New Maruti Suzuki Swift: కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్ - వచ్చే నెలలో ఎప్పుడంటే?
Maruti Suzuki Swift: కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్ మే 9వ తేదీన మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
2024 Maruti Suzuki Swift: నాలుగో తరం మారుతి సుజుకి స్విఫ్ట్ భారతదేశంలో 2024 మే 9వ తేదీన అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని అధికారిక బుకింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ, కొన్ని ఎంపిక చేసిన మారుతి సుజుకి అరేనా డీలర్‌షిప్‌లు రూ.11,000 టోకెన్ అమౌంట్‌తో ప్రీ-ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభించాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ మరింత మెరుగైన స్టైలింగ్, మరిన్ని ఫీచర్లు, కొత్త ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది మరింత ఎక్కువ మైలేజీతో వస్తుంది.
ఇంజిన్ ఎలా ఉండనుంది?
జపాన్ స్పెక్ వెర్షన్‌తో పోలిస్తే భారతదేశంలోని కొత్త 2024 మారుతి స్విఫ్ట్‌లో స్వల్పంగా బ్యూటీ ఛేంజెస్ ఉండనున్నాయి. అతిపెద్ద మార్పు ఏమిటంటే ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. (దీని కోడెనేమ్: జెడ్12). ఇది పాత కే సిరీస్, 4 సిలిండర్ ఇంజన్‌ను రీప్లేస్ చేస్తుంది. కొత్త ఇంజన్ తేలికైనది, కఠినమైన బీఎస్6 ఉద్గార ప్రమాణాలు, CAFÉ (కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియన్సీ) స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కొత్త జెడ్-సిరీస్ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా రావచ్చు. ఇది దాని ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. మారుతి సుజుకి కొత్త తరం డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కోసం కూడా ఇదే ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 2024 పండుగ సీజన్‌లో విడుదల కానుంది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
డిజైన్, కొలతలు ఇలా...
కొత్త 2024 మారుతి స్విఫ్ట్ భారీగా అప్‌డేట్ అయిన హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లో తయారు అయింది. ఇది మునుపటి మోడల్ కంటే పొడవుగా ఉంటుంది. దీని పొడవు 3860 మిల్లీమీటర్లుగానూ, వెడల్పు 1695 మిల్లీమీటర్లుగానూ, ఎత్తు 1500 మిల్లీమీటర్లుగానూ ఉంటుంది. దీని ఇంటీరియర్‌లో మార్పులు ఫ్రాంక్స్ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్, బలెనో హ్యాచ్‌బ్యాక్ తరహాలో ఉన్నాయి. ఇది కొత్త డ్యూయల్ టోన్ బ్లాక్ / బీజ్ థీమ్‌ను పొందుతుంది.
ధర ఎంత ఉండవచ్చు?
కొత్త స్విఫ్ట్ వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇది ఆటోమేటిక్ ఏసీ, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఎంఐడీ అనలాగ్ డయల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, హైట్ అడ్జస్టబుల్ సీటు, వెనుక హీటర్ డక్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. కొత్త 2024 మారుతి స్విఫ్ట్ అన్ని అప్‌గ్రేడ్‌లతో కొంచెం ఖరీదైనదిగా ఉండనుంది. దీని ప్రస్తుత మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుండి రూ.9.03 లక్షల మధ్య ఉంది. కాబట్టి త్వరలో లాంచ్ కానున్న మోడల్ ధర మరికొంచెం ఎక్కువగా ఉండవచ్చు.
#MarutiSuzuki rolls out Ertiga at the new assembly line at Manesar plant. The new line brings additional capability of 100,000 units per annum and increases total capability at Manesar to 900,000 units per annum. pic.twitter.com/avK8mIoQLy
— Maruti Suzuki (@Maruti_Corp) April 9, 2024