అన్వేషించండి

Upcoming Electric Scooters: ముందుంది కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్ల జాతర - లైన్‌లో యమహా, సుజుకి, టీవీఎస్

New Electric Scooters 2025: యమహా, సుజుకి & టీవీఎస్ వంటి కీలక బ్రాండ్ల నుంచి భారత మార్కెట్లోకి ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు రానున్నాయి.

Upcoming Electric Scooters 2025: దీపావళి పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో, పాపులర్‌ టూవీలర్‌ కంపెనీలు భారతీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఏథర్, కైనెటిక్‌, యమహా, సుజుకి & TVS వంటి మెయిన్‌ స్ట్రీమ్‌ ICE ప్లేయర్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. రాబోయే కొన్ని నెలల్లో ఇ-స్కూటర్ విభాగంలో ఇవి కొత్త మోడళ్లను ప్రవేశపెడతాయి. 

1. సుజుకి ఇ-యాక్సెస్
జనవరిలో జరిగిన 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ-యాక్సెస్‌ను ఆవిష్కరించారు. 2025 మే చివరి నుంచి గురుగావ్‌లోని ఫ్యాక్టరీలో ఈ సిరీస్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. 3.07 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో నడిచే సుజుకి ఈ-యాక్సెస్ సింగిల్‌ ఛార్జ్‌పై 95 కి.మీ. రేంజ్‌ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫాస్ట్-ఛార్జింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 12-అంగుళాల చక్రాలు, ఆల్‌-LED లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్లీ-కలర్డ్‌ TFT LCD డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం 2A USB పోర్ట్ & సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్ సిస్టమ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు.

2. టీవీఎస్ ఆర్బిటర్
టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచింగ్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. రూ.లక్ష లోపు ధరతో బడ్జెట్-ఫ్రెండ్లీ మోడల్‌ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో, ఐక్యూబ్ కంటే కాస్త దిగువ స్థాయిలో దీనిని లిస్ట్ చేస్తారు,  టీవీఎస్ ఆర్బిటర్ అని పిలుస్తున్నారు. అప్‌కమింగ్‌ టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ వస్తుంది. ఎంట్రీ లెవల్ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌లోని బాష్-సోర్డ్స్‌ హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో దీనిని డిజైన్‌ చేస్తున్నారు. టీవీఎస్ ఆర్బిటర్ గంటకు 75-80 కి.మీ.ల రేంజ్‌ను అందించగలదు, గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

3. కైనెటిక్ DX
కైనెటిక్ గ్రీన్, భారత మార్కెట్లోకి మూడు హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ఇటీవల వెల్లడించింది. రాబోయే 18 నెలల్లో ఇవి జనం మధ్యకు రానున్నాయి. వీటిలో మొదటిది, 80-90ల కాలంలో స్కూటర్ల రాజ్యాన్ని ఏలిన ఐకానిక్ DX స్కూటర్‌కు ఎలక్ట్రానిక్‌ రూపం. కైనెటిక్ DX ఇ-స్కూటర్ 2025 దీపావళి పండుగ సీజన్‌కు ముందు లాంచ్‌ అవుతుంది. TFT డిస్‌ప్లే, అధునాతన IoT ఫంక్షన్స్‌ & జియో థింగ్స్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఇంటెలిజెంట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో ఇది వస్తుంది. రాబోయే కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మల్టీ బ్యాటరీ ఆప్షన్స్‌తో పాటు ఫాస్ట్-ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేయగలదు.

4. యమహా RY01
RY01 అనే కోడ్‌నేమ్‌తో, భారతదేశపు మొట్టమొదటి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో విడుదల అవుతుంది. దీనిని River Indie ఆధారంగా డిజైన్‌ చేశారు. జపనీస్ టూవీలర్‌ బ్రాండ్ కోసం బెంగళూరుకు చెందిన River కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. ఇటీవల, యమహా ఇ-స్కూటర్ మొదటిసారిగా టెస్ట్‌ రైడ్‌లో కనిపించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4 kWh బ్యాటరీ ఉంటుంది & దాదాపు 100 కి.మీ. రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.

5. ఏథర్ EL ఇ-స్కూటర్
ఏథర్ ఎనర్జీ, లక్ష రూపాయల లోపు విభాగంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బెంగళూరుకు చెందిన ఈ ఈవీ స్టార్టప్, ఈ ఏడాది ఆగస్టు 30న జరగనున్న తన వార్షిక కమ్యూనిటీ డే సందర్భంగా మల్టీ కాన్సెప్ట్ మోడళ్లతో పాటు కొత్త EL ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరిస్తుంది. లాంచ్ తేదీకి దగ్గర పడేకొద్దీ ఈ స్కూటర్‌ గురించి మరిన్ని అప్‌డేట్స్‌  తెలుస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget