అన్వేషించండి

రూ.1.96 లక్షలకే Royal Enfield Meteor 350 Fireball – LED లైట్ల నుంచి కొత్త కలర్స్‌ వరకు అన్నీ హైలైట్సే!

2025 Royal Enfield Meteor 350: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, '2025 మీటియర్‌ 350'ని రూ. 1.96 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో లాంచ్‌ చేసింది. బుకింగ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి, డెలివరీలు సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభం.

2025 Royal Enfield Meteor 350 Fireball Price Features: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూసిన 2025 మీటియర్‌ 350 ఇప్పుడు అధికారికంగా లాంచ్‌ అయింది. తెలుగు రాష్ట్రాల్లో, ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1.96 లక్షలతో ఈ కొత్త మోడల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈసారి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కేవలం చిన్న మార్పులతో సరిపెట్టకుండా, యువతను దృష్టిలో పెట్టుకుని పెద్ద మార్పులు చేసింది. ఫీచర్లలో, స్టైల్‌లో మంచి అప్‌డేట్స్‌ ఇచ్చింది.

నాలుగు వేరియంట్లు - కొత్త కలర్స్‌
కొత్త మీటియర్‌ 350 నాలుగు వేరియంట్లలో వచ్చింది, అవి - ఫైర్‌బాల్‌, స్టెల్లార్‌, అరోరా, సూపర్‌నోవా (Fireball, Stellar, Aurora, Supernova). వీటికి అదనంగా ఏడు కలర్‌ ఆప్షన్లు ఇచ్చారు. ఫైర్‌బాల్‌ ఆరెంజ్‌, గ్రే, స్టెల్లర్‌ మ్యాట్‌ గ్రే, మెరైన్‌ బ్లూ, ఔరోరా రెట్రో గ్రీన్‌, రెడ్‌, సూపర్నోవా బ్లాక్‌ కొత్తగా జోడించారు. ఈ కలర్స్‌ ప్రత్యేకంగా రోడ్డుపై మీ బైక్‌ని ఆకట్టుకునేలా చేస్తాయి.

కీలక స్పెసిఫికేషన్లు 

ఇంజిన్‌ -- 349.34 cc
పవర్‌ -- 20.21 PS
టార్క్‌ -- 27 Nm
మైలేజ్‌ -- 41.88 kmpl
బరువు -- 191 kg
బ్రేకులు -- డబుల్‌ డిస్క్‌

టాప్‌ ఫీచర్లు

ABS డ్యూయల్ ఛానల్
DRLలు
మొబైల్ కనెక్టివిటీ బ్లూటూత్
నావిగేషన్
సర్వీస్ డ్యూ ఇండికేటర్
LED టెయిల్ లైట్
స్పీడోమీటర్ డిజిటల్
ఓడోమీటర్ డిజిటల్
ట్రిప్మీటర్ డిజిటల్
ఇంధన గేజ్

కొత్త ఫీచర్లు – LED టచ్‌
ఈసారి మీటియర్‌ 350లో LED హెడ్‌ల్యాంప్‌, LED టర్న్‌ ఇండికేటర్లు స్టాండర్డ్‌గా వచ్చాయి. అంతేకాదు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యేకత అయిన ట్రిప్పర్‌ నావిగేషన్‌ పోడ్‌ కూడా ఈ బండిలో ఉంది. అదనంగా USB టైప్‌-C ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌, అసిస్ట్‌ & స్లిప్పర్‌ క్లచ్‌, అడ్జస్టబుల్‌ బ్రేక్‌ - క్లచ్‌ లీవర్స్‌ కూడా అందించారు. ఫైర్‌బాల్‌, స్టెల్లర్‌ వేరియంట్లలో LED హెడ్‌ల్యాంప్‌ & ట్రిప్పర్‌ పోడ్‌ స్టాండర్డ్‌గా ఉండగా, సూపర్‌నోవా & అరోరాలో అడ్జస్టబుల్‌ లీవర్స్‌ కూడా ఇచ్చారు.

ఇంజిన్‌ & పనితీరు
ఇంజిన్‌ సైడ్‌లో పెద్ద మార్పులు లేవు. 349cc సింగిల్‌-సిలిండర్‌, ఎయిర్‌/ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 20.2 bhp పవర్‌, 27 Nm టార్క్‌ ఇస్తుంది. దీనిని 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో జత చేశారు. అయితే కొత్తగా ఇచ్చిన స్లిప్పర్‌ క్లచ్‌ రైడింగ్‌ అనుభవాన్ని మరింత స్మూత్‌గా చేస్తుంది.

బుకింగ్స్‌ & డెలివరీస్‌
కొత్త మీటియర్‌ 350 బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. మీరు కావాలనుకుంటే, మీ దగ్గరలోని షోరూమ్‌కు వెళ్లి టెస్ట్‌ రైడ్‌ కూడా చేయవచ్చు. డెలివరీలు మాత్రం మరో వారంలో, సెప్టెంబర్‌ 22, 2025 నుంచి అధికారికంగా మొదలవుతాయి. అదనంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అధికారిక "Make It Yours" చానెల్‌ ద్వారా బైక్‌ను మీకు నచ్చిన విధంగా కస్టమైజ్‌ చేసుకోవచ్చు.

యూత్‌ కోసం పర్ఫెక్ట్‌ క్రూయిజర్‌
ఈ కొత్త అప్‌డేట్స్‌తో 2025 మీటియర్‌ 350 రోడ్డుపై కేవలం ఒక బైక్‌లా కాకుండా ఒక స్టైల్‌ స్టేట్‌మెంట్‌లా కనిపిస్తుంది. క్రూయిజర్‌ బైక్‌ కావాలనుకునే యువతకు ఇది పర్ఫెక్ట్‌ ఆప్షన్‌. ధర, కలర్స్‌, ఫీచర్లు అన్నీ కలిపి ఈ బైక్‌ని మార్కెట్లో మరోసారి హాట్‌ టాపిక్‌ చేశాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
Advertisement

వీడియోలు

మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
FIFA World Cup 2026 : FIFA ప్రపంచ కప్ 2026  సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?
FIFA ప్రపంచ కప్ 2026 సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
OTT Spy Movies: 'ధురంధర్' సినిమా కన్నా ముందుగా  ఈ స్పై థ్రిల్లర్స్ చూడండి, ఈ OTT ల్లో అందుబాటులో ఉన్నాయ్!
'ధురంధర్' సినిమా కన్నా ముందుగా ఈ స్పై థ్రిల్లర్స్ చూడండి, ఈ OTT ల్లో అందుబాటులో ఉన్నాయ్!
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Embed widget