News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Weekly Horoscope (13-19 November) : ఈ రాశులవారికి ఈ వారం స్తిరాస్థి వ్యవహారాలు కలిసొస్తాయి, నవంబరు 13 నుంచి 20 వారఫలాలు

Weekly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Weekly Horoscope 2022 November 13 to 19 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ  వారం మేష రాశి నుంచి కన్యారాశి వరకూ ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఓ ప్లాన్ ప్రకారం మందుకెళితే అనుకున్న పనులు పూర్తవుతాయి.కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని సందర్భాల్లో మీ మాటతీరుని బట్టి ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడంతో కాస్త ఆందోళన చెందుతారు...కానీ వారం ద్వితీయార్థంలో అంతా మంచే జరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇదే మంచి సమయం. 

వృషభ రాశి
ఈ వారం మనోధైర్యంతో ముందుకుసాగండి. ఆర్థిక వ్యవహారాల విషయంల జాగ్రత్తగా వ్యవహరించండి.మీ ప్రణాళిలను బహిర్గతం చేయొద్దు.  ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. వేరేవారి విషయాల్లో తలదూర్చవద్దు..వివాదాలకు దూరంగా ఉండండ మంచిది. స్తిరాస్థి వ్యవహారాల్లో అడుగు ముందుకుపడుతుంది. తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. అధిన ఒత్తిడికి లోనవద్దు.

మిథున రాశి
ఈ రాశివారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. ఉత్సాహంగా పని చేసి లక్ష్యాలు చేరుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు పరిగణలోకి తీసుకోండి. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. సున్నితంగా మాట్లాడడం వలన చాలా వివాదాలు పరిష్కారం అవుతాయి.  అనవసరమైన వివాదాలలో చిక్కుకోకుండా.. మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్లడం మంచిది. పరీక్ష-పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు వారంలోని ద్వితీయార్థం చాలా శుభప్రదంగా ఉంటుంది.

Also Read: ఈ రాశివారు ఎవ్వరి మాటలు పరిగణలోకి తీసుకోవద్దు మీ మనసుకి నచ్చింది చేయండి, నవంబరు13 రాశిఫలాలు

కర్కాటక రాశి
ఈ వారం కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే రంగాల్లో మీదే పైచేయిఅవుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారల నుంచి సహకారం అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం రెండూ బావుంటాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సీజనల్ వ్యాధుల పట్ల  అప్రమత్తంగా ఉండండి. ఈ వారంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, గాయం అయ్యే అవకాశం ఉంది.

సింహ రాశి
సింహ రాశి వారికి ఈ వారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ఓ శుభవార్త వింటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. భూములు-భవనాలు కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇదే సరైన సమయం. విదేశాలలో ఉద్యోగం, విద్య కోసం ప్రయత్నించే వారికి ఇదే శుభసమయం. మంచి ఆలోచనతో ముందుకు సాగడం మంచిది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలనుకున్నా, కొత్త ప్రణాళికలు అమలు చేయాలన్నా ఓసారి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.

Also Read: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!

కన్యా రాశి
వారం ప్రారంభంలో ప్రయాణాలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో లాభం అనుకున్న దానికన్నా తక్కువే ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాటపడడం తప్పదు. వృత్తి లేదా ఉద్యోగం- కుటుంబానికి మధ్య సమతుల్యత పాటించండి. కుటుంబ సభ్యుల అంగీకారం, సలహాలతో చేసేపనులు మంచి ఫలితాలనిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.

తులా రాశి నుంచి మీన రాశివరకూ వారఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 13 Nov 2022 07:35 AM (IST) Tags: Weekly Horoscope Saptahik Rashifal Scorpio Aries Pisces all zodiac signs Free Weekly Horoscope Prediction Saptahik Rashifal 13 to 19 Nov 2022 13 November 19 Weekly Horoscope 13 November 19 Weekly Health and Finance Horoscope

ఇవి కూడా చూడండి

Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో  ముఖ్యమైన రోజులివే!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Horoscope Today December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Horoscope Today  December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Christmas 2023: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

Christmas 2023: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత