2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
2024 TVS Apache RTR 160 4V Launch: 2024 టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ బైక్ మార్కెట్లో లాంచ్ అయింది.
TVS Apache RTR 160 4V: టీవీఎస్ మోటార్ ఇండియా తన 2024 అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీని గోవా బైక్ వీక్‌లో రూ. 1.35 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. బైక్‌కు సంబంధించిన ఈ 2024 వేరియంట్ సరికొత్త లైట్నింగ్ బ్లూ పెయింట్ స్కీమ్‌తో సహా అనేక అప్‌గ్రేడ్‌లను పొందింది. వీటిలో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, బిగ్ రియర్ డిస్క్, వాయిస్ అసిస్ట్ ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్నాయి.
కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ ఇంజిన్
ఈ మోడల్‌కు పవర్ ఇవ్వడానికి బైక్‌లో 160 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 17.35 హెచ్‌పీ శక్తిని, 14.73 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది.
ఇది కాకుండా ఈ కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ స్పోర్ట్స్ బైక్‌లో 240 మిల్లీమీటర్ బిగ్ రియర్ డిస్క్, మూడు రైడింగ్ మోడ్స్ (అర్బన్, రెయిన్, స్పోర్ట్) ఉన్నాయి. సస్పెన్షన్ గురించి చెప్పాలంటే ముందు వైపున ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ యూనిట్ ఉన్నాయి. అయితే ఈ బైక్‌లో డిజైన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ ఫీచర్లు
దీని ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ బైక్‌లో వాయిస్ అసిస్ట్‌తో పాటు స్టాండర్డ్ స్మార్ట్‌క్సనెక్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇది కాకుండా టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్, క్రాష్ అలర్ట్ సిస్టం వంటి అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఈ బైక్ గంటకు 114 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకుపోగలదు.
వీటితో పోటీ...
కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ, బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 వంటి బైక్‌లకు మంచి పోటీని ఇవ్వనుంది. వార్షిక ప్రాతిపదికన ఈ బైక్ విక్రయాల్లో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయానికి కంపెనీ 10,056 యూనిట్లను విక్రయించగా, ఇప్పుడు 16,782 యూనిట్లను విక్రయించింది.
మరోవైపు కొత్త సంవత్సరం ప్రారంభంలో మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా, మహీంద్రా తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. 2024 జనవరి 16వ తేదీన క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేయనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. కియా తన ఫేస్‌లిఫ్టెడ్ సోనెట్‌ను 2023 డిసెంబర్ 14వ తేదీన పరిచయం చేయనుంది. అయితే మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఇది 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత మహీంద్రా తన ఎక్స్‌యూవీ300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అప్‌డేటెడ్ మోడళ్లను కూడా మార్కెట్లో లాంచ్ చేయనుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!