2023 Hero Karizma: మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న కరిజ్మా - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన హీరో!
2023 హీరో కరిజ్మా బైక్ మనదేశంలో ఆగస్టు 29వ తేదీన లాంచ్ కానుంది.
2023 Hero Karizma: భారతదేశంలోని ప్రజలు కొత్త హీరో కరిజ్మా స్పోర్ట్స్ బైక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ బైక్‌ను ఆగస్టు 29వ తేదీన బైక్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించాడు. కంపెనీ అధికారిక టీజర్‌లో "విట్నెస్ ది రిటర్న్ ఆఫ్ ది లెజెండ్" అని పేర్కొంది. దీని లాంచింగ్ ఈవెంట్ గురుగ్రామ్‌లో జరగనుంది. 2023 హీరో కరిజ్మా స్పెసిఫికేషన్‌లు ఇంకా తెలపలేదు. కానీ కొన్ని వివరాలు మాత్రం లీకయ్యాయి.
ఇంజిన్, డిజైన్ ఇలా...
2023 హీరో కరిజ్మా కొత్త 210సీసీ ఇంజన్‌ని పొందే అవకాశం ఉంది. ఇది చాలా శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 25 బీహెచ్‌పీ పవర్‌ని, 30 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్‌తో కూడిన డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్‌ను 2023 హీరో కరిజ్మా సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది.
ఇటీవల కొత్త కరిజ్మా డిజైన్ పేటెంట్ వెబ్‌లో కనిపించింది. దీని డిజైన్‌కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా వచ్చింది. అగ్రెసివ్ హెడ్‌ల్యాంప్‌లు, డిజైనర్ ఫ్యూయల్ ట్యాంక్, బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్స్, రైజ్డ్ హ్యాండిల్ బార్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, స్ప్లిట్ సీట్, స్మూత్ రియర్ సెక్షన్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కారణంగా ముందు భాగంలో స్పోర్టీ లుక్‌ను పొందింది. కొత్త 2023 హీరో కరిజ్మా టర్న్ బై టర్న్ నావిగేషన్, రియల్ టైమ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇండికేటర్‌లు కూడా ఉన్న క్లంప్లీట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందనుంది.
దీని ధర ఎంత?
ధర గురించి చెప్పాలంటే కొత్త కరిజ్మా ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.80 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. భారతీయ మార్కెట్లో ఈ బైక్ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250, యమహా వైజెడ్ఎఫ్ ఆర్15లకు పోటీ ఇవ్వనుంది. సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్ 249 సీసీ ఇంజన్‌తో రానుంది. ఇది ఏడు వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
మరో కొత్త బైక్ కూడా...
హీరో మోటోకార్ప్ తన ప్లాట్‌ఫారమ్, ఇంజిన్‌ను కొత్త హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440తో పంచుకునే అవకాశం ఉంది. ఇందులో 400 సీసీ ఇంజిన్ ఉండనుందని తెలుస్తోంది. అయితే ఇందులో పూర్తిగా డిఫరెంట్ డిజైన్ కనిపించనుంది. దీనిని 2024 మార్చి నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది.
View this post on Instagram
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial