అన్వేషించండి

AWD క్రాస్‌ఓవర్‌ Vs 4x4 SUV: అసలు శక్తి దేనిలో ఉంది?

AWD క్రాస్‌ఓవర్‌కి, 4x4 SUVకి మధ్య అసలు తేడా ఏమిటి? ఆఫ్‌రోడ్‌, టోయింగ్‌, గ్రౌండ్‌ క్లియరెన్స్‌లో 4x4 SUV ఎందుకు బెస్ట్‌ ఎంపికో పూర్తి వివరాలు తెలుసుకోండి.

SUV Towing Capability: మన దేశంలో SUVల డిమాండ్‌కు తగ్గట్లుగా, ప్రతి నెలలోనూ కొత్తవి మార్కెట్‌లోకి దిగుతున్నాయి. అయితే, చాలా మంది కొనుగోలుదారుల్లో సహజంగా ఉండే ఒక ప్రశ్న - రఫ్‌ రోడ్లకు AWD క్రాస్‌ఓవర్‌ సరిపోతుందా? లేక నిజమైన 4x4 SUV అవసరమా?. బయట నుంచి చూస్తే రెండూ ఒకేలా కనిపించినప్పటికీ... మెకానికల్‌గా, ఉపయోగంలో మాత్రం వీటి మధ్య పెద్ద తేడా ఉంటుంది.

నగరాల్లో రోజువారీ డ్రైవింగ్‌కి AWD క్రాస్‌ఓవర్‌ బాగానే అనిపించవచ్చు. కానీ రఫ్‌ రోడ్లు, కొండ ప్రాంతాలు, ఆఫ్‌రోడ్‌ ప్రయాణాలు ఎక్కువగా ఉంటే మాత్రం నిజమైన 4x4 SUV తన అసలు శక్తిని చూపిస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలను సులభంగా చూద్దాం.

లో-రేంజ్‌ గేరింగ్‌ - 4x4కి పెద్ద ప్లస్‌

చాలా 4x4 SUVలలో లో-రేంజ్‌ ట్రాన్స్‌ఫర్‌ కేస్‌ ఉంటుంది. ఇది తక్కువ వేగంలో ఎక్కువ టార్క్‌ అందించి, పెద్ద రాళ్లు, కఠిన ఎక్కిళ్లు, లోతైన గుంతలపై వాహనం నెమ్మదిగా, కానీ ధైర్యంగా సాగేందుకు సహాయపడుతుంది. AWD క్రాస్‌ఓవర్‌లలో ఈ సౌకర్యం ఉండదు. అందుకే కఠిన పరిస్థితుల్లో వీటి గ్రిప్‌, కంట్రోల్‌ త్వరగా తగ్గిపోతాయి.

లాడర్‌ ఫ్రేమ్‌ నిర్మాణం

నిజమైన SUVలలో ఎక్కువగా లాడర్‌ ఫ్రేమ్‌ ఛాసిస్‌ ఉంటుంది. ఇది మలుపులు, షాక్స్‌, భారీ లోడ్లను తట్టుకునేలా రూపొందిస్తారు. ఆఫ్‌రోడ్‌లో వచ్చే ఒత్తిడిని ఈ ఫ్రేమ్‌ బాగా తట్టుకుంటుంది. కానీ AWD క్రాస్‌ఓవర్‌లు ఎక్కువగా మోనోకాక్‌ బాడీపై ఆధారపడతాయి. ఇవి నగర వినియోగానికి బాగుంటాయి కానీ తీవ్రమైన ఆఫ్‌రోడ్‌లో అంత బలంగా ఉండవు. అందుకే టోయింగ్‌, ఓవర్‌ల్యాండింగ్‌ వంటి అవసరాలకు SUVలే మెరుగైనవి.

ఎక్కువ గ్రౌండ్‌ క్లియరెన్స్‌, మెరుగైన యాంగిల్స్‌

4x4 SUVలు నేల నుంచి ఎక్కువ ఎత్తులో ఉంటాయి. దీనివల్ల అప్రోచ్‌, డిపార్చర్‌, ర్యాంప్‌ ఓవర్‌ యాంగిల్స్‌ మెరుగ్గా ఉంటాయి. రాళ్లు, పాడైన రోడ్లు, ఎత్తైన మట్టిబాటలపై వెళ్తున్నప్పుడు బాడీ తగలే అవకాశాలు తక్కువ. AWD క్రాస్‌ఓవర్‌లలో గ్రౌండ్‌ క్లియరెన్స్‌ తక్కువగా ఉండటం, ఓవర్‌హ్యాంగ్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల అసలు రోడ్డు ముగిసిన తర్వాత మీ ప్రయాణం పరిమితమవుతుంది.

కఠిన పరిస్థితుల్లో పనితీరు

పూర్తిస్థాయి 4x4 సిస్టమ్‌లు మట్టి, ఇసుక, మంచు, లూజ్‌ గ్రావెల్‌ వంటి పరిస్థితుల కోసం ప్రత్యేకంగా ట్యూన్‌ చేస్తారు. కనీసం ఒక ముందు చక్రం, ఒక వెనుక చక్రానికి శక్తి చేరేలా ఇవి పనిచేస్తాయి. AWD సిస్టమ్‌లు ప్రధానంగా తడి రోడ్లు, లైట్‌ ట్రైల్స్‌ కోసం డిజైన్‌ చేస్తారు. ఎక్కువసేపు హెవీ ఆఫ్‌రోడ్‌లో వాడితే ఇవి వేడెక్కి పనితీరు తగ్గించే అవకాశాలు ఉంటాయి.

టోయింగ్‌, లోడ్‌ మోయడంలో ముందంజ

లాడర్‌ ఫ్రేమ్‌, బలమైన డ్రైవ్‌ట్రైన్‌ కారణంగా 4x4 SUVలు ఎక్కువ టోయింగ్‌ కెపాసిటీ ఇస్తాయి. ట్రైలర్లు, రూఫ్‌ లోడ్లు, పూర్తి ప్రయాణికులతో కూడిన ప్రయాణాలు కూడా రఫ్‌ రోడ్లపై సులభంగా చేస్తాయి. AWD క్రాస్‌ఓవర్‌లు ఇక్కడ అంత బలంగా ఉండవు.

కొన్ని లోపాలు కూడా...

SUVలలో లాడర్‌ ఫ్రేమ్‌, 4x4 హార్డ్‌వేర్‌ వల్ల బరువు ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం మైలేజ్‌, ఆన్‌ రోడ్‌ హ్యాండ్లింగ్‌పై పడుతుంది. మీ ప్రయాణాలు ఎక్కువగా నగరాల్లో, అప్పుడప్పుడు వర్షంలో లేదా బ్యాడ్‌ రోడ్లపై ఉంటే AWD క్రాస్‌ఓవర్‌ సరిపోతుంది. కానీ ఆఫ్‌రోడ్‌, గ్రామీణ రోడ్లు, టోయింగ్‌ అవసరాలు తరచుగా ఉంటే మాత్రం 4x4 SUVనే సరైన ఎంపిక.

కారు ఎంపిక అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సౌకర్యం, మైలేజ్‌ ముఖ్యం అనుకుంటే AWD క్రాస్‌ఓవర్‌ బాగుంటుంది. కానీ అసలు రోడ్డు ముగిసిన తర్వాత కూడా భయపడకుండా వెళ్లాలంటే, నిజమైన 4x4 SUVకి ప్రత్యామ్నాయం లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget