అన్వేషించండి

మీ కారు సేఫేనా? భారత్‌ NCAP పరీక్షల్లో 5 స్టార్‌, 4 స్టార్‌ రేటింగ్‌ పొందిన కార్లు ఫుల్‌ లిస్ట్‌ ఇదే

భారత్‌ NCAP ఇప్పటివరకు 29 కార్లకు క్రాష్‌ టెస్ట్‌లు చేసింది. 5 స్టార్‌, 4 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

India cars with 5 star and 4 star safety rating: ఇండియాలో కారు కొనుగోలు చేసే ముందు మైలేజ్‌, ఫీచర్లు మాత్రమే చూసే రోజులు మారాయి. ఇప్పుడు చాలామంది కొనుగోలుదారులు సేఫ్టీ రేటింగ్‌ను కూడా ప్రాధాన్యతగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రారంభించిన భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (Bharat NCAP) కీలక పాత్ర పోషిస్తోంది.

భారత్‌ NCAP లక్ష్యం ఒక్కటే - ఇండియాలో అమ్ముడవుతున్న కార్లు ఏదైనా ప్రమాద సమయంలో ప్రయాణికులను ఎంతవరకు రక్షిస్తాయో స్పష్టంగా చూపించడం. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఇప్పటివరకు ICE కార్లు, హైబ్రిడ్‌ కార్లు, ఎలక్ట్రిక్‌ కార్లు కలిపి మొత్తం 29 మోడళ్లకు క్రాష్‌ టెస్ట్‌లు చేశారు.

ఈ పరీక్షల్లో Adult Occupant Protection (AOP), Child Occupant Protection (COP) అనే రెండు విభాగాల్లో స్కోర్లు ఇచ్చి, చివరగా స్టార్‌ రేటింగ్‌ ప్రకటిస్తారు.

5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన కార్లు

భారత్‌ NCAP టెస్టింగ్‌లో ఎక్కువగా మెరిసినవి SUVలు. Vinfast VF7, Vinfast VF6, Tata Punch, Maruti Suzuki e Vitara, Honda Amaze, Citroen Aircross, Maruti Invicto, Tata Altroz, Maruti Victoris, Toyota Innova Hycross, Tata Harrier EV, Maruti Dzire, Tata Nexon EV, Kia Syros, Skoda Kylaq, Mahindra XEV 9e, Mahindra BE 6, Hyundai Tucson, Mahindra Thar Roxx, Mahindra XUV 3XO, Mahindra XUV400, Tata Nexon, Tata Curvv, Tata Curvv EV, Tata Punch EV, Tata Harrier, Tata Safari వంటి కార్లు 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ సాధించాయి.

ఈ కార్లలో చాలావరకు 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESC, ISOFIX చైల్డ్‌ సీట్‌ మౌంట్స్‌, TPMS, 3 పాయింట్‌ సీట్‌బెల్ట్స్‌ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. కొన్ని టాప్‌ వేరియంట్లలో ADAS లెవెల్‌ 2 కూడా అందిస్తున్నారు.

4 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ కార్లు

భారత్‌ NCAP టెస్టింగ్‌లో Maruti Suzuki Baleno, Citroen Basalt కార్లు 4 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందాయి. ఈ కార్లు కూడా సాధారణ వినియోగానికి సేఫ్‌గానే ఉన్నప్పటికీ, కొన్ని అదనపు సేఫ్టీ ఫీచర్లు ఉంటే 5 స్టార్‌కు చేరుకునే అవకాశం ఉండేదని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకు భారత్‌ NCAP ముఖ్యం?

ఇండియన్‌ రోడ్ల పరిస్థితులు, ట్రాఫిక్‌, ప్రమాదాల తీవ్రత దృష్టిలో పెట్టుకుంటే, ఈ రేటింగ్‌లు కొనుగోలుదారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తున్నాయి. రేటింగ్‌ ఎంత ఎక్కువగా ఉంటే (5 స్టార్‌ గరిష్టం), ఏదైనా ప్రమాద సమయంలో ప్రాణముప్పు అంత తక్కువగా ఉంటుంది.

మొత్తంగా చెప్పాలంటే, భారత్‌ NCAP వల్ల ఇండియాలో కార్ల భద్రత ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. మీరు కూడా కారు కొనుగోలే చేసే ముందు, ఈ సేఫ్టీ రేటింగ్‌ లిస్ట్‌ను మరొకసారి తప్పకుండా చూడండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.   

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget