Safety Features: కారు కొంటున్నారా? అయితే, ఈ టాప్ 10 భద్రతా ఫీచర్లను పరిశీలించండి
కారు కొనే సమయంలో చాలా మంది భద్రత అంశాల విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కచ్చితంగా కారులోని భద్రతా ఫీచర్లను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయడం ఉత్తమం.
సొంత కారు అనేది చాలా మంది కల. కుటుంబం అంతా కలిసి కారులో ప్రయాణం చేయాలని చాలా మందికి ఉంటుంది. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కారు భద్రత విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకూడదు. అలా పట్టించుకోకపోవడం మూలంగానే భారత్ లో ప్రతి ఏటా వేల సంఖ్యంలో మరణాలు సంభవిస్తున్నాయి. అంతకు రెట్టింపు క్షతగాత్రులు అవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ఈ ప్రమాదాలలో చాలా వరకు అజాగ్రత్త, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా జరిగినవి అయినా.. కార్లలో సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. అందుకే కొత్త కారు అయినా, సెకెండ్ హ్యాండ్ కారు అయినా.. కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా సేఫ్టీ ఫీచర్లను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి. కార్లలోనే ముఖ్యమైన 10 సేఫ్టీ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1.డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ లు
భారతదేశంలో BNVSAP భద్రతా నిబంధనల ప్రకారం డ్రైవర్ వైపు ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి ఉంటుంది. డ్రైవర్ తో పాటు ప్రయాణీకుల కోసం కనీసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లతో వచ్చే కారు కోసం వెతకాలి. ప్రమాదం జరిగినప్పుడు తీవ్ర తగ్గించేందుకు ఎయిర్ బ్యాగ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. కారులోని వ్యక్తులు చనిపోకుండా కాపాడుతాయి.
2.EBDతో ABS
భారతదేశంలోని కొత్త వాహనాలు ప్రస్తుతం BNVSAP నిబంధనల ప్రకారం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో వస్తున్నప్పటికీ, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సెకెండ్ హ్యాండ్ కార్లలో ఇది లేదు. ABS బ్రేకింగ్ విషయంలో చక్రాలను పూర్తిగా లాక్ చేయడాన్ని నిరోధిస్తుంది. వాహనంపై డ్రైవర్ నియంత్రణను కలిగి ఉండేలా చేస్తుంది. సడెన్ బ్రేకింగ్ సమయంలో ABS కీలక పాత్ర పోషిస్తుంది. డ్రైవర్‌ను ముందు నుంచి వచ్చే అడ్డంకి నుంచితప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో జత చేయబడి.. ప్రయాణీకుల ప్రాణాలను కాపాడుతుంది.
3.రివర్స్ పార్కింగ్ సెన్సార్లు
ఇరుకైన ప్రదేశంలో, ముఖ్యంగా రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో కారును పార్కింగ్ చేయడం చాలా కష్టమైన పని. అటువంటి పరిస్థితుల్లో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉపయోగపడతాయి. పార్కింగ్‌లో డ్రైవర్‌కు సహాయం చేయడంతో పాటు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు పాదచారులకు భద్రతను కల్పిస్తాయి.
4.రివర్స్ పార్కింగ్ కెమెరా
రివర్స్ పార్కింగ్ కెమెరాల లక్ష్యం రివర్స్ పార్కింగ్ సెన్సార్‌ల మాదిరిగానే ఉంటుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా వాహనం వెనుక భాగాన్ని చూపడంతో పాటు, సరిగ్గా పార్క్ చేయడానికి డ్రైవర్‌కు సహాయ పడుతుంది.
5.సీట్బెల్ట్ ప్రీ-టెన్షనర్
సడెన్ బ్రేకింగ్ లేదంటే క్రాష్ అయినప్పుడు సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్ సహాయపడుతుంది. సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్ ఆక్యుపెంట్ యొక్క కదలికను నిరోధిస్తుంది. వారిని సీటుకు పరిమితం చేస్తుంది. ప్రస్తుతం, భారతదేశంలోని మెజారిటీ ప్యాసింజర్ కార్లు సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్‌లను కలిగి ఉన్నాయి.
6.కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్
కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ లేదంటే CSC అనేది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లేదంటే ESCలో భాగంగా వస్తుంది. CSC వాహనం అధిక వేగంతో నడుస్తున్నప్పుడు, కర్వింగ్ సమయంలో కారు బయటికి రోలింగ్ లేదంటే స్కిడ్డింగ్ కాకుండా కాపాడుతుంది. ఈ టెక్నాలజీ అందుకు అనుగుణంగా వీల్స్ కు బ్రేకింగ్ శక్తిని పంపిణీ చేస్తుంది. వాహనం యొక్క అన్ని వీల్స్ రోడ్డుపై ట్రాక్షన్ పొందేలా చేస్తుంది.
7.స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్
స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్ టెక్నాలజీ వాహనం ఒక నిర్దిష్ట వేగానికి చేరుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా కారు డోర్లు లాక్ అయ్యేలా చేస్తుంది. డ్రైవర్ లేదంటే మరే ఇతర వ్యక్తి డోర్‌లను క్లాక్ చేయడం మరచిపోయిన సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది.
8.ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్
చాలా సందర్భాల్లో, ప్రమాదం జరిగిన తర్వాత, కారు డోర్లు లాక్ చేయబడి ఉండటంతో ప్రయాణీలుకు లోపలే చిక్కుకుపోతారు. ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్ టెక్నాలజీ ఉన్న వాహనాలు.. ప్రమాదానికి గురైన వెంటనే డోర్లు అన్‌లాక్ అయ్యేలా చూసుకుంటాయి. దీంతో వాహనంలో ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
9.రీన్ఫోర్స్డ్ B పిల్లర్స్
సైడ్ క్రాష్ విషయంలో రీన్‌ఫోర్స్డ్ B పిల్లర్ చాలా వరకు ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. రీన్‌ఫోర్స్డ్ B పిల్లర్స్ వాహనానికి సంబంధించి నిర్మాణ నాణ్యతను, భద్రతను మెరుగుపరుస్తాయి.
10.ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్
ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు కుటుంబంలో పిల్లలను కలిగి ఉన్న వాహన యజమానులకు బాగా ఉపయోగపడతాయి. ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ కారులో చైల్డ్ సీటును సరిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇది పిల్లల భద్రతను పెంచుతుంది.