అన్వేషించండి

Bhishma Ekadashi 2026: మాఘపౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని 'భీష్మ ఏకాదశి' అంటారెందుకు? ఈ రోజు విశిష్టత ఏంటి?

Significance of Bhishma Ekadashi 2026: జనవరి 29 గురువారం వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు.. ఈరోజుకున్న విశిష్టత ఏంటి? ఏం చేయాలి?

Bhishma Ekadashi 2026: మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. భీష్మపితామహుడు  భగవంతుడిలో ఐక్యమైన రోజు ఇదే. అంపశయ్యపై ఉన్న సమయంలో భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయ్యాక ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ భీష్ముడు అంపశయ్యపైనే ఉన్నాడు. మాఘమాసం శుక్లపక్షం అష్టమి రోజు నిర్యాణం చెందారు. భీష్ముడు నిర్యాణం చెందిన తర్వాత వచ్చిన ఏకాదశి కాబట్టి భీష్మ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి మరోపేరు జయ ఏకాదశి. 

భీష్ముడు అంపశయ్యపై ఉన్న సమయంలో...కృష్ణ పరమాత్ముడు పాండవులను తీసుకెళ్లాడు.  ధర్మశాస్త్రాలను అవపోశన పట్టిన మహనీయుడు భీష్ముడు . ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలడు. అంత గొప్ప వ్యక్తి దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది..ఆయన అస్తమయం తర్వాత ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవరూ ఉండరు..అందుకే సూక్ష్మ విషయాలు తెలుసుకునేందుకు రండి అని పాండవులకు చెప్పాడు కృష్ణుడు 

దేహమంతా బాణాలు గుచ్చుకుని..శరీరం పూర్తిగా క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ , నీరు ఆహారం లేకుండా ఉన్నాడు. తాను కోరుకున్న క్షణం మరణం పొందే వరం భీష్ముడికి ఉంది. కానీ ఇత్త బాధలు భరించినా దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేవరకూ అంపశయ్యపైనే ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత సూర్య భగవానుడి జయంతి అయిన రథసప్తమి ముగిసిన తర్వాత వచ్చే ఏకాదశి రోజు దేహాన్న విడిచిపెట్టాలని శ్రీ మహావిష్ణువును తలుచుకున్నాడు. అయితే తాను చేసిన ఓ దోషం స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతిపాపం శరీరంపై రాసి ఉంటుంది. అది పూర్తిగా తొలగిపోతే కానీ సద్గతి కలగదు. 

భీష్ముడు చేసిన ఆ దోషం ఏంటి?

ద్రౌపదికి నిండు సభలో అవమానం జరుగుతున్నా ఏం చేయలేకపోయాడు. ద్రౌపదికి శ్రీ కృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. తమ గురువైన వశిష్ఠుడు ద్రౌపదితో ఓ సందర్భంలో ఇలా చెప్పారు... 

మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః

ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకుంటే ఆయన పరిష్కరిస్తాడు అని అర్థం
 
కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే పరాక్రమవంతులైన భర్తులు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు..కానీ సోదరా అనగానే కృష్ణుడు ప్రత్యక్షమై ఆమె కష్టాన్ని తీర్చాడు.

భీష్ముడు..ధర్మరాజుకి ఉపదేశాలు చెబుతున్నప్పుడు పక్కనే ఉన్న ద్రౌపది ...కురుసభలో తనకు జరిగిన అవమానం గుర్తొచ్చి నవ్విందట. తాతా ఆ రోజు నాకు అవమానం జరుగుతుంటే ఈ ధర్మాలన్నీ ఏమయ్యాయి అని అడిగింది. అవును తల్లీ నా దేహం నా అధీనంలో లేదు..అది దుర్యోధనుడి ఆహారం తినడంతో తన సొంతం. అందుకే నీకు అవమానం జరుగుతోందని తెలిసినా నా దేహం నా మాట వినలేదు..అంత ఘోరమైన పాపం చేశాను కాబట్టి ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నాను అని సెలవిచ్చాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు అంపశయ్యపై ఉన్న భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కల్పించి పాండవులకు ధర్మసూత్రాలు చెప్పించాడు 

భగవద్గీతను నేరుగా చెప్పిన శ్రీ కృష్ణుడు.. విష్ణు సహస్రనామాన్ని భీష్ముడితో చెప్పించాడు..అందుకే ఏ ఏకాదశి అయినా...ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం విన్నా, పఠించినా మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget