అన్వేషించండి

దాడి సమయంలో Tiger Shroff వెళ్తున్న BMW Car ఎంత వరకు సేఫ్? బుల్లెట్‌ప్రూఫ్ కోసం ఖర్చు ఎంత

నటుడు టైగర్ ష్రాఫ్‌పై దాడి జరిగిన సమయంలో ఆయన ఏ కారులో ఉన్నారు? ఈ కార్లు ఎంతవరకు సేఫ్ , భద్రత కోసం బుల్లెట్‌ప్రూఫ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టైగర్ ష్రాఫ్ కారుపై దాడి వాహన భద్రతపై చర్చకు దారితీసింది.
  • సాధారణ BMWలు పటిష్టంగా ఉన్నా, బుల్లెట్‌ప్రూఫింగ్ ప్రత్యేక మార్పులు కోరుతుంది.
  • బుల్లెట్‌ప్రూఫింగ్‌కు మల్టీ-లేయర్ గ్లాస్, బలమైన ప్యానెళ్లు కోటి వరకు ఖర్చు.
  • కంపెనీ ఫిట్టెడ్ బుల్లెట్‌ప్రూఫ్ BMW కార్లు పదిహేను కోట్ల వరకు ధర.

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడి ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. కాల్పులు, దాడి జరిగిన సమయంలో టైగర్ ష్రాఫ్ తన లగ్జరీ కార్ BMW లో వెళ్తున్నారు. ముగ్గురు అపరిచిత వ్యక్తులు ఆయన కారుపై అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో టైగర్ ష్రాఫ్ పూర్తిగా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అసలు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారు ఎంత వరకు సేఫ్.. ఏ కారులో ప్రయాణిస్తున్నారని సెర్చ్ చేస్తున్నారు. 

ఇలాంటి దాడుల గురించి తెలిసినప్పుడల్లా వాహనాల బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ టెక్నాలజీ గురించి చర్చ జరుగుతుంది. BMW చాలా ఏళ్ల నుండి తన వాహనాల్లో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. కానీ ఏ కారునైనా తుపాకీ కాల్పులు లేదా బాంబు పేలుళ్ల నుండి పూర్తిగా కాపాడాలంటే విడిగా స్పెషల్ బుల్లెట్‌ప్రూఫింగ్ అవసరమవుతుంది. కనుక ఈ లగ్జరీ కార్లు ఎంత బలంగా ఉంటాయి, ఏదైనా కారును పూర్తిగా బుల్లెట్‌ప్రూఫ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం.

BMW కార్లు ఎంత వరకు సేఫ్

మొదట BMW వాహనాలు ఎంత పటిష్టంగా ఉంటాయో తెలుసుకోవాలి. BMW లగ్జరీ కార్లు సేఫ్టీ సిస్టమ్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీకి పేరుగాంచాయి. ఈ వాహనాల నిర్మాణంలో హై-స్ట్రెంగ్త్ స్టీల్, అల్యూమినియం, బలమైన కాంపోజిట్ మెటీరియల్‌ వాడతారు. దీనివల్ల ఏదైనా ప్రమాదం లేదా ఢీకొన్న సమయంలో కారులోని వ్యక్తులను కారు చాలా వరకు సురక్షితంగా ఉంచుతుంది.

వీటిలో అనేక అడ్వాన్స్‌డ్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, క్రాష్ సెన్సార్లు, స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీనివల్ల బీఎండబ్ల్యూ కంపెనీ సాధారణ కమర్షియల్ వాహనాలు ప్రమాదాలను సులభంగా తట్టుకోగలవు. నేరుగా జరిగే గన్‌ఫైర్ నుండి తప్పించుకోవడానికి కారు స్పెషల్ ఆర్మార్డ్ కారు అయి ఉండాలి. 

బుల్లెట్‌ప్రూఫ్ చేయడానికి ఏం కావాలి 

కారును బుల్లెట్‌ప్రూఫ్ చేసినప్పుడల్లా అందులో అనేక రకాల టెక్నాలజీని ఉపయోగిస్తారు. ముందుగా కారు అద్దాలను తొలగించి అనేక లేయర్స్ ఉన్న మల్టీ-లేయర్ బ్యాలిస్టిక్ గ్లాస్‌ను అమరుస్తారు. దీనివల్ల ఈ అద్దాలు బులెట్ల వేగాన్ని, దాడిని దాదాపుగా నిరోధిస్తాయి. కారు బాడీ ప్యానెల్, తలుపులు, పైకప్పు, ఫ్లోర్‌లో కెవ్లార్, అరామిడ్ ఫైబర్, హై-గ్రేడ్ బ్యాలిస్టిక్ స్టీల్ బలమైన లేయర్లను జోడిస్తారు. కారు టైర్లలో రన్-ఫ్లాట్ టెక్నాలజీ కలిగిన టైర్లను ఉపయోగిస్తారు. ఇవి తుపాకీ బుల్లెట్ తగిలినా లేదా పూర్తిగా పంక్చర్ అయినా కూడా కారును చాలా దూరం వరకు సురక్షితంగా తీసుకెళతాయి. 

ఎంత ఖర్చవుతుంది?

మీరు ఏదైనా కారును బుల్లెట్‌ప్రూఫ్ మోడిఫై చేయించుకోవాలనుకుంటే, దాని ఖర్చు సెక్యూరిటీ లెవెల్‌ను బట్టి ఉంటుంది. భారత్‌లో బేసిక్ లెవెల్ బుల్లెట్‌ప్రూఫింగ్ ప్రారంభ ఖర్చు దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుంది. ఈ లెవెల్ చిన్న ఆయుధాలు, పిస్టల్ కాల్పుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. 

మీరు కనుక AK-47 వంటి అసాల్ట్ రైఫిల్స్, గ్రెనేడ్ పేలుళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి హై-లెవెల్ సేఫ్టీ కోరుకుంటే అందుకో సం రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకైనా ఖర్చు చేయాలి.  సర్టిఫైడ్ సెక్యూరిటీ ఏజెన్సీలు మాత్రమే ఈ పనిని చేస్తాయి.

BMW ధర ఎంత ?

మోడిఫికేషన్ కాకుండా BMW తన సెక్యూరిటీ సిరీస్ కింద ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను తయారు చేస్తుంది. ఉదాహరణకు BMW 7 Series Protection లేదా X5 Protection VR6 మోడల్స్ చూడటానికి సాధారణ లగ్జరీ కారులాగే కనిపిస్తాయి. కానీ లోపల ఉంటే మీరు చాలా సేఫ్. ఎందుకంటే వీటిలో ఫ్యాక్టరీ నుండి VR6 లేదా VR9 లెవెల్ బ్యాలిస్టిక్ సేఫ్టీ ఇస్తారు. ఈ వాహనాలు బుల్లెట్లతో పాటు పేలుళ్లను కూడా తట్టుకోగలవు. భారత్‌లో ఇలాంటి కంపెనీ-ఫిట్టెడ్ ఆర్మార్డ్ కార్ల ధర పన్నులతో కలిపి దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు ఉంటుంది. 

Frequently Asked Questions

టైగర్ ష్రాఫ్‌పై దాడి ఎలా జరిగింది?

టైగర్ ష్రాఫ్ తన BMW కారులో వెళ్తుండగా ముగ్గురు అపరిచితులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఆయన వెంటనే అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు.

సాధారణ BMW కార్లు ఎంతవరకు సురక్షితమైనవి?

BMW లగ్జరీ కార్లు సేఫ్టీ సిస్టమ్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీకి పేరుగాంచాయి. హై-స్ట్రెంగ్త్ మెటీరియల్స్, అడ్వాన్స్‌డ్ ఎయిర్‌బ్యాగ్‌లు ప్రమాదాల నుండి రక్షిస్తాయి. అయితే, తుపాకీ కాల్పుల నుండి తప్పించుకోవడానికి స్పెషల్ ఆర్మార్డ్ కారు అవసరం.

కారును బుల్లెట్‌ప్రూఫ్ చేయడానికి ఏ టెక్నాలజీ ఉపయోగిస్తారు?

బుల్లెట్‌ప్రూఫ్ చేయడానికి మల్టీ-లేయర్ బ్యాలిస్టిక్ గ్లాస్ అద్దాల కోసం, కెవ్లార్ లేదా స్టీల్ లేయర్‌లు బాడీ ప్యానెల్స్ కోసం, రన్-ఫ్లాట్ టెక్నాలజీ కలిగిన టైర్లు ఉపయోగిస్తారు.

కారును బుల్లెట్‌ప్రూఫ్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది?

భారత్‌లో బేసిక్ లెవెల్ బుల్లెట్‌ప్రూఫింగ్‌కు దాదాపు రూ.25 లక్షల నుండి రూ.40 లక్షలు ఖర్చవుతుంది. హై-లెవెల్ సేఫ్టీ కోసం రూ.50 లక్షల నుండి రూ.1 కోటి వరకు అవసరం కావచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget