అన్వేషించండి

₹15 లక్షల్లో ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌, ADAS ఫీచర్లున్న బెస్ట్‌ SUV ఆప్షన్స్‌ - ఫస్ట్‌టైమ్‌ కార్‌ బయ్యర్స్‌కు పర్ఫెక్ట్‌!

Car Guide For First Time Buyers: ₹15 లక్షల బడ్జెట్‌లో ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌, ADAS ఫీచర్లతో SUV కొనాలనుకుంటున్నారా? Kia Sonet, Hyundai Venue లాంటి మోడల్స్‌ ఫస్ట్‌టైమ్‌ బయ్యర్స్‌కి సూపర్‌ ఆప్షన్స్‌!.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Best Automatic And ADAS Featured Compact SUVs Under 15 Lakh: మొదటిసారి మంచి కారు కొనాలనుకుంటున్నవారికి ఇప్పుడు మార్కెట్లో కాంపాక్ట్‌ SUV సెగ్మెంట్‌ బెస్ట్‌ చాయిస్‌గా మారింది. రోడ్డుపై డ్రైవింగ్‌ కంఫర్ట్‌, సౌకర్యవంతమైన సిట్టింగ్‌ పొజిషన్‌, అలాగే సేఫ్టీ ఫీచర్లతో కాంపాక్ట్‌ SUVలు యూత్‌కి ఆకర్షణగా మారాయి. రూ. 15 లక్షల బడ్జెట్‌లో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ & ADAS ఫీచర్లతో ఉన్న కొన్ని మోడల్స్‌ ఫస్ట్‌ టైమ్‌ బయ్యర్స్‌కి పర్ఫెక్ట్‌ ఆప్షన్స్‌గా ఉన్నాయి.

Kia Sonet - స్టైల్‌ & టెక్నాలజీ కలయిక      
Kia Sonet ఇప్పటికే యువతలో పాపులర్‌. దీని ఇంటీరియర్‌ క్వాలిటీ, ఇంజిన్‌ స్మూత్‌నెస్‌ & ఫీచర్స్‌ ఈ క్లాస్‌లో బెస్ట్‌. బ్లాక్‌ కలర్‌ డాష్‌బోర్డ్‌, 10.25 ఇంచ్‌ టచ్‌ స్క్రీన్‌, వెంట్‌లేటెడ్‌ సీట్లు, బోస్‌ సౌండ్‌ సిస్టమ్‌ లాంటి ఫీచర్లు లగ్జరీ ఫీల్‌ ఇస్తాయి. ఆటోమేటిక్‌ వెర్షన్ల ఎక్స్‌-షోరూమ్‌ ధర హైదరాబాద్‌ & విజయవాడలో రూ. 11.59 లక్షల నుంచి (Kia Sonet Automatic ex-showroom price, Hyderabad Vijayawada) మొదలవుతుంది. రిజిస్ట్రేషన్‌, బీమా, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుని ఆన్‌-రోడ్‌ ధర రూ. 14.38 లక్షల నుంచి (Kia Sonet Automatic on-road price, Hyderabad Vijayawada) ప్రారంభమవుతుంది, స్పెసిఫేకన్లను బట్టి రేటు మారుతుంది.

ఈ కారులోని ADAS ఫీచర్లు - ఫార్వర్డ్‌ కాలిషన్‌ వార్నింగ్‌, లేన్‌ కీప్‌ అసిస్టు, డ్రైవర్‌ అటెన్షన్‌ మానిటర్‌, ఇంకా మరికొన్ని అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఆప్షన్స్‌ ఉన్నాయి. వీటివల్ల లాంగ్‌ డ్రైవ్‌లో కూడా మీరు సురక్షితంగా గమ్యం చేరగలరన్న నమ్మకం కలుగుతుంది.

Hyundai Venue - వెయిట్‌ చేయదగ్గ SUV     
Hyundai Venue కొత్త వెర్షన్‌ మరికొన్ని వారాల్లో లాంచ్‌ అవ్వబోతోంది. ఇందులో కొత్త డిజైన్‌తో పాటు మెరుగైన ADAS ప్యాకేజ్‌ కూడా అందించనున్నారని అంచనా. హ్యుందాయ్‌ ఇంజిన్లు ఎప్పుడూ స్మూత్‌గా, నాయిస్‌ లెవెల్స్‌ తక్కువగా ఉండడం వల్ల ఫస్ట్‌ టైమ్‌ యూజర్లకి కంఫర్ట్‌గా ఉంటుంది. కొత్త Venue లో 1.0 టర్బో పెట్రోల్‌ & 1.2 లీటర్‌ ఇంజిన్‌ ఆప్షన్స్‌తో ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ ఆప్షన్స్‌ కూడా పరిశీలించవచ్చు                      
కియా సోనెట్‌ & హ్యుందాయ్‌ వెన్యూ కాకుండా Maruti Fronx, Tata Nexon AMT, Mahindra XUV300 వంటి SUVలు కూడా ఈ బడ్జెట్‌లో కంఫర్ట్‌ & సేఫ్టీ కలిపిన ఆప్షన్స్‌గా ఉన్నాయి. ముఖ్యంగా Nexonలో 6 ఎయిర్‌ బ్యాగ్స్‌, ESP వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.   

ఫస్ట్‌టైమ్‌ కార్‌ కొనుగోలు చేస్తున్న వాళ్లు ఆటోమేటిక్‌ గేర్‌ బాక్స్‌ ఉన్న SUV ఎంచుకోవడం చాలా స్మార్ట్‌ ఆప్షన్‌. డ్రైవింగ్‌ సులభంగా ఉండటంతో పాటు ADAS ఫీచర్లు అదనపు సేఫ్టీని ఇస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో Kia Sonet పర్ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌ కారు. అయితే, మరికొన్ని వారాల్లో రాబోయే Hyundai Venue కూడా స్మార్ట్‌ బయ్యర్స్‌ వెయిట్‌ చేయదగ్గ SUVగా చెప్పవచ్చు. 

Frequently Asked Questions

మొదటిసారి కారు కొనేవారికి కాంపాక్ట్ SUVలు ఎందుకు మంచి ఎంపిక?

కాంపాక్ట్ SUVలు డ్రైవింగ్ కంఫర్ట్, సౌకర్యవంతమైన సీటింగ్, మరియు సేఫ్టీ ఫీచర్లతో యువతను ఆకర్షిస్తున్నాయి.

రూ. 15 లక్షలలోపు ఆటోమేటిక్ మరియు ADAS ఫీచర్లతో ఏ SUVలు అందుబాటులో ఉన్నాయి?

Kia Sonet, Hyundai Venue (త్వరలో రానుంది), Maruti Fronx, Tata Nexon AMT, మరియు Mahindra XUV300 వంటి SUVలు ఈ బడ్జెట్‌లో లభిస్తున్నాయి.

Kia Sonet లో ఎలాంటి ADAS ఫీచర్లు ఉన్నాయి?

Kia Sonet లో ఫార్వర్డ్ కాలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్టు, డ్రైవర్ అటెన్షన్ మానిటర్ వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఆప్షన్స్ ఉన్నాయి.

Tata Nexon లో ఉండే కొన్ని ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఏమిటి?

Tata Nexon లో 6 ఎయిర్ బ్యాగ్స్, ESP వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి, ఇవి అదనపు భద్రతను అందిస్తాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
Advertisement

వీడియోలు

మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
Harish Rao Challenges Revanth Reddy: రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Malavika Mohanan: ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
త్వరలో మార్కెట్లోకి కొత్త Skoda Kushaq.. పనోరమిక్ సన్‌రూఫ్ సహా లెవెల్-2 ADAS ఫీచర్లు
త్వరలో మార్కెట్లోకి కొత్త Skoda Kushaq.. పనోరమిక్ సన్‌రూఫ్ సహా లెవెల్-2 ADAS ఫీచర్లు
Embed widget