అన్వేషించండి

2025 సెప్టెంబర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్‌లో TVS దమ్ము - రెండో స్థానంలో Bajaj, Ola ఓవర్‌టేక్‌ చేసిన Ather

సెప్టెంబర్‌ 2025లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల పోటీలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. TVS టాప్‌లో నిలవగా, Ather మొదటిసారిగా Ola Electric‌ని దాటేసి మూడో స్థానంలోకి వచ్చింది.

Electric Two Wheeler Sales Report September 2025: మన దగ్గర, ఎలక్ట్రిక్‌ టూ వీలర్ మార్కెట్‌ రోజురోజుకీ హీట్‌ ఎక్కుతోంది, ఆధిపత్యం నిరూపించుకునే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 2025లో అయితే మరింత ఆసక్తికరంగా మారింది. ఎప్పటిలాగే TVS నంబర్‌ వన్‌గా నిలిచింది. కానీ, అసలు సర్‌ప్రైజ్‌ మాత్రం Ather Energy ఇచ్చింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ, తొలిసారి Ola Electric ‌ని ఓడించి థర్డ్‌ పొజిషన్‌లోకి వచ్చింది.

TVS - పోల్‌ పోజిషన్‌
TVS మోటార్‌ కంపెనీ, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోమారు రుజువు చేసింది. ఒక్క సెప్టెంబర్‌ (2025) నెలలోనే 20,000 యూనిట్లకు పైగా అమ్మి పోల్‌ పోజిషన్‌లో (నంబర్‌ 1 పొజిషన్‌) లో కొనసాగుతోంది. ICE వాహనాలపై GST తగ్గింపు ఇచ్చినా ఎలక్ట్రిక్‌ వాహనాలపై డిమాండ్‌ తగ్గలేదని TVS ప్రూవ్‌ చేసింది.

బజాజ్ - కంఫర్ట్‌గా రెండో స్థానంలో
బజాజ్ ఆటో, 2025 సెప్టెంబర్‌లో 16,000 యూనిట్లకుపైగా సేల్‌ చేసి సెకండ్‌ పొజిషన్‌లో నిలిచింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో, రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ కొరత కారణంగా ఉత్పత్తిలో ఇబ్బందులు ఎదురైనా, సెప్టెంబర్‌లో ఆ అడ్డంకులను అధిగమించి ఫుల్‌ ఫామ్‌లో తిరిగి వచ్చింది, కంఫర్ట్‌గా రెండో స్థానంలో దూసుకెళ్తోంది.

Ather - మొదటిసారి Ola Electric ‌పై ఆధిపత్యం
Ather Energy, సెప్టెంబర్‌లో 15,000 యూనిట్లకుపైగా సేల్‌ చేసి Ola Electric ‌ను వెనక్కు నెట్టింది. గత కొంతకాలంగా Ather, Ola Electric ‌కు దగ్గరగా వస్తోందన్న అంచనాలను ఈసారి నిజం చేసింది. మొదటిసారి Ola Electric ‌ని దాటి మూడో స్థానంలో రావడం Ather కి కీలక మైలురాయి.

Ola Electric - వెనక్కు తగ్గి నాలుగో స్థానంలోకి
ఒకప్పుడు నంబర్‌ 1 స్థానం సాధించిన Ola Electric, ఇప్పుడు ఫోర్త్‌ పొజిషన్‌కి పడిపోయింది. సెప్టెంబర్‌లో 12,000 యూనిట్ల లోపు సేల్స్‌తో వెనుకబడింది. ఈ ఏడాదంతా Ola Electric సేల్స్‌ ఏ నెలకు ఆ నెల తగ్గుతూనే వస్తున్నాయి. అయితే, జనవరి-సెప్టెంబర్‌ మొత్తం సేల్స్‌ లెక్కల్లో మాత్రం 1.6 లక్షల యూనిట్లతో Ather (1.3 లక్షల యూనిట్లు) కంటే ముందే ఉంది.

Hero Vida - స్టెడీ రైడ్‌
హీరో మోటోకార్ప్‌, తన Vida బ్రాండ్‌తో బలంగా రాణిస్తోంది. సెప్టెంబర్‌లో 11,000 యూనిట్లకుపైగా విక్రయాలు సాధించి Ola Electric కు పోటీగా నిలిచింది. Hero కొత్తగా తెచ్చిన Battery-as-a-Service (BaaS) ఆప్షన్‌ & అగ్రెసివ్‌ మార్కెటింగ్‌ Vida బ్రాండ్‌కి మంచి లిఫ్ట్‌ ఇచ్చాయి.

ఫెస్టివ్‌ సీజన్‌లో పాజిటివ్‌ వైబ్‌
దసరా, దీపావళి పండుగ సీజన్‌తో పాటు మార్కెట్‌లో బైక్‌ బజ్‌ పెరగడం కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల సేల్స్‌కి పాజిటివ్‌గా పని చేసింది. GST తగ్గింపు కారణంగా కొంతమంది ICE వాహనాలవైపు మొగ్గుచూపినా, ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో కూడా గ్రోత్‌ కొనసాగడం ఇండస్ట్రీకి మంచి సిగ్నల్‌.

సెప్టెంబర్‌ 2025 ఎలక్ట్రిక్‌ టూ వీలర్ మార్కెట్‌లో గేమ్‌చేంజర్‌ మంత్‌గా రికార్డ్‌ అయ్యింది. TVS తన లీడర్‌షిప్‌ని కొనసాగించగా, బజాజ్ సెకండ్‌ పొజిషన్‌లో స్ట్రాంగ్‌గా ఉంది. అసలు టర్నింగ్‌ పాయింట్‌ మాత్రం Ather Energy కి దొరికింది. ఇది మొదటిసారి Ola Electric ‌ని వెనక్కి నెట్టి మూడో స్థానంలోకి రావడం, ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో పోటీలో మరింత వేడి రాజేసింది.

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget