అన్వేషించండి

అప్రిలియా SR 125, SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్ లాంచ్ - కొత్త క్యామోఫ్లాజ్ లుక్‌తో యూత్‌ కోసమే డిజైనింగ్‌!

అప్రిలియా, కొత్త SR 125, SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త క్యామోఫ్లాజ్ లివరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చిన ఈ మోడళ్ల ధరలు, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు తెలుసుకోండి.

Aprilia SR 125, SR 175 launched: ప్రముఖ స్పోర్టీ స్కూటర్ తయారీ సంస్థ అప్రిలియా, తన SR సిరీస్‌లో కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. కంపెనీ Aprilia SR 125 Tribute Edition & Aprilia SR 175 Tribute Edition పేర్లతో ఈ ప్రత్యేక ఎడిషన్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Aprilia SR 125 ట్రిబ్యూట్ ఎడిషన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.17 లక్షలు కాగా & Aprilia SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.1.24 లక్షలుగా నిర్ణయించారు.

ఈ కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్ స్కూటర్ల ప్రధాన ఆకర్షణ వాటి ప్రత్యేక క్యామోఫ్లాజ్ లివరీ. స్టైలిష్ డిజైన్‌ను కోరుకునే యువతను దృష్టిలో పెట్టుకుని అప్రిలియా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించింది. అయితే డిజైన్ పరంగా మార్పులు చేసినప్పటికీ, ఇంజిన్ & పనితీరు పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు.

 కొత్తగా ఏముంది?

SR 125, SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్‌లలో మిలిటరీ గ్రీన్ బేస్ కలర్ అందించారు. దీనికి తోడు ఫ్రంట్ ఆప్రాన్ & సైడ్ ప్యానెల్స్‌పై పసుపు, ఎరుపు రంగు గ్రాఫిక్స్ జోడించారు. ఈ మొత్తం డిజైన్‌కు మ్యాట్ ఫినిష్ ఇవ్వడం వల్ల స్కూటర్ మరింత ప్రీమియం లుక్‌ అందిస్తోంది. అలాగే, ఈ స్కూటర్లలోని 14 అంగుళాల వీల్స్‌పై రెడ్ యాక్సెంట్ స్ట్రిప్ కొనసాగించారు. ఈ కొత్త కలర్ థీమ్ SR 125, SR 175 రెండింటిలోనూ ఒకే విధంగా ఉంటుంది. స్పోర్టీ డిజైన్‌ను ఇష్టపడే కస్టమర్లకు ఈ ఎడిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

 ఇంజిన్‌లో మార్పుల్లేవు

డిజైన్‌లో మార్పులు చేసినప్పటికీ, ఇంజిన్‌ పరంగా ఈ రెండు స్కూటర్లు ప్రస్తుతం విక్రయిస్తున్న స్టాండర్డ్ మోడళ్ల మాదిరిగానే ఉంటాయి.

Aprilia SR 125 Tribute Editionలో 124cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 10.6 హెచ్‌పీ పవర్ & 10.4 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇక Aprilia SR 175 Tribute Editionలో 174cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ పవర్‌ట్రెయిన్ 13.2 హెచ్‌పీ పవర్ & 14.1 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. నగర ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌కు కూడా ఈ ఇంజిన్ మెరుగైన పనితీరును అందిస్తుంది.

 ధరల్లో ఎంత తేడా?

డీలర్ వర్గాల సమాచారం ప్రకారం, స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే SR 125 Tribute Edition ధర సుమారు రూ.3,000 అధికంగా ఉంది. అదే విధంగా SR 175 Tribute Edition ధర సాధారణ మోడల్ కంటే రూ.2,000 ఎక్కువగా నిర్ణయించారు. ఈ అదనపు ధరకు వినియోగదారులు ప్రత్యేక క్యామోఫ్లాజ్ డిజైన్, ప్రత్యేక గ్రాఫిక్స్ & మరింత ప్రీమియం విజువల్ అప్పీల్‌ను పొందనున్నారు. పనితీరులో మార్పులు లేకపోయినా, స్టైలిష్ లుక్ కోరుకునే యువతకు ఈ కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్‌లు మంచి ఎంపికగా నిలిచే అవకాశముంది.

అప్రిలియా ఇప్పటికే స్పోర్టీ స్కూటర్ సెగ్మెంట్‌లో బలమైన గుర్తింపు సాధించగా, ఇప్పుడు ఈ కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్ మోడళ్లతో మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. ప్రత్యేక డిజైన్, ఆకర్షణీయమైన కలర్ కాంబినేషన్, స్పోర్టీ స్టైలింగ్‌తో వచ్చిన ఈ స్కూటర్లు ఆటోమొబైల్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Advertisement

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget