Citroen C5 Aircross: సిట్రోయెన్ కొత్త కారు లాంచ్ - అదిరిపోయే డిజైన్ - కేకపుట్టించే ఫీచర్లు!
సిట్రోయెన్ సీ5 కారు మనదేశంలో లాంచ్ అయింది. హ్యుండాయ్ టక్సన్, ఫోక్స్‌వాగన్ టిగ్వాన్, జీప్ కంపాస్‌లతో సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్ పోటీ పడనుంది.
సిట్రోయెన్ సీ5 ఎయిర్ క్రాస్ ఎస్‌యూవీ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.36.67 లక్షలుగా ఉంది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి షైన్ అని పేరు పెట్టారు. డ్యూయల్ టోన్ కలర్ మోడల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది చూడటానికి సీ5 గ్లోబల్ మోడల్ డిజైన్‌లోనే ఉంది.
ఇందులో స్టైలింగ్ విషయంలో సిట్రోయెన్ బోలెడన్ని మార్పులు చేసింది. కొత్త ఎక్స్‌టీరియర్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ ఎండ్ ఈ కారులో ఉన్నాయి. దీంతోపాటు గ్రిల్‌కు మ్యాచ్ అయ్యే రెండు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ కూడా అందించారు. బంపర్ డిజైన్ కొత్తగా ఉంది. కొత్త స్కిడ్ ప్లేట్, ఎయిర్ ఇన్‌టేక్స్ అందించారు.
18 అంగుళాల అలోయ్ వీల్స్ ఈ కారులో ఉన్నాయి. వెనకవైపు కూడా కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ అందించారు. లోపల 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం ఉంది. రీడిజైన్ చేసిన సెంట్రల్ కన్సోల్, గేర్ షిఫ్టర్, డ్రైవ్ మోడ్ బటన్స్ ఉన్నాయి.
వెనకవైపు సీట్లు కూడా మరింత కంఫర్టబుల్‌గా ఉండనున్నాయి. మూడు ప్రత్యేకంగా అడ్జస్ట్ చేసుకోదగ్గ రిక్లైనర్ సీట్లు ఉన్నాయి. బూట్ వాల్యూమ్ 580 లీటర్ల నుంచి 1630 లీటర్ల మధ్యలో ఉండనుంది. డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్స్ సీట్, ఆరు ఎయిర్ బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్ సహా మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
హ్యుండాయ్ టక్సన్, ఫోక్స్‌వాగన్ టిగ్వాన్, జీప్ కంపాస్‌లతో సిట్రోయెన్ సీ5 పోటీ పడనుంది. న్యూఢిల్లీ, గుర్గావ్, ముంబై, పుణే, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, చెన్నై, చండీఘర్, జైపూర్, లక్నో, భువనేశ్వర్, సూరత్, నాగ్‌పూర్, వైజాగ్, కాలికట్, కోయంబత్తూర్‌ల్లో దీని సేల్ జరగనుంది.
సిట్రోయెన్ ఇటీవలే మనదేశంలో కొత్త బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేసింది. అదే సిట్రోయెన్ సీ3. దీని ధర మనదేశంలో రూ.5,70,500 (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఇది లైవ్ ట్రిమ్ లెవల్ ధర. ఇక హైఎండ్ అయిన ఫీల్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.8,05,000గా ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కూడా ఇందులో ఉండనుంది.
ఇందులో ఏకంగా 56 కస్టమైజేషన్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే 70కి పైగా యాక్సెసరీలు కూడా తీసుకోవచ్చు. వైబ్, ఎలిగెన్స్, ఎనర్జీ, కన్వీనియన్స్ అనే అదనపు ప్యాకేజీ ఆప్షన్లు కూడా ఈ కారుతో అందించారు. ఈ కారు మారుతి సుజుకి ఇగ్నిస్, టాటా పంచ్, నిస్సాన్ మ్యాగ్నైట్, రెనో కిగర్‌లతో పోటీ పడనుంది.
సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి 1.2 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ త్రీ-సిలిండర్ ఆప్షన్. ఇది 81 హెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. ఇక టర్బో చార్జర్ ఇంజిన్ ఆప్షన్ 109 హెచ్‌పీ, 190 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. నాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో 5-స్పీడ్ మాన్యువల్, టర్బోచార్జ్‌డ్ ఇంజిన్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌లు ఉండనున్నాయి.
ఈ కారులో 10 అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉండనుంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను ఇది సపోర్ట్ చేయనుంది. 4-స్పీకర్ సౌండ్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, కాల్ బటన్లు, పవర్డ్ విండోస్, మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోదగిన డ్రైవర్ సీట్ ఈ కారులో ఉన్నాయి.
ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, వెనకవైపు పార్కింగ్ సెన్సార్, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్పీడ్ సెన్సిటివ్ ఆటో-డోర్ లాక్, హై స్పీడ్ అలెర్ట్ సిస్టంలు సిట్రోయెన్ సీ3లో అందించారు. వీటితో పాటు మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?