అన్వేషించండి

టైర్ల శబ్దానికి చెక్‌ - కారు ప్రయాణాన్ని మరింత ప్రశాంతంగా చేసే కొత్త టెక్నాలజీ

ZF Active Noise Reduction టెక్నాలజీ టైర్ల శబ్దాన్ని 3dB వరకు తగ్గిస్తుంది. సెమీ యాక్టివ్‌ డాంపర్లు, సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఈ సిస్టమ్‌ భవిష్యత్‌ కార్లలో ప్రశాంతమైన ప్రయాణం అందిస్తుంది.

ZF Active Noise Reduction In Cars: కారు నడిపేటప్పుడు మనం ఎక్కువగా వినే శబ్దాల్లో టైర్ల శబ్దం ఒకటి. ఇంజిన్‌ వైబ్రేషన్లు, రోడ్‌ ఉపరితలం, టైర్ల నుంచి వచ్చే శబ్దం - ఇవన్నీ కలిసి కేబిన్‌లో ప్రశాంతత తగ్గిపోతుంది. 1960, 1970 దశకాల్లో కార్లలో భారీగా సౌండ్‌ డెడెనింగ్‌ మెటీరియల్‌ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ సొల్యూషన్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటికే హెడ్‌ఫోన్లలో ఉన్న నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీ కార్లలో కూడా వాడుతున్నారు. ఇప్పుడు జర్మనీకి చెందిన ZF Friedrichshafen AG మరో అడుగు ముందుకు వేసి Active Noise Reduction ఫంక్షన్‌ను చాసిస్‌లో ప్రవేశపెట్టింది.

ZF యాక్టివ్‌ నాయిస్‌ రిడక్షన్‌ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి?

టైర్ల శబ్దాన్ని ఎలక్ట్రానిక్‌గా తగ్గించడం చాలా కష్టం. ఎందుకంటే ఇది స్థిరంగా ఉండదు. ఇంజిన్‌ శబ్దం ప్రతి క్రాంక్‌షాఫ్ట్‌ రివల్యూషన్‌కు అనుసంధానంగా ఉంటుంది. అందుకే దానిని సెన్సర్లు గుర్తించి స్పీకర్ల ద్వారా ‘కౌంటర్‌ సిగ్నల్‌’ పంపి తగ్గిస్తారు.

కానీ టైర్ల నుంచి వచ్చే శబ్దం సాధారణంగా 200Hz స్థాయిలో ఉంటుంది. ఇది చాసిస్‌ ద్వారా కేబిన్‌లోకి వస్తుంది. ఇక్కడే ZF సొల్యూషన్‌ పని చేస్తుంది.

ఎలా పని చేస్తుంది?

ZF, తన Smart Chassis Sensorలో ఇన్‌బిల్ట్‌ యాక్సిలరేషన్‌ సెన్సర్‌ను ఉపయోగిస్తుంది. ఈ సెన్సర్‌ సస్పెన్షన్‌ కంట్రోల్‌ ఆర్మ్స్‌, డాంపర్లు ద్వారా కేబిన్‌లోకి వచ్చే వైబ్రేషన్లను ఖచ్చితంగా కొలుస్తుంది. తర్వాత, సాఫ్ట్‌వేర్‌ ఆల్గోరిథమ్‌ టైర్ల వల్ల వచ్చే ప్రత్యేక నాయిస్‌ ప్యాటర్న్‌ను గుర్తిస్తుంది. ఆ తర్వాత CubiX అనే చాసిస్‌ కంట్రోల్‌ ప్లాట్‌ఫారమ్‌ సాఫ్ట్‌వేర్‌ సెమీ యాక్టివ్‌ డాంపర్లలో సూక్ష్మమైన ‘మైక్రో మూవ్‌మెంట్స్‌’ సృష్టిస్తుంది.

ఈ కదలికలు చాలా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల సస్పెన్షన్‌ ప్రధాన పని అయిన వెర్టికల్‌ మూమెంట్‌ను నియంత్రించడంలో ఎలాంటి అంతరాయం కలగదు. హ్యాండ్లింగ్‌, రోడ్‌ హోల్డింగ్‌ మీద ప్రభావం ఉండదు.

మైక్రోఫోన్లు, స్పీకర్లు అవసరమా?

సాధారణంగా నాయిస్‌ క్యాన్సిలేషన్‌ అంటే కేబిన్‌లో మైక్రోఫోన్లు, స్పీకర్లు అవసరం. ఇవి ఎక్కువగా లగ్జరీ కార్లలో మాత్రమే కనిపిస్తాయి. కానీ ZF సిస్టమ్‌కు అవి అవసరం లేదు. పూర్తిగా చాసిస్‌ ఆధారంగా పనిచేస్తుంది, ఖర్చు తగ్గుంది. 

ZF ప్రపంచవ్యాప్తంగా సెమీ యాక్టివ్‌ డాంపర్లలో సుమారు 40 శాతం మార్కెట్‌ షేర్‌ కలిగి ఉందని చెబుతోంది. అంటే భవిష్యత్‌లో ఈ టెక్నాలజీ తక్కువ ధర కార్లలో కూడా కనిపించే అవకాశం ఉంది.

శబ్దం ఎంత వరకు తగ్గుతుంది?

ప్రస్తుతం ఈ సిస్టమ్‌ సుమారు 3dB వరకు శబ్దాన్ని తగ్గిస్తుంది. ఇది, మనం వినిగల స్థాయిలో స్పష్టమైన తేడా. భవిష్యత్‌లో 10dB వరకు తగ్గించే అవకాశముందని కంపెనీ చెబుతోంది. అది సాధ్యమైతే కేబిన్‌లో ప్రశాంతత మరింత మెరుగవుతుంది.

కారు కొనేటప్పుడు ఇంజిన్‌ పవర్‌, మైలేజ్‌ మాత్రమే కాదు, NVH స్థాయి కూడా ముఖ్యమే. టైర్ల శబ్దాన్ని తగ్గించే ఈ కొత్త టెక్నాలజీ, భవిష్యత్‌ కార్లను మరింత సౌకర్యవంతంగా మార్చే అవకాశం ఉంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget