అన్వేషించండి

కొత్త లోగో, తక్కువ ధరతో 2026 రెనాల్ట్ క్విడ్ లాంచ్ - పాత మోడల్‌తో పోలిస్తే తేడాలేంటి?

2026 రెనాల్ట్ క్విడ్ భారత్‌లో విడుదలైంది. కొత్త లోగో, స్వల్ప డిజైన్ మార్పులు, రెండు వేరియంట్లు, పాత 1.0 లీటర్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది.

Renault Kwid new vs old differences: భారత్‌లో అత్యంత చవకగా అందుబాటులో ఉన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన రెనాల్ట్ క్విడ్‌కు 2026 మోడల్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. 2019లో భారీ ఫేస్‌లిఫ్ట్‌తో వచ్చిన ఈ కారు, 2022లో స్వల్ప కాస్మెటిక్ అప్‌డేట్‌ అందుకుంది. ఇప్పుడు మరోసారి చిన్నపాటి మార్పులతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈసారి డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొత్త లోగో, కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్లు, తగ్గిన ధరలు వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కారు మారుతి ఆల్టో కే10 & మారుతి ఎస్-ప్రెస్సోకు గట్టి పోటీగా నిలుస్తోంది.

రెనాల్ట్ లోగో కొత్తగా..
బయటి డిజైన్ పరంగా చూస్తే కొత్త క్విడ్‌లో పెద్దగా మార్పులు కనిపించవు. ముందు భాగంలో ఉన్న స్లిమ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, బంపర్‌లో అమర్చిన హెడ్‌ల్యాంప్స్, ఫాక్స్ ఫ్రంట్ డిఫ్యూజర్ డిజైన్‌ను అలాగే కొనసాగించారు. అయితే ముందుభాగంలో ఇప్పుడు రెనాల్ట్ కొత్త లోగోను అమర్చడం మాత్రమే ప్రధాన మార్పు. పక్క భాగంలో కూడా పెద్దగా మార్పులు లేవు. అయితే కొత్త టూ టోన్ వీల్ కవర్లు & వాటిపై కొత్త రెనాల్ట్ లోగోను అందించారు. టాప్ క్లైంబర్ వేరియంట్‌లో క్లైంబర్ బ్యాడ్జింగ్, రూఫ్ రైల్స్ & బ్లాక్ బాడీ క్లాడింగ్‌ను అలాగే ఉంచారు. వెనుక భాగంలో కూడా కొత్త రెనాల్ట్ లోగోతో పాటు టెయిల్‌గేట్‌పై కొత్త క్విడ్ లెటరింగ్‌ను అందించారు. టెయిల్ ల్యాంప్స్, బంపర్ & రిఫ్లెక్టర్లు మాత్రం పాత మోడల్‌లాగే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: E20 తర్వాత మరో పెద్ద అడుగు - డీజిల్‌లో ఐసోబ్యూటనాల్ మిశ్రమానికి సిద్ధమవుతున్న భారత్

క్యాబిన్‌లోకి అడుగు పెడితే ప్రధానంగా కనిపించే మార్పు స్టీరింగ్ వీల్. కొత్త డిజైన్‌తో పాటు రెనాల్ట్ తాజా లోగోను ఇందులో అందించారు. మిగిలిన ఇంటీరియర్ దాదాపు పాత మోడల్‌లాగే కొనసాగింది. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ & డ్యాష్‌బోర్డ్‌పై ఫిజికల్ బటన్లు అందుబాటులో ఉన్నాయి. క్లైంబర్ మాన్యువల్ వేరియంట్‌లో టూ టోన్ గేర్ లివర్ & AMT వేరియంట్‌లో రోటరీ గేర్ సెలెక్టర్‌ను అలాగే కొనసాగించారు. సీట్లకు గ్రే రంగు అప్హోల్స్టరీతో పాటు పసుపు రంగు హైలైట్స్‌ను కూడా యథాతథంగా ఉంచారు.

ప్రాక్టికాలిటీ పరంగా కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. క్యాబిన్‌లో స్టోరేజ్ స్పేస్, ప్రయాణికులకు లభించే స్థలం & 279 లీటర్ల బూట్ స్పేస్ పాత మోడల్‌తో సమానంగానే ఉన్నాయి. దీంతో కుటుంబ అవసరాలకు అనువైన హ్యాచ్‌బ్యాక్‌గా ఇది కొనసాగనుంది.

ఇంజిన్‌లో కూడా మార్పులు చేయలేదు. 1.0 లీటర్ మూడు సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 69 hp పవర్ & 92.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. పనితీరు & డ్రైవింగ్ అనుభవం కూడా పాత మోడల్‌తో సమానంగానే ఉండనుంది.

ఇది కూడా చదవండి: టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు

ధరలు
మరో ముఖ్యమైన మార్పు వేరియంట్లలో కనిపిస్తోంది. గతంలో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్న క్విడ్ ఇప్పుడు కేవలం ఎవల్యూషన్ & క్లైంబర్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ షోరూమ్ ధరలు రూ.4.53 లక్షల నుంచి రూ.5.61 లక్షల వరకు ఉన్నాయి. బేస్ ఎవల్యూషన్ మాన్యువల్ వేరియంట్ ధర గతంతో పోలిస్తే రూ.13,500 తగ్గగా, AMT వేరియంట్ రూ.10,000 తగ్గింది. క్లైంబర్ మాన్యువల్ ధర రూ.32,000 తగ్గగా, AMT వేరియంట్ ధర రూ.27,200 మేర తగ్గింది. 

తెలుగు రాష్ట్రాల్లో ఆన్ రోడ్ ధరలు సుమారు రూ.5.33 లక్షల నుంచి రూ.6.69 లక్షల వరకు ఉంటాయి. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget