Bajaj Qute Auto Taxi: సామాన్యుల కోసం ‘బజాజ్ క్యూట్’ - మారుతీ ఆల్టోకు గట్టిపోటీ, ధర ఎంతంటే..
బజాజ్ క్యూట్ 4W ఆటోమొబైల్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఆటో ట్యాక్సీగా ఉపయోగపడిన ఈ వాహనం ఇకపై వ్యక్తిగత అవసరాల కోసం వాడునుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం వాణిజ్యపరమైన అవసరాల కోసం అందుబాటులో ఉన్న బజాజ్ క్యూట్ వాహనం, ఇకపై వ్యక్తిగత ఉపయోగం కోసం అందుబాటులోకి రాబోతోంది. తాజా NCAT రకం క్లియరెన్స్ ప్రకారం.. 2023 క్యూట్ ఇప్పుడు మరింత శక్తివంతంగా రూపొందుతోంది. ఇప్పటి వరకు ఉన్న బరువుతో పోల్చితే అదనంగా 17 కిలోల బరువు ఉంటుంది. ప్రైవేట్/నాన్-ట్రాన్స్ పోర్ట్ విభాగంలో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఆటోరిక్షాకు ప్రత్యామ్నాయం క్వాడ్రిసైకిల్
క్వాడ్రిసైకిల్ అనే పదం భారత్ లో పెద్దగా తెలియదు. ఈ వాహనం త్రీ-వీలర్, ఫోర్-వీలర్ మధ్యస్థంగా ఉంటుంది. కార్ల మాదిరిగా ఉన్నా.. కార్ల చట్టాలకు లోబడి ఉండదు. ఈ క్వాడ్రిసైకిల్ 2018లో విడుదల అయ్యింది. ఆటోరిక్షాకు ప్రత్యామ్నాయంగా రూపొందించారు. దీని ధర రూ.2.48 లక్షలు ఉంది. రెండు సీట్లు(డ్రైవర్‌తో కలిపి నలుగురు కూర్చోవచ్చు) ఉంటాయి. క్యూట్‌లో మోనోకోక్ నిర్మాణం, స్థిరమైన పైకప్పు ఉంది. ఇది చాలా సౌకర్యంగా, రక్షణతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుతుంది.
బజాజ్ ప్రస్తుతం ప్రైవేట్ కొనుగోలుదారుల కోసం Quteని ప్రారంభించాలని భావిస్తోంది. అయితే, 2018లో విడుదలైన సమయంలో ప్రైవేట్ కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పలేదు. చివరకు ప్రైవేట్/నాన్-ట్రాన్స్ పోర్ట్ కేటగిరీలో బజాజ్ క్యూట్ రకానికి ఆమోదం లభించింది. ఇది గంటకు 70 కిమీ వేగంతో ప్రయాణించనుంది. పవర్ 10.8 హార్స్ పవర్ నుంచి 12.8 హార్స్ పవర్‌కి పెరిగింది.
పెరిగిన వాహనం బరువు, ఇంజిన్ శక్తి
గతంలో Qute పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని బరువు 451 కిలోలు. CNG 500 కిలోల బరువు ఉండేది. బజాజ్ క్యూట్ 4W కార్లలో ప్రసిద్ధి చెందిన రోలింగ్ విండోస్ కంటే స్లైడింగ్ విండోలను కలిగి ఉంది. ప్రామాణిక విండోలు, ఎయిర్ కండిషనింగ్ జోడింపు కారణంగా అదనంగా 17 కిలోల బరువు పెరిగే అవకాశం ఉంది. డ్రైవర్‌తో సహా నలుగురు వ్యక్తులకు సీటింగ్ అవకాశం ఉంటుంది.
బజాజ్ క్యూట్ 216 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పని చేస్తుంది. 4W 10.8 హార్స్ పవర్ తో పాటు 16.1 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పవర్ 2 బిహెచ్‌పి పెరిగి 12.8 బిహెచ్‌పి చేరుకుంది. కానీ, టార్క్ లో ఎలాంటి మార్పు లేదు. ఆటోరిక్షాలో కనిపించే విధంగా రివర్స్ గేర్ తో కూడిన 5-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్ ఈ ఇంజన్‌తో జత చేయబడింది. H ప్యాటర్న్ గేర్ బాక్స్ లేదు.
ధర ఎంత ఉండవచ్చంటే?
2018లో లాంచింగ్ సమయంలో దాని ధర రూ. 2.48 లక్షలు. దీనిపై అనదంగా మరో రూ. 2.8 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వాహనంలో కొత్తగా ఎయిర్ కండిషనింగ్, ఇతర ప్రామాణిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ఈ ధర బెస్ట్ అనుకోవచ్చు. భారత్ లో ప్రస్తుతం అత్యంత చౌకైన కారు మారుతి ఆల్టో 800. ప్రస్తుతం దీని ధర రూ. 3.40 లక్షలతో ప్రారంభం అవుతుంది. అయితే, క్యూట్ మారుతీ కంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది.
Read Also: రూ.10 లక్షల లోపు హ్యాచ్ బ్యాక్ కారు కొనాలి అనుకుంటున్నారా? అయితే, ఓసారి లిస్టు చూడండి!