అన్వేషించండి

Fortuner, Kodiaqకి పోటీగా MG Majestor: టీజర్‌ రిలీజ్‌ - లుక్‌, ఫీచర్లు, లాంచ్‌ డేట్‌ ఇవే!

JSW MG Motor India విడుదల చేసిన MG మాజెస్టర్‌ టీజర్‌ వీడియో ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 12న లాంచ్‌ కానున్న ఈ SUV, Fortuner, Kodiaqలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

MG Majestor SUV Details Telugu: భారత్‌లో ఫుల్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌ మరింత హీట్‌ ఎక్కుతోంది. ఇప్పటికే Toyota Fortuner, Skoda Kodiaq లాంటి బలమైన మోడళ్లున్న ఈ సెగ్మెంట్‌లోకి ఇప్పుడు ఎంజీ మాజెస్టర్‌ (MG Majestor) ఎంట్రీ ఇవ్వబోతోంది. ఫిబ్రవరి 12న అధికారికంగా లాంచ్‌ కావడానికి ముందు, JSW MG Motor India, ఈ SUV టీజర్‌ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో పూర్తిగా బయట డిజైన్‌ మాత్రమే చూపించారు.

MG లైనప్‌లో, ICE విభాగంలో ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా ఉన్న MG Gloster కంటే పై స్థాయిలో ఈ మాజెస్టర్‌ను ప్లేస్‌ చేయనున్నారు. అంటే ధర, ఫీచర్లు, రోడ్‌ ప్రెజెన్స్‌ అన్నీ కూడా మరింత ప్రీమియంగా ఉండబోతున్నాయన్న మాట.

బయట డిజైన్‌ హైలైట్స్‌

టీజర్‌ వీడియోలో కనిపించిన MG మాజెస్టర్‌ లుక్‌ చూస్తే మొదట ఆకట్టుకునేది దాని భారీ ఫ్రంట్‌ గ్రిల్‌. మధ్యలో పెద్దగా MG లోగో పెట్టి, కింద భాగంలో సిల్వర్‌ కలర్‌ స్కిడ్‌ ప్లేట్‌ ఇచ్చారు. ఈ డిజైన్‌ SUVకి గట్టి, రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌ను ఇస్తోంది.

ముందు భాగంలో L-షేప్‌ LED DRLs ఇచ్చారు. ఇవి కనెక్ట్‌ కాకుండా విడిగా ఉండటం గమనించవచ్చు. హెడ్‌ల్యాంప్స్‌ను మాత్రం వర్టికల్‌గా స్టాక్‌ చేసిన LED యూనిట్లుగా డిజైన్‌ చేశారు. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చాలా SUVలతో పోలిస్తే మాజెస్టర్‌కు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.

సైడ్‌ ప్రొఫైల్‌లో కనిపించిన మషీన్డ్‌ ఫినిష్‌ అలాయ్‌ వీల్స్‌ సుమారు 19 అంగుళాల సైజ్‌లో ఉండే అవకాశం ఉంది. టీజర్‌లో బ్లాక్‌ కలర్‌ బాడీ షేడ్‌ చూపించడంతో SUV మరింత ప్రీమియంగా కనిపిస్తోంది.

Auto Expo 2025లో ప్రదర్శన

MG మాజెస్టర్‌ను ఇప్పటికే Auto Expo 2025లో ప్రదర్శించారు. అయితే అప్పట్లో ఇంటీరియర్‌ను మాత్రం బయటకు చూపించలేదు. అయినా, అంచనాల ప్రకారం ఇందులో 12.3 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, 12.3 అంగుళాల టచ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, వైర్‌లెస్‌ చార్జర్‌, పానోరమిక్‌ సన్‌రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, పవర్డ్‌ సీట్లు, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, మల్టిపుల్‌ డ్రైవ్‌ మోడ్స్‌ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఇంజిన్‌, గేర్‌బాక్స్‌ వివరాలు

MG మాజెస్టర్‌లో ఏ ఇంజిన్‌ ఆప్షన్లు ఇస్తారన్న విషయంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇందులో MG Glosterలో ఉన్న 2.0 లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ ట్విన్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌నే ఉపయోగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఇంజిన్‌ 215hp పవర్‌, 478Nm టార్క్‌ ఇస్తుంది. దీనికి 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ జతచేసి, ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ (4WD) సిస్టమ్‌తో అందించవచ్చు.

అయితే, Glosterలో లభించే 161hp సింగిల్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌ మాజెస్టర్‌లో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

అంచనా ధరలు

MG మాజెస్టర్‌ ధరలు MG Gloster కంటే ఎక్కువగా ఉండనున్నాయి. ప్రస్తుతం Gloster ఎక్స్‌-షోరూమ్‌ ధరలు రూ. 38.33 లక్షల నుంచి రూ. 43.16 లక్షల వరకు ఉన్నాయి. అదే సమయంలో Toyota Fortuner ధరలు రూ. 34.16 లక్షల నుంచి రూ. 49.59 లక్షల వరకు, Skoda Kodiaq ధరలు రూ. 39.99 లక్షల నుంచి రూ. 43.76 లక్షల వరకు ఉన్నాయి.

ఈ లెక్కన చూస్తే, MG మాజెస్టర్‌ ధర రూ. 45 లక్షల పైగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మొత్తానికి, ఫిబ్రవరి 12న లాంచ్‌ కానున్న MG మాజెస్టర్‌... డిజైన్‌, ఫీచర్లు, రోడ్‌ ప్రెజెన్స్‌ పరంగా Fortuner, Kodiaqలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget