిపోవడం వల్ల తప్పు లేకపోయినా కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశం ఉంది.

-  ప్రమాదం జరిగినప్పుడు మీరు మొదటగా 100 లేదా 112 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలి. అవసరమైతే వారి సహాయం కూడా కోరవచ్చు.

-  ప్రమాదం జరిగిన వెంటనే కారు పార్కింగ్ లైట్లను ఆన్ చేయాలి. దీనివల్ల వెనుక నుండి వచ్చే వాహనాలకు ప్రమాదం పరిస్థితి ముందుగానే అర్థమవుతుంది. మరో ప్రమాదం జరగకుండా మీరు నివారించవచ్చు.

-  దీంతో పాటు మీ వాహనాన్ని ఢీకొట్టిన అవతలి వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను వెంటనే నోట్ చేసుకోవాలి. అలాగే, ఆ వాహనంలో ఉన్న లేదా వాహనం నడిపే వ్యక్తి వివరాలను అడిగి తెలుసుకోండి. దాంతో అవసరమైనప్పుడు ఆ వివరాలను మీరు పోలీసులకు అందించవచ్చు.

-  టైం వేస్ట్ చేయకుండా వెంటనే మీ మొబైల్‌తో ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి పెట్టుకోవాలి. తద్వారా అవసరమైనప్పుడు పోలీసులకు వీటిని మీ వైపు నుంచి ఆధారాలుగా చూపవచ్చు.

-  మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను, మీ పరిస్థితిని అవకాశం దొరికిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలపాలి. వారు కోరిన వివరాలను అందజేయాలి, తరువాత కేసు నమోదైతే వివరాలను వారికి సమర్పిస్తే మీ ఇన్సూరెన్స్ లాంటివి క్లెయిమ్ ప్రాసెస్ త్వరగా పూర్తవుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!
యూత్‌ చేతికి కొత్త బండి.. స్పోర్టీ 296cc ఇంజిన్, 39hp పవర్‌తో Kawasaki Z300 ఎంట్రీ
ఈ స్కూటర్‌ ఎక్కితే, కింద పడిపోతామనే భయం ఉండదు! స్టాండ్ అవసరం లేని BMW Vision CE ఎలక్ట్రిక్‌ స్కూటర్
స్వయంగా బ్యాలెన్స్ చేసుకునే BMW ఎలక్ట్రిక్ స్కూటర్.. హెల్మెట్ అవసరం లేని ప్రయాణం!
Bajaj Pulsar N250SS: రూ.1.59 లక్షలకే 25hp పవర్.. కొత్త పల్సర్ N250SSలో ఈ ఫీచర్లు అదుర్స్!
యూత్‌ కోసం బజాజ్ పల్సర్‌ కొత్త బైక్.. 6 స్పీడ్ గేర్‌బాక్స్, గూగుల్ మ్యాప్స్‌తో అట్రాక్ట్‌ చేస్తోంది!

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget