Upcoming Hybrid SUVs: హైబ్రిడ్ SUVల జోష్- 30 km మైలేజ్, ADAS సేఫ్టీతో వస్తున్న 5 కొత్త మోడల్స్
2025-26లో, దేశంలో ఐదు శక్తిమంతమైన మధ్య తరహా SUVలు లాంచ్ కానున్నాయి, వాటిలో కియా సెల్టోస్ హైబ్రిడ్, కొత్త రెనాల్ట్ డస్టర్ & టాటా సియెర్రా కూడా ఉన్నాయి.

New Hybrid SUVs India 2025: భారత ఆటో మార్కెట్లో మిడ్ సైజ్ SUVలు అత్యంత డిమాండ్ ఉన్న విభాగంగా మారాయి. హ్యుందాయ్ క్రెటా & మారుతి గ్రాండ్ విటారా వంటి వాహనాల విజయం తర్వాత, అనేక కంపెనీలు ఇప్పుడు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. కియా, రెనాల్ట్, నిస్సాన్ & టాటా మోటార్స్ రాబోయే నెలల్లో కొత్త SUVలను లాంచ్ చేస్తాయి. ముఖ్యంగా, ఈ మోడళ్లలో చాలా వరకు హైబ్రిడ్ ఇంజన్లు & ADAS వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్నాయి.
Kia Seltos Hybrid
కియా సెల్టోస్ మన మార్కెట్‌లో ఇప్పటికే విజయవంతమైన మోడల్ & ఇప్పుడు ఈ కంపెనీ కొత్త హైబ్రిడ్ వెర్షన్‌ను విడుదల చేయబోతోంది. 2026 ప్రారంభంలో లాంచ్ కానున్న ఈ SUV, హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది & లీటరుకు 30 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీల కెమెరా & ADAS వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. కొత్త డిజైన్‌లో అప్‌డేట్ చేసిన ఫ్రంట్ ఫాసియా, వెర్టికల్ DRLs & కొత్త గ్రిల్‌తో ఇది ఇప్పటి మోడల్ కంటే మరింత స్టైలిష్‌గా ఉంటుంది. ఈ కొత్త SUV హ్యుందాయ్ క్రెటా & మారుతి గ్రాండ్ విటారాతో నేరుగా పోటీ పడగలదు.
New Renault Duster
రెనాల్ట్ డస్టర్‌కు యూత్‌ఫుల్ ఐకానిక్ పేరుంది & ఇప్పుడు అది దాని 3వ తరం (థర్డ్ జెన్) మోడల్‌తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యే కొత్త డస్టర్ 154 bhp & 250 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ SUV CMF-B ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది & దీని తర్వాత హైబ్రిడ్ వేరియంట్‌ను ఆశిస్తున్నారు. దీని డిజైన్ గ్లోబల్ మోడల్‌ను పోలి ఉంటుంది, కానీ భారతీయ వినియోగదారులకు అనుగుణంగా కొన్ని ముఖ్యమైన మార్పులతో ఉంటుంది. ఇది.. హ్యుందాయ్ క్రెటా & కియా సెల్టోస్ వంటి SUVలకు రైవల్‌గా ఉంటుంది.
Renault Boreal
రెనాల్ట్ డస్టర్‌తో పాటు, ఈ కంపెనీ, కొత్త ప్రీమియం 7-సీటర్ SUVని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది, బహుశా దీనిని రెనాల్ట్ బోరియల్ అని పిలవొచ్చు. 2025 ద్వితీయార్థంలో ప్రజల్లోకి వచ్చే ఈ SUV పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది & హైబ్రిడ్ వేరియంట్ ఆప్షన్ కూడా కలిగి ఉండవచ్చు. డస్టర్ ప్రేరణతో దీని డిజైన్ ఉంటుంది, కానీ ఎక్కువ స్థలం & ప్రీమియం లక్షణాలతో వస్తుంది. ఈ కారును ప్రత్యేకంగా ఫ్యామిలీ అవసరాల కోసం డిజైన్ చేశారు. ఇది మారుతి గ్రాండ్ విటారా & టయోటా హైరైడర్ వంటి SUVలకు ప్రత్యామ్నాయ కారు.
Nissan Creta-Rival SUV
నిస్సాన్ కూడా భారత మిడ్‌సైజ్ SUV విభాగంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త SUVని రెనాల్ట్ డస్టర్ తయారైన CMF-B+ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తారు & 2026లో లాంచ్ కావచ్చు. పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా అందుబాటులో లేనప్పటికీ, ఆధునిక సాంకేతికత & అధునాతన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. లాంచ్ తర్వాత, ఇది హ్యుందాయ్ క్రెటా & కియా సెల్టోస్ వంటి బెస్ట్ సెల్లింగ్ SUV లతో పోటీగా మారుతుంది. ఈ SUV ప్రారంభానికి ముందు, నిస్సాన్, కాంపాక్ట్ MPVని కూడా లాంచ్ చేయవచ్చు.
Tata Sierra
1990ల నాటి అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటైన టాటా సియెర్రా కొత్త అవతారంలో తిరిగి వస్తోంది. కంపెనీ దీనిని 2025 చివరి నాటికి - మొదట ఎలక్ట్రిక్ వేరియంట్‌లో & తరువాత పెట్రోల్-డీజిల్ వెర్షన్‌లో లాంచ్ చేస్తుంది. టాటా సియెర్రా EV Acti.ev+ ఆర్కిటెక్చర్‌పై నిర్మితమైంది & హారియర్ EVలోని అనేక విడిభాగాలను దీనిలోనూ చూడవచ్చు. ఈ ఎస్‌యూవీ 168 bhp & 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది, అయితే, 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ కూడా ఉండవచ్చు. ఫీచర్లలో - స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, ADAS సెన్సార్లు & గ్లోస్ బ్లాక్ గ్రిల్ ఉన్నాయి, ఇవి ఈ కారుకు ఫ్యూచరిస్టిక్ & ప్రీమియం లుక్ ఇస్తాయి.
మీరు, మరికొన్ని నెలల్లో ఒక మంచి SUV కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, ఈ కార్లు మీకు మంచి ఎంపిక కావచ్చు.





















