2025 Tata Sierra లో ఏ వేరియంట్ కొనాలి? - 7 ట్రిమ్‌లు, వాటి ఫీచర్ల గురించి పూర్తి వివరాలు
2025 టాటా సియారా 7 ట్రిమ్‌లలో వచ్చింది. ఈ వేరియంట్లు కొత్తగా ఏం ఇస్తున్నాయి?. పెట్రోల్–డీజిల్ ఎంపికలు, ఫీచర్లు, రంగులు, ప్రతి వేరియంట్‌లో దొరికే స్పెషల్ ఫీచర్లు అన్నీ ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

2025 Tata Sierra Variants Explained: ఎంతోకాలంగా ఊరించిన 2025 టాటా సియారా వచ్చేసింది. రెండు దశాబ్దాల తర్వాత ఈ కారు తిరిగి రోడ్లపైకి రావడం SUV ప్రేమికుల్లో ఆసక్తి రేపుతోంది. సియారా, ఇప్పుడు, టాటా SUVల లైనప్‌లో Curvv కంటే పైన, Harrier కంటే దిగువన ఉంటుంది. కొత్త సియారా.. బాక్సీ డిజైన్, మస్క్యులర్ బాడీ, పాత సియారాలో కనిపించిన క్లాసిక్ టచ్‌లతో ఆధునిక స్టైల్‌ను మిక్స్ చేసి తీసుకొచ్చింది. అంతర్గతంగా మాత్రం పూర్తిగా మినిమలిస్టిక్, ప్రీమియం లుక్, కొత్త టెక్నాలజీతో నిండిపోయి ఉంటుంది.
ధరలు
2025 Tata Sierra ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ సెగ్మెంట్‌లో ఇది Honda Elevate, Kia Seltos, Hyundai Creta, Grand Vitara, Skoda Kushaq, Hyryderలను ఢీకొంటుంది.
వేరియంట్లు
ఈ SUVలో మొత్తం ఏడు వేరియంట్లు ఉన్నాయి: Smart+, Pure, Pure+, Adventure, Adventure+, Accomplished, Accomplished+.
ఇంజిన్ ఎంపికలు
సియారాలో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి:
1.5L NA పెట్రోల్: 106hp, 145Nm – 6MT & 7DCT
1.5L టర్బో పెట్రోల్: 160hp, 255Nm – 6AT
1.5L టర్బో డీజిల్: 118hp, 260–280Nm – 6MT/6AT
ప్రస్తుతం అన్ని వేరియంట్లను FWDలో మాత్రమే అందిస్తున్నారు.
రంగుల ఎంపికలు
కొత్త సియారా మొత్తం ఆరు కలర్స్‌లో అందుబాటులో ఉంది, అవి... Andaman Adventure, Bengal Rouge, Coorg Clouds, Munnar Mist, Pristine White, Pure Grey. ప్రతి కలర్‌కు బ్లాక్ రూఫ్ స్టాండర్డ్‌గా ఉంటుంది.
వేరియంట్‌వారీగా ముఖ్యమైన ఫీచర్లు
Smart+ (బేస్ వేరియంట్)
LED Light Saber DRLs, Bi-LED హెడ్‌ల్యాంప్స్, వెల్‌కమ్ లైట్లతో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 17-అంగుళాల స్టీల్ వీల్స్, టిల్ట్–టెలిస్కోపిక్ స్టీరింగ్, పుష్-స్టార్ట్, EPB, 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, రియర్ సెన్సర్లు వంటి అన్ని బేసిక్-కన్వీనియెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
Pure
Smart+ ఫీచర్లతో పాటు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Android Auto/CarPlay, 8-స్పీకర్ ఆడియో, ప్యాడిల్స్ (ATలో), రియర్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), క్రూజ్ కంట్రోల్, హిల్-డీసెంట్ కంట్రోల్ వంటి టెక్ ఫీచర్లు ఇక్కడ మొదలవుతాయి.
Pure+
Pure ఫీచర్లతో పాటు 17-అంగుళాల అల్లాయ్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, వాయిస్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ డీఫాగర్, రియర్ USB-C వంటి కంఫర్ట్ ఫీచర్లు జతవుతాయి.
Adventure
Pure+ ఫీచర్లతో పాటు ఫ్రంట్ LED ఫాగ్‌ల్యాంప్స్, కార్నరింగ్ ఫంక్షన్, రూఫ్ రైల్స్, లెదరెట్ స్టీరింగ్, 7-అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, ఫ్రంట్ సెన్సర్లు, సరౌండ్ వ్యూ కెమెరా వంటి ఆప్‌డేట్స్.
Adventure+
Adventure ఫీచర్లతో పాటు సూపర్‌గ్లైడ్ సస్పెన్షన్, టెరైన్ మోడ్స్ (Normal, Wet, Rough), 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, బాస్ మోడ్, అండర్-థై సపోర్ట్, రియర్ ఆక్యుపెంట్ సెన్సర్ వంటి ప్రీమియం ఫీచర్లు.
Accomplished
Adventure+ ఫీచర్లతో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, JBL 12-స్పీకర్ సిస్టమ్ విత్ డాల్బీ అట్మాస్, AR HUD, లెవెల్-2 ADAS వంటి టాప్ క్లాస్ సేఫ్టీ & కంఫర్ట్ ఫీచర్లు.
Accomplished+
Accomplished ఫీచర్లతో పాటు పవర్డ్ టేల్‌గేట్, నైట్ సేబర్ బై-ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, 12.3 అంగుళాల ప్యాసింజర్ టచ్‌స్క్రీన్, అలెక్సా, మాపుల్స్ ఆటో, iRA సూట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ ఎలర్ట్ వంటి పూర్తి హైఎండ్ ఫీచర్లు.
2025 టాటా సియారా ప్రతి వేరియంట్ తనదైన ప్రత్యేకతతో ఉంటుంది. బడ్జెట్ & అవసరాలపై ఆధారపడి Smart+ నుంచి Accomplished+ వరకు మీకు సరిపోయే వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు, రంగుల వైవిధ్యం.. ఇలా ఆల్ రౌండ్ SUV కావాలనుకునే వారికి సియారా మంచి ఆప్షన్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















