అన్వేషించండి

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న కార్ నడుపుతున్నారా? ఈ కాస్ట్‌లీ తప్పులు మీరు మాత్రం చేయకండి!

ఆటోమేటిక్ కార్లను నడపడం ఈజీగా ఉన్నా, తప్పుగా నడిపితే గేర్‌బాక్స్ నష్టం, భారీ రిపేర్ ఖర్చులు వస్తాయి. ట్రాఫిక్‌లో న్యూట్రల్ వాడకం, సర్వీస్ విస్మరణ, హిల్ డ్రైవింగ్ తప్పుల గురించి తెలుసుకోండి.

Automatic Car Driving Mistakes: తెలుగు రాష్ట్రాల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. క్లచ్ అవసరం లేకుండా సులభంగా నడపగలిగే సౌకర్యం వల్ల చాలామంది ఇప్పుడు ఆటోమేటిక్ వాహనాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇవి యూజర్ ఫ్రెండ్లీ అయినప్పటికీ సరైన విధంగా నడపకపోతే భారీ రిపేర్ ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకుని, కొన్ని సాధారణ తప్పులను నివారిస్తే గేర్‌బాక్స్ ఆయుష్షు పెరుగుతుంది.

1. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర న్యూట్రల్ చేయడం

చాలామంది సిగ్నల్ వద్ద ఎక్కువసేపు ఆగినప్పుడు గేర్‌ను న్యూట్రల్‌లో పెడతారు. ఇంధనం ఆదా అవుతుందని భావిస్తారు. కానీ ఆధునిక ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ‘డ్రైవ్’ మోడ్‌లోనే బ్రేక్ నొక్కి నిలిపేలా రూపొందించారు. తరచూ డ్రైవ్ నుంచి న్యూట్రల్‌కు మార్చడం వల్ల అంతర్గత భాగాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. సాధారణ ట్రాఫిక్ పరిస్థితుల్లో డ్రైవ్‌లో ఉంచి బ్రేక్ నొక్కి పెడితే సరిపోతుంది.

2. ట్రాన్స్‌మిషన్ సర్వీస్ విస్మరించడం

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సరైన విధంగా పనిచేయాలంటే ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ కీలకం. ఇది లూబ్రికేషన్, కూలింగ్ & స్మూత్ షిఫ్టింగ్‌కు సహాయపడుతుంది. సమయానికి ఫ్లూయిడ్ మార్చకపోతే ధూళి, మలినాలు చేరి గేర్ మార్పులు గట్టిగా అనిపిస్తాయి. ఎక్కువకాలం పట్టించుకోకపోతే గేర్‌బాక్స్ ఓవర్‌హీట్ అవ్వడం లేదా భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి కంపెనీ సూచించిన సమయాల్లో సర్వీస్ చేయిచడం తప్పనిసరి.

3. ఎత్తైన ప్రదేశాల్లో యాక్సిలరేటర్‌తో కారు నిలిపివేయడం

కొండలపై లేదా ఎత్తైన రోడ్లపై వెనక్కి జారకుండా ఉండేందుకు యాక్సిలరేటర్‌తో కారు నిలిపి ఉంచడం ప్రమాదకరం. ఇది గేర్‌బాక్స్‌పై అదనపు ఒత్తిడి సృష్టిస్తుంది. ముఖ్యంగా టార్క్ కన్వర్టర్ లేదా ఆటోమేటెడ్ క్లచ్ సిస్టమ్ ఉన్న కార్లలో వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల క్లచ్ వేర్ పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో బ్రేక్ పెడల్ లేదా హిల్ హోల్డ్ అసిస్ట్ ఉపయోగించడం ఉత్తమ మార్గం.

4. పూర్తిగా ఆగకముందే డ్రైవ్ లేదా రివర్స్ మార్చడం

కారు పూర్తిగా ఆగకముందే డ్రైవ్ నుంచి రివర్స్ లేదా రివర్స్ నుంచి డ్రైవ్ మార్చడం గేర్‌బాక్స్‌కు హానికరం. చక్రాలు ఇంకా కదులుతుండగా పవర్ దిశ మార్చడం వల్ల క్లచ్‌లు, గియర్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది గేర్‌బాక్స్ జీవితాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఎప్పుడూ వాహనం పూర్తిగా ఆగిన తర్వాతే గేర్ మార్చాలి.

5. దిగువ దారుల్లో బ్రేక్‌లపై ఆధారపడటం

కొండ దిగువ దారుల్లో నిరంతరం బ్రేక్ నొక్కడం వల్ల బ్రేక్ ప్యాడ్స్ వేడెక్కి త్వరగా దెబ్బతింటాయి. ఎక్కువ కాలం ఇలా చేస్తే బ్రేక్ ఫేడ్ సమస్య రావచ్చు. చాలా ఆటోమేటిక్ కార్లలో మాన్యువల్ మోడ్ లేదా లోయర్ గేర్ ఆప్షన్ ఉంటుంది. ఇంజిన్ బ్రేకింగ్ ఉపయోగించడం ద్వారా వేగ నియంత్రణ మెరుగుపడుతుంది & బ్రేక్ భాగాల ఆయుష్షు పెరుగుతుంది.

ఆటోమేటిక్ కార్లు సులభంగా ఉన్నప్పటికీ సరైన డ్రైవింగ్ అలవాట్లు లేకపోతే గేర్‌బాక్స్ నష్టం తప్పదు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంధన సామర్థ్యం, పనితీరు, వాహన దీర్ఘాయుష్షు మెరుగుపడతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Viral Kiss Car: కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
యూత్ ఆల్-టైమ్ ఫేవరెట్‌ బజాజ్ పల్సర్ 150 కొనాలనుకుంటున్నారా? తక్కువ EMI ఆప్షన్లు, ఆఫర్ల వివరాలు మీకోసం!
2026 Bajaj Pulsar 150: కేవలం రూ.11,523 డౌన్‌పేమెంట్‌తో సొంతం చేసుకోండి - పూర్తి EMI ప్లాన్స్ ఇవే!
Auto Market September 2026: కారు,బండి కొనేందుకు సెప్టెంబర్‌ మంచి సమయమా? దసరా ఆఫర్ల కోసం ఆగాలా?
కారు,బండి కొనేందుకు సెప్టెంబర్‌ మంచి సమయమా? దసరా ఆఫర్ల కోసం ఆగాలా?
కొత్త ఇంజిన్, కొత్త గేర్‌బాక్స్‌తో వచ్చిన ఆల్‌-న్యూ పల్సర్ 150.. ట్రాఫిక్‌లో రైడ్ మరింత ఈజీ!
కొత్త లుక్‌తో ఫ్రెష్‌గా వచ్చిన బజాజ్ పల్సర్ 150.. ఫీచర్లు అదుర్స్, ధర మీకు అందుబాటులో!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Dried Tulsi Plant Uses: ఎండిన తులసి కొమ్మలను పారేయకండి… ఇలా ఇస్తే ఇంటికి మంచి జరుగుతుంది!
ఎండిన తులసి కొమ్మలను పారేయకండి… ఇలా ఇస్తే ఇంటికి మంచి జరుగుతుంది!
Pratibha Thakkadpally: క్రీడాశాఖపై ఆరోపణలు చేసిన ప్రతిభ తకడపల్లి ఎవరు? సాధించిన విజయాలేంటీ? వచ్చిన పతకాలు ఎన్ని?
క్రీడాశాఖపై ఆరోపణలు చేసిన ప్రతిభ తకడపల్లి ఎవరు? సాధించిన విజయాలేంటీ? వచ్చిన పతకాలు ఎన్ని?
Viral Cricket Celebration: మేధావి బిధూరి సిక్స్ సెవెన్ సెలబ్రేషన్ వైరల్.. చాహల్ అనుక‌ర‌ణ‌తో మ‌రింత పాపుల‌ర్ అయిన వైనం!
మేధావి బిధూరి సిక్స్ సెవెన్ సెలబ్రేషన్ వైరల్.. చాహల్ అనుక‌ర‌ణ‌తో మ‌రింత పాపుల‌ర్ అయిన వైనం!
Pratibha Takadapally:
"పతకాలు సాధించినప్పుడు ఏమైపోయారు? క్రీడామంత్రిత్వ శాఖ బెదిరింపులు నిజం" ప్రతిభా తకడపల్లి హాట్‌కామెంట్స్
Embed widget