అన్వేషించండి

BYD SEAL: ఆకట్టుకునే ఫీచర్లతో రానున్న బీవైడీ ఎలక్ట్రిక్ కారు - ఎలా ఉందో చూశారా?

ఆటో ఎక్స్‌పో 2023లో బీవైడీ సీల్ కారు లాంచ్ అయింది.

Auto Expo 2023: మార్కెట్‌ను పిచ్చెక్కించడానికి వస్తున్న ఎలక్ట్రిక్ కారు BYD SEAL. ఇది చాలా అందంగా ఉంది. ఆటో ఎక్స్‌పో 2023లో దీన్ని ప్రదర్శించారు. దీంతోపాటు చైనీస్ వాహన తయారీ సంస్థ BYD భారతదేశంలో తన పట్టును బలోపేతం చేయడానికి BYD ATTO 3 Limited Edition కారును కూడా విడుదల చేసింది. ఈ కారును ఫారెస్ట్ గ్రీన్ కలర్‌లో కూడా చూడవచ్చు.

బీవైడీ సీల్ వివరాలు
BYD SEAL 2023 చివరి నాటికి భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ కారు కేవలం 3.8 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 700 కిలోమీటర్లు నడుస్తుంది. ఇందులో టెక్నాలజీ అద్భుతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

బీవైడీ సీల్‌ను ఈ-ప్లాట్‌ఫారమ్ 3.0పై రూపొందించారు. ఇది అల్ట్రా సేఫ్ బ్లేడ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది అత్యంత సురక్షితమని తెలిపారు. సేఫ్టీ, స్టెబిలిటీ, హ్యాండ్లింగ్, పెర్ఫామెన్స్ పరంగా అత్యుత్తమంగా నిరూపించుకుంటామని కంపెనీ తెలిపింది. ఈ కారు సీబీటీ టెక్నాలజీపై పని చేయనుంది.

ఈ టెక్నాలజీ ద్వారా కారుకు ముందు, వెనుక యాక్సిల్స్‌పై చెరో 50 శాతం యాక్సిల్ లోడ్ పడనుంది. ఇది కారును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ టెక్నాలజీ కారుకు లాంగ్ రేంజ్ కూడా ఇస్తుంది. కారులో సేఫ్టీ ఇంటీరియర్ స్ట్రక్చర్‌ను అందించనున్నారు. దీన్ని భారతీయ రోడ్ల ప్రకారం రూపొందించారు.

BYD ఆటో కంపెనీ ఏ దేశానికి చెందినది?
BYD ఆటో చైనాలోని ప్రముఖమైన టాప్ కార్ కంపెనీలలో ఒకటి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల కారణంగా ఈ కంపెనీ భారతదేశంలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2023లో భారత్‌లో తమ సర్వీస్ సెంటర్లను రెట్టింపు చేస్తామని కంపెనీ తెలిపింది. ఓవరాల్‌గా ఈ కారు ఎంత బాగుంటుందో, ఎంత మెరుగ్గా ఉంటుందో రాబోయే కాలమే చెప్పాలి. ఎందుకంటే ఇది ఇప్పటికే మార్కెట్‌లో కింగ్‌మేకర్‌లుగా ఉన్న భారతదేశంలోని మారుతీ, టాటా వంటి కంపెనీలతో పోటీ పడుతోంది.

View this post on Instagram
 
A post shared by BYD India (@byd.india)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Mancherial News: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
Embed widget