Best Selling Bikes: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ బైక్స్ ఇవే - టాప్‌లో ఏముందో తెలుసా?
Best Selling Two Wheelers: భారతదేశంలో టూ వీలర్ వాహనాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ బైక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
Top Selling Two Wheelers in India: భారతీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాలు అమ్మకాలు బాగా పెరిగాయి. భారతదేశంలో ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే హీరో స్ప్లెండర్ అనే పేరు ముందుగా వినిపిస్తుంది. హీరో స్ప్లెండర్ సేల్స్‌లో మరోసారి టాప్ పొజిషన్ దక్కించుకుంది. 2024 సెప్టెంబర్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే హీరో స్ప్లెండర్ పేరు టాప్ లిస్ట్‌లో ఉంది.
అమ్మకాల జాబితాలో హీరో స్ప్లెండర్ టాప్‌లో...
హీరో స్ప్లెండర్ సెప్టెంబర్ నెలలో మొత్తం 3,75,886 యూనిట్ల మోటార్ సైకిళ్లను విక్రయించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 3,19,693గా ఉంది. ఈ రెండింటినీ బేస్ చేసుకుని చూస్తే హీరో స్ప్లెండర్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 17.58 శాతం పెరిగాయి.
రెండో స్థానంలో హోండా షైన్
ఈ జాబితాలో రెండో స్థానం గురించి మాట్లాడినట్లయితే హోండా షైన్ ఆ ప్లేస్‌ను దక్కించుకుంది. హోండా షైన్ గతేడాదితో పోలిస్తే 12.56 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. హోండా షైన్‌కు సంబంధించి ఈ సెప్టెంబర్‌లో 1,81,835 యూనిట్లు అమ్ముడుపోయాయి. అమ్మకాల పరంగా బజాజ్ పల్సర్ మూడో స్థానంలో ఉంది. 15.86 శాతం వార్షిక వృద్ధితో బజాజ్ పల్సర్ 1,89,182 యూనిట్లు అమ్ముడుపోయాయి.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
నాలుగు, ఐదు స్థానాల్లో ఏం ఉన్నాయి?
అమ్మకాల పరంగా హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ నాలుగో స్థానంలో ఉంది. సెప్టెంబర్ నెలలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ మొత్తం 1,13,827 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 35.32 శాతం పెరిగింది. ఇది మాత్రమే కాకుండా బజాజ్ ప్లాటినా అమ్మకాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. బజాజ్ ప్లాటినా గతేడాది కంటే 2.38 శాతం పెరుగుదలతో మొత్తం 49,774 యూనిట్లను అమ్ముడుపోయింది.
మిగతా స్థానాల్లో ఇవే...
ఈ జాబితాలో టీవీఎస్ రైడర్ ఆరో స్థానంలో ఉండగా, టీవీఎస్ అపాచీ ఏడో స్థానంలో ఉంది. టీవీఎస్ అపాచీ వార్షికంగా 55.52 శాతం వృద్ధితో మొత్తం 41,640 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఇది కాకుండా హీరో ఎక్స్‌ట్రీమ్ 125 సెప్టెంబర్ నెలలో 37,520 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించి ఎనిమిదో స్థానంలో ఉంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
In 2023, Hero made waves at EICMA, the premier global showcase for two-wheelers.
— Hero MotoCorp (@HeroMotoCorp) October 19, 2024
In 2024, Hero is back—bigger, bolder, and more innovative than ever!
The future of mobility starts here—are you ready for the next chapter?@VidaDotWorld#HeroAtEICMA #EndlessPossibilities… pic.twitter.com/tO6cbjfAQI
Are you a proud member of the Hero family? If your answer is yes, then this exciting & exclusive opportunity is just for you!
— Hero MotoCorp (@HeroMotoCorp) October 15, 2024
Last Day to Participate in #MyHeroForever contest and stand a chance to win “The Centennial” Collector’s Edition Motorcycle!
Visit… pic.twitter.com/qvAKWpPPM3