అన్వేషించండి

Solar Eclipse and Lunar Eclipse 2022: అక్టోబరు, నవంబరులో రెండు గ్రహణాలు - ఈ రాశులవారు చూడకూడదు!

అక్టోబరు 25 సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం..ఈ రెండు గ్రహణాలు పట్టు-విడుపు సమయం, ఏ రాశుల వారు చూడకూడదో ఇక్కడ తెలుసుకోండి..

Eclipses in India 2022: ఖగోళ, జోతిష్య శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు చాలా ప్రాధాన్యం ఉంది. గ్రహణాలను ప్రత్యక్షంగా చూసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. జోతిష్య శాస్త్రాన్ని పాటించే వారు గ్రహణాలను అరిష్టంగా పరిగణిస్తున్నారు. ఈ గ్రహణాలు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. రానున్న రెండు నెలల్లో మరో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వాటిలో ఒకటి సూర్య గ్రహణం, మరొకటి చంద్ర గ్రహణం. 

Also Read: సెప్టెంబరు 11 నుంచి పితృ పక్షాలు ప్రారంభం, అంటే ఏంటి - ఈ 15 రోజులు ఏం చేయాలి!

2022 అక్టోబరు 25  మంగళవారం సూర్య గ్రహణం 
శ్రీ శుభకృత్ నామసంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారం అక్టోబరు 25వ తేదీ స్వాతి నక్షత్రం రెండో పాదంలో కేతుగ్రస్త సూర్యగ్రహణం సాయంత్రం దాదాపు 5.03 నిముషాలకు ప్రారంభమవుతుంది.  
స్పర్శ కాలం సాయంత్రం - 5 గంటల 3 నిముషాలు
మధ్య కాలం సాయంత్రం - 5 గంటల 28 నిముషాలు
మోక్ష కాలం సాయంత్రం  - 5 గంటల 35 నిముషాలు
ఆద్యంత పుణ్యకాలం 32 నిముషాలు

ఈ గ్రహం స్వాతి నక్షత్రం తులా రాశిలో పడుతుంది. అందుకే చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల వారు  కన్య,తులా రాశివారు ఈ గ్రహం చూడరాదని చెప్పారు పండితులు. గ్రహణ కాలం 32 నిముషాలే కాబట్టి.. నియమాలు పాటించే గర్భిణి స్త్రీలకు పెద్దగా సమస్య ఉండదు.

Also Read: గడ్డిపై ప్రతీకారం తీర్చుకునేవాళ్లుంటారా ... కానీ చాణక్యుడి విజయం అక్కడి నుంచే మొదలైంది..

2022 నవంబరు 8 మంగళవారం చంద్రగ్రహణం
శ్రీ శుభకృత్ నామసంవత్సరం మార్గశిర శుద్ధ పూర్ణిమ నవంబరు 8 మంగళవారం భరణి నక్షత్రం మూడో పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పడుతుంది.
స్పర్శ కాలం మధ్యాహ్నం - 2 గంటల 38 నిముషాలు
మధ్య కాలం మధ్యాహ్నం - 4 గంటల 28 నిముషాలు
మోక్ష కాలం మధ్యాహ్నం -  6 గంటల 18 నిముషాలు
ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 40 నిముషాలు

ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర జాతకులు... మేష రాశివారు ఈ గ్రహణం చూడరాదు. చంద్రోదయం సాయంత్రం 5 గంటల 27 నిముషాలకు అవుతుంది. అందుకే విడుపు సమయంలో 51 నిముషాలు మాత్రమే ఈ గ్రహణం కన్పిస్తుంది. నియమాలు పాటించే గర్భిణి స్త్రీలు కూడా సాయంత్రం 5.27 నుంచి 6.18 వరకు కదలకుండా పడుకుంటే చాలు.

గ్రహణ సమయంలో చదువుకోవాల్సిన నవగ్రహ గాయత్రి
1.సూర్య గాయత్రి
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే 
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్

2.చంద్ర గాయత్రి
ఓం అమృతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహే
తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.

3.కుజ గాయత్రి
ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే
తన్నో: కుజః ప్రచోదయాత్.

4.బుధ గాయత్రి
ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహే 
తన్నో బుధః ప్రచోదయాత్

5.గురు గాయత్రి
ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహే 
తన్నో గురుః ప్రచోదయాత్

6.శుక్ర గాయత్రి
ఓం భృగువాస జాతాయ విద్మహే శ్వేతవాహనాయ ధీమహే
 తన్నో శుక్రః ప్రచోదయాత్

7.శని గాయత్రి
ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహే
 తన్నో శనిః ప్రచోదయాత్

8.రాహు గాయత్రి
ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పందాయ ధీమహే
తన్నో రాహుః ప్రచోదయాత్

9.కేతు గాయత్రి
ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహే
తన్నో కేతుః ప్రచోదయాత్

నవగ్రహ శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget