News
News
X

13 November 19 Weekly Horoscope: ఈ రాశివారు కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహకరించకపోతే నష్టపోతారు, ఈ వారం రాశిఫలాలు

Weekly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Weekly Horoscope 2022 November 13 to 19 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ  వారం తులా రాశి నుంచి మీన రాశి వరకూ ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

(మేషం నుంచి కన్యా వారఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.....)

తులా రాశి
ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలున్నాయి. చాలా కాలంగా ఉద్యోగం మార్పు, బదిలీ గురించి ఆలోచిస్తున్న వారి కోరిక ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ వనరులు చేకూరతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ వారం ప్రత్యేకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలొస్తాయి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. స్తిరాస్థికి సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు. కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహకరించకపోతే నష్టపోతారు.  ఖర్చులు తగ్గించుకోండి. 

వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈవారం ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం చేసే పనులు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు ఏదైనా పెద్ద డీల్ మాట్లాడుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచిది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. గర్వం-అహంకారంతో పరుషంగా మాట్లాడితే కుటుంబ బంధాల్లో మరింత చీలిక పెరుగుతుంది జాగ్రత్తపడండి. వైవాహిక జీవితంలో సంతోషం పెరగాలంటే చిన్న చిన్న విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి భావాలను, అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

News Reels

Also Read: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!

ధనస్సు రాశి
గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ధనస్సురాశివారికి శుభఫలితాలున్నాయి. అనుకున్న పనులకు చిన్న చిన్న అడ్డంకులున్నా పూర్తవుతాయి. కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఈ వారం ఫలించే అవకాశం ఉంది. కాస్త ఓర్పుగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఆలోచనా విధానంతో ప్రశంసలు అందుకుంటారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు ఆలోచన వద్దు. కుటుంబ సభ్యులతో వివాదం పెట్టుకునే కన్నా సున్నితంగా మాట్లాడడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి

మకర రాశి
ఈ రాశివారికి ఈ వారం ఆరంభంలో కన్నా ద్వితీయార్థం బావుంటుంది. సన్నిహితుల కారణంగా మంచి జరుగుతుంది.కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వారం ప్రారంభంలో కార్యాలయంలో అదనపు భారం ఉన్నప్పటికీ రాను రాను రిలీఫ్ గా ఉంటుంది. పని విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులు ఈ వారం లాభాలు అందుకుంటారు. వారం చివరిలో, పిల్లలకి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

కుంభ రాశి
ఈ వారంలో చేసే పనుల్లో ఆంటకాలు ఉన్నప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగితే సక్సెస్ అవుతారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. పని విషయంలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కెరీర్, వ్యాపారం, ఇల్లు...ఈ మూడింటికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా తొందరపాటుతో తీసుకోవద్దు. వారం చివర్లో ప్రయాణాలు చేస్తారు..ప్రేమ సంబంధాలకు అనుకూలమైన రోజు

Also Read: కార్తీకమాసం ఎప్పటితో ఆఖరు, పోలిపాడ్యమి రోజు ఇలా చేస్తే పుణ్యం మొత్తం మీదే!

మీన రాశి
ఈ వారం మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. విదేశాల్లో వృత్తి, వ్యాపారాలు చేయాలనే ఆలోచనలో ఉన్న వారు సమస్యల్ని అధిగమించి ముందడుగు వేస్తారు.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు పరిష్కరించుకోవడం మంచిది.  వారం మధ్యలో వ్యాపార పర్యటనలు కలిసొస్తాయి. 

Published at : 13 Nov 2022 08:57 AM (IST) Tags: Weekly Horoscope Saptahik Rashifal Scorpio Aries Pisces all zodiac signs Free Weekly Horoscope Prediction Saptahik Rashifal 13 to 19 Nov 2022 13 November 19 Weekly Horoscope 13 November 19 Weekly Health and Finance Horoscope

సంబంధిత కథనాలు

Astro Tips: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!

Astro Tips: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!

Chanakya Neeti Telugu: ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది

Chanakya Neeti Telugu:  ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది

Facts About People Born in December: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

Facts About People Born in December: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

Daily Horoscope Today 30th November 2022: ఈ రాశివారు గందరగోళ దశలోకి ప్రవేశిస్తున్నారు, నవంబరు 30 రాశిఫలాలు

Daily Horoscope Today  30th November 2022: ఈ రాశివారు గందరగోళ దశలోకి ప్రవేశిస్తున్నారు, నవంబరు 30 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం, కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

Kaal Bhairav Astami 2022: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం,  కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?