అన్వేషించండి

సెకండ్‌ హ్యాండ్‌ Renault Kiger గైడ్‌ - కొనే ముందు ఇవి కచ్చితంగా చూడండి

మీ బడ్జెట్‌లో వచ్చే యూజ్డ్‌ Renault Kiger కొనాలనుకుంటున్నారా?, ఇంజిన్‌, మైలేజ్‌, ఫీచర్లు, లోపాలు, సెకండ్‌ హ్యాండ్‌ ధరలపై పూర్తి గైడ్‌ ఇదే.

Second Hand Renault Kiger: కొత్త హ్యాచ్‌బ్యాక్‌ ధరకే SUV తరహాలో ఉండే కారు కావాలనుకునే వారికి యూజ్డ్‌ Renault Kiger మంచి ఆప్షన్‌గా మారింది. 2021 ఫిబ్రవరిలో భారత మార్కెట్‌లోకి వచ్చిన కైగర్‌... తక్కువ ధరలో స్పేస్‌, మంచి గ్రౌండ్‌ క్లియరెన్స్‌, టర్బో ఇంజిన్‌ ఆప్షన్‌తో చాలామందిని ఆకట్టుకుంది. నిస్సాన్ మాగ్నైట్‌కు బ్రదర్‌ మోడల్‌ అయిన ఈ కారు, ఇప్పుడు యూజ్డ్‌ మార్కెట్‌లోనూ డిమాండ్‌ పెంచుకుంది.

నాలుగు మీటర్లలోపే (సబ్‌-4 మీటర్‌) పొడవు ఉన్నప్పటికీ, కైగర్‌ ఇంటీరియర్‌లో ఐదుగురు పెద్దవాళ్లు సౌకర్యంగా కూర్చునేంత స్థలం ఉంది. అంతేకాదు, 405 లీటర్ల బూట్‌ స్పేస్‌, 205 మిల్లీమీటర్ల గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉండటం వల్ల గుంతలు రోడ్లపై కూడా భయం ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ రోడ్లను తరచూ ఉపయోగించే వారికి ఇది పెద్ద ప్లస్‌.

ఇంజిన్‌ ఆప్షన్లు

రెనాల్ట్‌ కైగర్‌లో రెండు 1.0 లీటర్‌, మూడు సిలిండర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు ఉన్నాయి.
ఒకటి నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్‌ – ఇది 72hp శక్తి, 96Nm టార్క్‌ ఇస్తుంది.
మరోది టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ – ఇది 100hp శక్తి, 160Nm టార్క్‌తో మరింత శక్తిమంతంగా ఉంటుంది.
రెండింటికీ 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ స్టాండర్డ్‌గా వస్తుంది. 
టర్బో ఇంజిన్‌కు CVT ఆటోమేటిక్‌ ఆప్షన్‌ కూడా ఉంది. నగర డ్రైవింగ్‌లో ఈ CVT చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

మైలేజ్‌ 

ARAI ప్రకారం, టర్బో మాన్యువల్‌ – 20.38 kmpl మైలేజ్‌, నాన్‌ టర్బో మాన్యువల్‌ – 19.83 kmpl మైలేజ్‌ ఇస్తుంది.

డ్రైవింగ్‌ ఫన్‌ ముఖ్యం అనుకుంటే టర్బో వేరియంట్‌ తీసుకోవడం మంచిది. మైలేజ్‌ మాత్రమే ప్రాధాన్యం అయితే నాన్‌ టర్బో సరిపోతుంది.

వేరియంట్లు, ఫీచర్లు

లాంచ్‌ సమయంలో కైగర్‌ RxE, RxL, RxT, RxZ వేరియంట్లలో వచ్చింది. తర్వాత RxL తొలగించి, RxT (O) వంటి కొత్త ఆప్షన్లు తీసుకొచ్చారు.

టాప్‌ వేరియంట్‌ RxZలో 8 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్ ఫోన్‌ ఛార్జర్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, ఆటో క్లైమేట్ కంట్రోల్‌, నాలుగు ఎయిర్‌బ్యాగ్స్‌, రియర్‌ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి.

బడ్జెట్‌ అనుమతిస్తే RxZనే ఎంచుకోవడం మంచిది. RxT కూడా విలువైన డీల్‌. RxE మాత్రం చాలా బేసిక్‌గా ఉంటుంది.

కొనేముందు ఇవి చెక్‌ చేయండి

కొంతమంది యజమానులు సస్పెన్షన్‌ నుంచి ఎక్కువ శబ్దం వస్తోందని చెప్పారు. టెస్ట్‌ డ్రైవ్‌లో గుంతలపై కారు ఎక్కువగా దూకుతోందా, శబ్దాలు వస్తున్నాయా గమనించాలి. కారు వయసుతో పాటు ఇంటీరియర్‌లో కూడా రాటిల్స్‌ (గలగల శబ్ధాలు) వచ్చే అవకాశముంది. డ్యాష్‌బోర్డ్‌, డోర్‌ ప్యానెల్స్‌ దగ్గర శబ్దాలు వినిపిస్తే జాగ్రత్త. కొంతమంది ఫ్యూయల్‌ పంప్‌ సమస్య గురించి కూడా రిపోర్ట్‌ చేశారు. డ్రైవింగ్‌లో కారు స్మూత్‌గా నడుస్తుందా, లేదా చూసుకోవాలి.

సెకండ్‌ హ్యాండ్‌ ధర ఎంత?

ప్రి-ఓన్డ్‌ Renault Kiger ధరలు సాధారణంగా రూ.3.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటాయి. వేరియంట్‌, ఇంజిన్‌, మోడల్‌ ఇయర్‌ బట్టి ధర మారుతుంది. అయితే రూ.7 లక్షలకంటే ఎక్కువ పెట్టాలనుకుంటే కొత్త కారు తీసుకోవడం మంచిది. ఫేస్‌లిఫ్ట్‌ కూడా వచ్చిందనే విషయాన్ని ధర తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
Kia Sorento: భారత్ మార్కెట్‌లో కియా సోరెంటో SUV ఎంట్రీ.. లగ్జరీ కారు సూపర్ ఫీచర్లు
భారత్ మార్కెట్‌లో కియా సోరెంటో SUV ఎంట్రీ.. లగ్జరీ కారు సూపర్ ఫీచర్లు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. 10 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. 10 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
MS Dhoni, Suresh Raina Retirement: ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Embed widget