Weekly Horoscope 12-18 September: ఈ రాశివారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటేనే సక్సెస్ అవుతారు, సెప్టెంబరు 12 నుంచి 18 వారఫలాలు
Weekly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Weekly Horoscope 12-18 September: సెప్టెంబరు 12 సోమవారం నుంచి సెప్టెంబరు 18 ఆదివారం వరకూ ఈ వారంలో మేష రాశి నుంచి కన్యా రాశివరకూ..మొదటి ఆరు రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం...
మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ వారం మేషరాశివారికి బాగానే ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగేస్తే సక్సెస్ అవుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఇదే మంచిసమయం. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఉద్యోగులు మీ పై అధికారులతో మర్యాదపూర్వకంగా వ్యవహించడం మంచిది.
వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈవారం మీరు ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు జోరందుకుంటాయి. వ్యాపారం గతంలో కన్నా బాగా సాగుతుంది. విద్యార్థులకు చదవుపై శ్రద్ధ పెరుగుతుంది. పారిశ్రామికవర్గాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబంలో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోండి.
Also Read: అక్టోబరు, నవంబరులో రెండు గ్రహణాలు - ఈ రాశులవారు చూడకూడదు!
మిథున రాశి (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈ వారం మిథున రాశివారికి పరిస్థితిలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం బాగా సాగుతుంది. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలనుకున్న వారి ప్రయత్నాలు వృధా అవుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది. బంధువుల నుంచి చిన్న చిన్న ఇబ్బందులుంటాయి.
కర్కాటక రాశి (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ వారం కర్కాటక రాశివారికి వ్యవహార జయం సిద్ధిస్తుంది. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. గృహయోగ సూచనలున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు మంచి సమయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. ఖర్చులు తగ్గించకపోతే ఇబ్బంది పడతారు. అనవసర భయం తగ్గించుకుని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ అవుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఇంటా బయటా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేయగలుగుతారు. సమయానికి డబ్బు చేతికందుతుంది..ఆర్థిక ఇబ్బంది అనే మాటే ఉండదు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. స్నేహితులతో వివాదం జరిగే సూచనలున్నాయి జాగ్రత్త. కాస్త ఓర్పుగా వ్యవహరించాలి..అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఎదురైన కొన్ని సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు..మీకు దైవబలం మెండుగా ఉంటుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వాహనయోగం ఉంది.ఉద్యోగులు, వ్యాపారులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఫ్యూచర్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు.
తులా రాశి నుంచి మీన రాశివరకూ ఈ వారం ఫలితాలు చూసుకునేందుకు కింద లింక్ క్లిక్ చేయండి...
Also Read: ఈ వారం మూడు రాశులవారికి అనుకూల ఫలితాలు, ఆ రాశివారికి ఊహించని సంఘటనలు