అన్వేషించండి

Diwali Car Buying Tips: దీపావళి ఆఫర్లలో కొత్త కారు కొనుగోలు గైడ్ - మీకు వేల రూపాయలు సేవ్ చేసే సీక్రెట్ టిప్స్

మీరు ఈ దీపావళికి (Diwali 2025) కారు కొనాలని ఆలోచిస్తుంటే, ఈ స్మార్ట్ చిట్కాలు మీకు వేల రూపాయలు ఆదా చేస్తాయి. ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లోన్ ప్రయోజనాలు & డీలర్‌తో చర్చలు మీకు సాయపడతాయి.

Diwali 2025 Car Buying Tips To Save Money: ఇండియాలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, దీపావళి అంటే కేవలం వెలుగుల పండుగ & వేడుకల పండుగ మాత్రమే కాదు, కొత్త వాహనం కొనడానికి శుభ సమయంగా కూడా  పరిగణిస్తారు. అందువల్ల, ఈ సమయంలో, కారు కంపెనీలన్నీ కస్టమర్లను ఆకర్షించడానికి చాలా ఆకర్షణీయమైన ఆఫర్లు & డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీరు ఈ దీపావళికి కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే, కొన్ని స్మార్ట్ చిట్కాలు ఫాలో అయితే వేల రూపాయలను సులభంగా ఆదా చేయవచ్చు

ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ ధరలను సరిపోల్చండి
ఇప్పుడు అనేక ఆన్‌లైన్ పోర్టళ్లు & ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కారు కొనుగోళ్లపై అదనపు ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఈ ఆన్‌లైన్ పోర్టళ్లు & ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లోని ధరలు, సాధారణంగా, డీలర్‌షిప్‌ల కంటే తక్కువగా ఉంటాయి. అందువల్ల, కారు కొనడానికి ముందు ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ రెండింటిలోనూ ధరలను పోల్చడం ముఖ్యం.

మీ సెకండ్‌ హ్యాండ్‌ కారు మీద బెస్ట్‌ ప్రైస్‌ పొందండి
మీరు ఇప్పటికే కారు కలిగి ఉంటే, ఈ దీపావళికి దానిని అమ్మి మరో కొత్త కారును కొనాలని భావిస్తుంటే, ఎక్సేంజ్‌ ఆఫర్‌ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో, చాలా కంపెనీలు అధిక ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందిస్తున్నాయి, ఇది మీ పాత వాహనానికి మంచి ధరను పొందడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా, ఆ డబ్బుతో కొత్త కారు కొని అదనపు పొదుపు చేయవచ్చు.

లోన్ & ఫైనాన్సింగ్ ఆఫర్లను చూడండి
చాలా మంది కస్టమర్లు, కొత్త కారు కొనడానికి కార్‌ లోన్‌ను ఎంచుకుంటారు. దీపావళి సందర్భంగా, బ్యాంకులు & NBFCలు తక్కువ వడ్డీ రేట్లు, సున్నా ప్రాసెసింగ్ ఫీజుల సహా EMIల మీద మరికొన్ని ప్రత్యేక ఫైనాన్సింగ్ ఆఫర్‌లను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు ఇస్తున్న ఆఫర్లను పోల్చి, తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోండి. దీని వల్ల, వడ్డీ రేట్లపై దీర్ఘకాలంలో వేల రూపాయలు ఆదా చేయవచ్చు.

డీలర్‌తో చర్చలు జరపడం మర్చిపోవద్దు
కంపెనీ & డీలర్‌షిప్‌ స్థాయుల్లో ఆఫర్లను ముందే నిర్ణయించినప్పటికీ, డీలర్‌తో చర్చలు జరపడం ద్వారా మరికొన్ని అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. ఉచిత యాక్సెసరీస్‌, ఉచిత బీమా, వారంటీ పొడిగింపు లేదా సర్వీసింగ్ ప్రయోజనాలు వంటి అదనపు ఫీచర్ల గురించి చర్చించవచ్చు.

ఇయర్‌-ఎండ్‌ స్టాక్ క్లియరెన్స్‌ను సద్వినియోగం చేసుకోండి
దీపావళి తర్వాత సంవత్సరం ముగుస్తుంది & డీలర్లు పాత మోడళ్లను సాధ్యమైనంత త్వరగా అమ్మేయాలని చూస్తారు. ఈ సమయంలో, మీరు 2024 మోడల్ కారుపై గణనీయమైన తగ్గింపు పొందవచ్చు. ఫీచర్లు మారకపోయినా ధర విషయంలో గణనీయమైన తగ్గింపును మీరు దక్కించుకోవచ్చు.

సరైన సమయంలో బుక్ చేసుకోండి
దీపావళికి ముందే బుక్ చేసుకుంటే, కంపెనీలు ముందస్తు కొనుగోలుదార్లకు ప్రత్యేక డిస్కౌంట్లు లేదా బహుమతులు అందిస్తాయి. పండుగ టైమ్‌లో, సకాలంలో కారు డెలివరీ కూడా జరుగుతుంది. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా, కారు కంపెనీలు క్యాష్‌ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు &ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ స్కీమ్‌లను ప్రవేశపెట్టాయి. మీరు సరైన ఆఫర్‌ను తెలివిగా ఎంచుకుంటే, మీ పాత కారుకు ఉత్తమ ధరను పొందొచ్చు. డీలర్‌తో చర్చలు జరిపితే కొత్త కారు మీద వేల రూపాయలను సులభంగా ఆదా చేసుకోవచ్చు & మీకు కావలసిన కారును ఇంటికి తీసుకురావచ్చు.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget