అన్వేషించండి

Maruti Victoris నుంచి VinFast VF6 VF7 వరకు - సెప్టెంబర్‌లో లాంచ్ అయిన కొత్త కార్ల హైలైట్స్‌

సెప్టెంబర్ 2025లో, Maruti Victoris, VinFast VF6 & VF7, Volvo EX30, Skoda Kodiaq Lounge, Hyundai CRETA King సహా అనేక స్పెషల్ ఎడిషన్ మోడల్స్ లాంచ్ అయ్యాయి.

All New Car Launches September 2025:

సెప్టెంబర్ 2025లో, ఆటోమొబైల్ మార్కెట్‌ నిజంగా హైలైట్స్‌తో నిండిపోయింది. కొత్త మోడల్స్, స్పెషల్ ఎడిషన్స్, కొత్త వేరియంట్లు- అన్నీ ఒకే నెలలో వచ్చాయి. Maruti నుంచి VinFast వరకు, Hyundai నుంచి Skoda వరకు... ప్రతి బ్రాండ్‌ ఆటో లవర్స్‌కి ఏదో ఒక కొత్త సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

Maruti Victoris
సెప్టెంబర్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది మారుతి విక్టోరిస్. తెలుగు రాష్ట్రాల్లో, రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ధరలో లాంచ్ అయింది. అరీనా డీలర్‌షిప్స్‌ ద్వారా అమ్ముతున్న మొదటి ప్రీమియం SUV ఇది. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 10.25 అంగుళాల డిజిటల్‌ డిస్‌ప్లే, 64 కలర్స్ అంబియెంట్ లైటింగ్, లెవల్ 2 ADAS వంటి హైటెక్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంది. మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG ఆప్షన్లతో వచ్చింది. AWD ఆప్షన్ కూడా ఉంది.

VinFast VF6 & VinFast VF7
వియత్నాం EV బ్రాండ్ విన్‌ఫాస్ట్ ఇండియాలో తొలిసారి ఎంట్రీ ఇచ్చింది. VF6 SUV ధర రూ. 16.49 లక్షల నుంచి స్టార్ట్ కాగా, VF7 SUV రూ. 20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల వరకు ఉంది. VF6లో 468 కి.మీ. రేంజ్‌ & VF7లో 532 కి.మీ. వరకు రేంజ్ అందిస్తుంది. 12.9 అంగుళాల టచ్‌ స్క్రీన్‌, పానోరమిక్ రూఫ్‌, డ్యూయల్ జోన్ AC, లెవల్ 2 ADAS వంటి ఫీచర్స్ ఈ కార్లలో ఉన్నాయి.

Volvo EX30
వోల్వో నుంచి వచ్చిన EX30, ఇప్పటి వరకు ఇండియాలో లాంచ్ అయిన అతి చవకైన Volvo EV. రూ. 41 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర ఉన్న ఈ SUVని 2025 అక్టోబర్ 19 లోపు బుక్ చేస్తే ప్రత్యేక ఆఫర్‌ రూ. 39.99 లక్షలకు దొరుకుతుంది. 480 కి.మీ. రేంజ్, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్‌, గూగుల్ ఇంటిగ్రేషన్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Skoda Kodiaq Lounge Variant
స్కోడా, తన Kodiaq SUVకి కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌ "Lounge"ను తీసుకొచ్చింది. రూ. 40 లక్షల ధరలో లభించే ఈ SUV 5 సీటర్ లేఅవుట్‌లో వచ్చింది 10.4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌, పానోరమిక్ సన్‌రూఫ్‌, డిజిటల్ క్లస్టర్ ఫీచర్స్‌ ఈ కారులో ఉన్నాయి.

Hyundai Creta King Variant
క్రెటా 10వ వార్షికోత్సవం సందర్భంగా, హ్యుందాయ్ "క్రెటా కింగ్" వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త మ్యాట్ బ్లాక్ షేడ్‌, డాష్‌ క్యామ్‌, సీట్‌ బ్యాక్ ట్రే వంటి ప్రత్యేక ఫీచర్స్‌ దీని సొంతం. లిమిటెడ్ ఎడిషన్‌లో వచ్చిన "కింగ్", ఈ బ్రాండ్‌కు ప్రత్యేక ఆకర్షణ.

ఇతర కీలక లాంచ్‌లు

Updated Honda Elevate - కొత్త గ్రిల్‌, కొత్త ఇంటీరియర్ కలర్స్, 360 కెమెరా వంటి అప్‌డేట్స్.

Citroen Basalt X - కొత్త డ్యాష్‌ బోర్డ్‌, వెంటిలేటెడ్ సీట్లు, 360 కెమెరా.

Renault Kwid 10th Anniversary Edition - స్పెషల్ కాస్మెటిక్ అప్‌డేట్స్.

Hyundai Creta Electric Knight, Hyundai Alcazar Knight, Hyundai i20 Knight ఎడిషన్స్ - ఆల్ బ్లాక్ థీమ్‌ & స్పోర్టీ లుక్స్‌తో వచ్చాయి.

సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఈ మోడళ్లు ఆటోమొబైల్‌ మార్కెట్‌లో కొత్త ఊపు తెచ్చాయి. ప్రాక్టికల్ ఫ్యామిలీ SUVs నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్స్‌ వరకు, ప్రతి బడ్జెట్‌కు ఏదో ఒక ఆప్షన్ సెప్టెంబర్‌లో వచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget