అన్వేషించండి

Bajaj Launches New Dominar 400 Bike: బజాజ్ నుండి సంచలనం.. రూ. 37,000 తగ్గిన కొత్త డోమినార్ 400 ధర! ఇంజిన్ CC మార్పుతో భారీ లాభం!

బజాజ్ ఆటో కొత్త డోమినార్ 400ను 350సీసీ ఇంజిన్‌తో విడుదల చేసింది. ట్యాక్స్ తగ్గింపు వల్ల ఈ బైక్ ధర రూ. 37,000 వరకు తగ్గింది.

Bajaj Launches New Dominar 400 with 350cc Engine: ఇండియ‌న్ టూరింగ్ మోటార్ సైకిల్ రంగంలో బజాజ్ ఆటో ఒక కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. తన పాపులర్ మోడల్ 'డోమినార్ 400'ను సరికొత్త 350సీసీ ఇంజిన్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మార్పు వెనుక ఒక తెలివైన వ్యూహం ఉంది. కొత్తగా రూపొందించిన 349సీసీ ఇంజిన్ వల్ల ఈ బైక్ ఇప్పుడు తక్కువ పన్ను పరిధిలోకి వస్తుంది. గతంలో ఈ బైక్ పై 40 శాతం ట్యాక్స్ ఉండేది, ఇప్పుడది కేవలం 18 శాతానికి తగ్గింది. దీనివల్ల కస్టమర్లకు భారీ ఊరట లభిస్తోంది. కొత్త డోమినార్ 400 ధర ఇప్పుడు రూ. 2.04 లక్షల (ఎక్స్‌షోరూమ్) వద్ద లభిస్తోంది. అంటే పాత మోడల్ కంటే ఏకంగా రూ. 37,000 ధర తగ్గడం విశేషం.

ఇంజిన్ - పర్ఫార్మెన్స్ ..
కొత్తగా అభివృద్ధి చేసిన 349సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఇప్పుడు 9,000 ఆర్‌పీఎమ్ వద్ద 40.6 హెచ్‌పి పవర్, 7,500 ఆర్‌పీఎమ్ వద్ద 33.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత 373సీసీ ఇంజిన్‌తో పోలిస్తే పవర్ 0.6 హెచ్‌పి పెరిగింది. అయితే టార్క్ మాత్రం 1.8 ఎన్ఎమ్ మేర తగ్గింది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బరువు విషయానికి వస్తే, కొత్త డోమినార్ ఇప్పుడు 3 కేజీలు తగ్గి 190 కేజీల బరువుతో మరింత తేలికగా మారింది. దీనివల్ల బైక్ నడపడం మరింత సులభం అవుతుంది అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

టూరింగ్ ఫీచర్లు - డిజైన్..
ఇంజిన్ మినహా బైక్ డిజైన్ లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇది ఇప్పటికీ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. లాంగ్ రైడ్స్ వెళ్లే వారి కోసం విండ్‌స్క్రీన్, హ్యాండ్ గార్డ్స్, లగేజ్ మౌంట్స్ వంటి టూరింగ్ యాక్సెసరీస్ అన్నీ అలాగే ఉన్నాయి. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, స్ప్లిట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌డీ (USD) ఫ్రంట్ ఫోర్క్స్ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) సౌకర్యం ఉంది. అలాగే స్లిప్పర్ క్లచ్ ఫీచర్ ఉండటం వల్ల గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది అని నిపుణులు పేర్కొంటున్నారు.

మ‌రింత మందికి అందుబాటులోకి..
ఈ సందర్భంగా బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే మాట్లాడుతూ.. డోమినార్ ఎప్పుడూ టూరింగ్ డీఎన్ఏను కలిగి ఉంటుందని, కొత్త 350సీసీ ఇంజిన్‌తో డోమినార్‌ను మరింత మందికి అందుబాటులోకి తెస్తున్నామ‌ని పేర్కొన్నారు. తక్కువ ధరలో అదే పవర్, అదే కంఫర్ట్ రైడర్లకు లభిస్తుందని, ఇండియాలో స్పోర్ట్స్ టూరింగ్‌ను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది ఒక నిర్ణయాత్మక అడుగని తెలిపారు. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తగ్గడం వల్ల ఈ బైక్ యువతను బాగా ఆకర్షిస్తోంది. టూరింగ్ ఇష్టపడే వారికి తక్కువ ధరలో దొరికే బెస్ట్ ఆప్షన్ ఇదేనని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేసున్నారు. ఏదేమైనా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇంజిన్ సీసీ తగ్గించడంతో టాక్స్ లాభాన్ని వినియోగదారులకు బజాాజ్ ఆటో అందించింది. తాజా నిర్ణయంతో ఈ బైక్ సేల్స్ పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రయ పడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget