News
News
X

Weekly Horoscope : ఈ రాశులవారికి ఆర్థిక లాభం - ఆ రాశులవారికి అదనపు ఖర్చులు, సెప్టెంబర్ 5 నుంచి 11 వరకూ వారఫలాలు

Weekly Horoscope : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope Weekly  September 05 to 11  2022 : సెప్టెంబర్ 5 నుంచి 11 వరకూ మేష రాశి నుంచి మీన రాశివరకూ ఏ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశివారికి ప్రతికూల ఫలితాలున్నాయో తెలుసుకుందాం...

మేష రాశి 
మేష రాశి వారు ఈ వారం ఎక్కువ ఖర్చులు భరించవలసి రావచ్చు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఆస్తికి సంబంధించిన పనుల విషయంలో మనసులో ఆందోళన ఏర్పడవచ్చు. కొన్ని పనులు నెరవేరాలంటే కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. వారం చివరిలో కొంత మెరుగుదల కనిపిస్తుంది.

వృషభ రాశి
ఈ వారం మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేస్తారు. కుటుంబం, స్నేహితులు, సన్నిహితుల సహకారం అందుతుంది.  మంచి పేరుప్రతిష్టలు సంపాదిస్తారు. అధికారుల వైఖరి మీపట్ల అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో ఒక వ్యక్తి వల్ల మీ సమస్యలు పెరగవచ్చు.ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వారం చివరిలో కొన్ని శుభవార్తలు వింటారు.

మిథున రాశి
మిథున రాశి వారికి ఈ వారం వారి వారి రంగాల్లో పురోగతికి అవకాశం ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. ప్రయాణం చేసే సమయంలో ఓ వ్యక్తిని కలుస్తారు. వారి ద్వారా మీరు భవిష్యత్ లో లాభపతారు. స్థిరమైన ఆలోచన వన్న లాభపడతారు.

కర్కాటక రాశి
కుటుంబంలో సంతోషాన్ని తీసుకురావడానికి మీరు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విజయానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ రంగంలో సత్తాచాటుతారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ వారం ఆరోగ్యంలో చాలా హెచ్చు తగ్గులు ఉండవచ్చు.. జాగ్రత్త పడండి

సింహ రాశి
ఈ రాశివారికి ఈ వారంలో స్వల్ప ధనలాభం ఉంటుంది. దూర ప్రయాణం చేయాలి అనుకుంటే.. అత్యవసరం అయితే తప్ప వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ప్రస్తుతానికి వాయిదా వేయడమే మంచిది.

Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

కన్యా రాశి
ఈ వారం కన్యా రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఏ ప్రాజెక్ట్‌లో అయినా బాగా పనిచేస్తారు. ఉద్యోగులు మంచి పేరు సంపాదించుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఓసారి ఆలోచించి ముందడుగు వేయండి. అపరిచితులతో జాగ్రత్త.

తులా రాశి 
ఈ వారం తులారాశి వారికి ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. ఆర్థికంగా మరో మెట్టు ఎక్కేందుకు  ఒకరి సహాయం అవసరం కావచ్చు. ఈ వారం మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి.

వృశ్చిక రాశి 
ఈ వారం మీకు అన్నీ అనుకూల ఫలితాలే. ఆరోగ్యం గతంలో కన్నా మెరుగుపడటం గమనించవచ్చు. మీరు కుటుంబంలో ఏదో విషయం గురించి ఆందోళన చెందుతారు. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక విషయాల్లో సమతుల్యత అవసరం. అవసరానికి డబ్బు చేతికందుతుంది.

Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ఈ వారం కొన్ని శుభవార్తలను వింటారు. క్రమంగా కుటుంబంలో ఆనందం , శ్రేయస్సు ఉంటుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. తొందరపాటు తగ్గించుకోండి. అనవసర ప్రసంగాలు చేయకండి.

మకర రాశి 
మకర రాశి వారు ప్రయాణాల్లో లాభపడతారు. మీ ఆరోగ్యం బావుంటుంది. ఆస్తి పొందే అవకాశాలున్నాయి. మీ రంగంలో మీరు బలమైన ముద్ర వేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూలమైన వారం ఇది. స్తిరాస్థి కొనుగోలు చేసే సూచనలున్నాయి. 

కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. అదృష్టం మీకు కలిసొస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.గృహ, వాహన యోగం ఉంది.

మీన రాశి 
మీన రాశి వారికి ఈ వారం కొత్త ప్రాజెక్ట్ రావొచ్చు. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో బయటి వ్యక్తుల జోక్యం సమస్యను పెంచుతుంది. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి ఈ వారం సరైన సమయం కాదు. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు.

Published at : 05 Sep 2022 07:57 AM (IST) Tags: Horoscope Weekly astrology in telugu astrological prediction horoscope today Zodiac Signs Weekly horoscope from September 5 to September 11

సంబంధిత కథనాలు

Navratri 2022:   జ్ఞానానికి అధిపతి అయిన స్కందుడి తల్లి, ఐదోరోజు కాలస్వరూపిణి 'స్కందమాత' దుర్గ

Navratri 2022: జ్ఞానానికి అధిపతి అయిన స్కందుడి తల్లి, ఐదోరోజు కాలస్వరూపిణి 'స్కందమాత' దుర్గ

Navratri 2022: సకల శుభాలను కలిగించే శ్రీ లలితా చాలీసా

Navratri 2022: సకల శుభాలను కలిగించే శ్రీ లలితా చాలీసా

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు అనుకున్న పనులు పూర్తిచేస్తారు, సెప్టెంబర్‌ 30 న్యూమరాలజీ

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు అనుకున్న పనులు పూర్తిచేస్తారు, సెప్టెంబర్‌ 30 న్యూమరాలజీ

Horoscope Today 30th September: ఈ రాశులవారిపై లలితా త్రిపుర సుందరి కరుణా కటాక్షాలుంటాయి

Horoscope Today 30th September: ఈ రాశులవారిపై లలితా త్రిపుర సుందరి కరుణా కటాక్షాలుంటాయి

Navratri 2022: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

Navratri 2022: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

టాప్ స్టోరీస్

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ