అన్వేషించండి

వారఫలాలు (జూన్ 12-18): ఈ వారం 3 రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, ఆ రాశులవారికి వ్యక్తిగత సమస్యలు!

Weekly Rasi Phalalu : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Weekly Horoscope 12- 18 June 2023:  ఈ వారం మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

మేష రాశి 

మేషరాశివారికి ఈవారం పనిభారం ఎక్కువగా ఉంటుంది. దానిని పూర్తి చేయడానికి అదనపు కృషి చేయవలసి ఉంటుంది. శారీరక, మానసిక అలసటకు గురవుతారు. మీ దినచర్య , ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారం ప్రారంభంలో స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ద్వితీయార్థం జాగ్రత్తగా ఉండకపోతే కొందరితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారులు లావాదేవీలు జరిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు పరీక్ష పోటీలో ఆశించిన విజయం సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది. మీరు ప్రేమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటే మీ ప్రేమ భాగస్వామి భావాలను విస్మరించడం మర్చిపోవద్దు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. హనుమాన్ ను ఆరాధించండి. 

వృషభ రాశి

ఈ రాశివారు అహంకారాన్ని, అనుమానాన్ని వీడితే సంతోషంగా ఉంటారు. వారం ప్రారంభంలో మీ మాట, ప్రవర్తనను నియంత్రించాల్సి ఉంటుంది. అనవసర చర్చర్లో పాల్గొనవద్దు, కోపానికి లోనుకావొద్దు. వారం ప్రారంభంలో, వృత్తి-వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి మరియు ఆశించిన ఫలితాలను అందిస్తాయి. కుటుంబ వ్యవహారాలపై దృష్టిసారించాలి లేదంటే వైవాహిక జీవితం దెబ్బతింటుంది. ఈ సమయంలో, భూ-ఆస్తి ఒప్పందం లేదా దానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.  ఉద్యోగస్తులు తమ  అవసరాల కోసం అదనపు ఆదాయ మార్గాలను కనుగొనవలసి ఉంటుంది. ప్రేమ సంబంధంలో జాగ్రత్తగా ముందుకు సాగండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. రోజూ లక్ష్మీ దేవిని ఆరాధించాలి..శ్రీ సూక్త పఠించండి.

Also Read: మీ తీరు ఎలా ఉంటుందో మీ రాశి చెప్పేస్తుంది!

మిథున రాశి 

మిథున రాశి వారు ఈ వారం తమ లక్ష్యం దిశగా సరైన ప్రయత్నం చేస్తే ఆశించిన విజయాన్ని అందుకుంటారు. పనిప్రాంతంలో మిమ్మల్ని మీరు మెరుగ్గా నిరూపించుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగులు తమ కింది ఉద్యోగులు, సీనియర్లు ఇద్దరినీ కలపడం మంచిది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి ఇతరుల ముందు మిమ్మల్ని మీరు గొప్పగా చెప్పుకునే ధోరణి మానుకోవాలి. కుటుంబంలో సోదరుడు లేదా సోదరితో ఏదో విషయంలో వివాదం ఉండవచ్చు. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి వివాదానికి బదులుగా చర్చలను ఆశ్రయించండి. వారం ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం మెరుగ్గా ఉంటుంది. అనుకున్నదానికన్నా ఎక్కువ ఖర్చవుతుంది. వ్యాపార పరంగా సమయం బాగుంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి.  వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.  ప్రతిరోజూ గణపతి చాలీసా పఠించండి.

కర్కాటక రాశి 

ఈ వారం అనుకున్న పనులను జాగ్రత్తగా పూర్తి అవగాహనతో పూర్తిచేయాలి లేదంటే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. తరచుగా మీ పనిని చెడగొట్టే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో మీ ద్వారా తమ పనిని నిరూపించుకోవడానికి ప్రయత్నించే వ్యక్తుల నుంచి మీరు సరైన దూరం పాటించాలి. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ మొదలైనవాటిలో డబ్బును పెట్టుబడి పెట్టడం మానుకోండి. వారం మధ్యలో పిల్లలకు సంబంధించిన ఏదైనా ఆందోళన ఎదురవుతుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు..ఆ ప్రయాణం కూడా ఆశించినదానికన్నా తక్కువ ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలు వారం ద్వితీయార్ధంలో ఇల్లు మరియు పని మధ్య సమతుల్యతను సాధించడం కష్టం. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మామూలుగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.శివాలయాన్ని సందర్శించండి. 

సింహ రాశి

వృత్తి-వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది, కానీ వ్యక్తిగత సంబంధాలలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. వారం ప్రారంభంలో ఈ రాశి ఉద్యోగులు మీ కార్యాలయంలో శుభవార్తలు వింటారు. పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ కోసం నిరీక్షణ తీరవచ్చు. వృత్తి , వ్యాపారంలో ముందుకు సాగడానికి మీరు అతిపెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా మరేదైనా చోట పెట్టుబడి పెట్టేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవాలి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే డబ్బు లావాదేవీల్లో పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ వారం స్త్రీలకు ఎక్కువ సమయం ఆరాధనతో గడుపుతారు. వారం మధ్యలో కుటుంబానికి సంబంధించిన వారికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. మీరు ప్రేమ సంబంధంలో ఉంటే ప్రేమ వ్యవహారాన్ని వివాహంగా మార్చడానికి మీరు మీ కుటుంబం నుంచి అనుమతి పొందవచ్చు. అదే సమయంలో, వివాహిత వ్యక్తుల జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

Also Read: యోగినీ ఏకాదశి విశిష్ఠత ఏంటి - ఈ రోజు ఏం చేయాలి!
కన్యారాశి 

ఈ వారం ఈ రాశివారికి కుటుంబానికి సంబంధించిన చిన్నచిన్న సమస్యలను విస్మరిస్తే అంతా బాగానే ఉంది.  వృత్తి-వ్యాపారంలో అద్భుతమైన పురోగతిని చూస్తారు. ఈ సమయంలో మీరు మీ శ్రేయోభిలాషుల పూర్తి మద్దతు  పొందుతారు. ఈ వారం మీరు మీ మాట, ప్రవర్తన ద్వారా చాలామంది హృదయాలను గెలుచుకోగలుగుతారు. వ్యాపార పరంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా పని లేదా  ఒప్పందాలలో రిస్క్ తీసుకుంటారు  దానిలో ప్రయోజనం పొందుతారు. ఈ వారం అంతటా మీకు డబ్బు ప్రవాహం కొనసాగుతుంది. వారం ద్వితీయార్ధంలో మీరు భూమిని కొనుగోలు చేయవచ్చు  అమ్మవచ్చు.  ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది . వారం ద్వితీయార్థంలో పిల్లల వైపు నుంచి శుభవార్త అందుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.  గణపతి అథర్వశిర్ష పఠించండి.

తులా రాశి 

ఈ రాశివారు ఈ వారం తమ పనిలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా పెద్ద తప్పు చేయకుండా ఉండవలసి ఉంటుంది, లేకపోతే వారు దాని కోసం పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ పనిని వేరేవారికి అప్పగించవద్దు. అస్సలు అజాగ్రత్తగా ఉండకండి లేకపోతే మీరు మీ బాస్ కోపానికి బలైపోవాల్సి వస్తుంది. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం తులా రాశి వారు వేగంగా డబ్బు పొందుతారు కానీ అదే వేగంతో ఖర్చు చేస్తారు. యువకులు ఈ వారంలో ఎక్కువ భాగం స్నేహితులతో సరదాగా గడుపుతారు. ప్రేమ బంధంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా మహిళా స్నేహితురాలి సహాయంతో వాటిని అధిగమించగలుగుతారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మీరు మీ బిజీ షెడ్యూల్ నుంచి మీ జీవిత భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించాలి. మీ దినచర్య ఆహారంలో చాలా జాగ్రత్త వహించండి. దుర్గాదేవిని ఎర్రని పువ్వులతో పూజించండి. 

వృశ్చిక రాశి 
ఈ రాశివారు ఈ వారం జాగ్రత్తగా  ముందుకు సాగాలి. మీరు అనుకున్న పనిలో ఆశించిన విజయాన్ని పొందలేరు, అనవసరమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వారం ప్రారంభంలో పనిప్రాంతంలో చాలా పనిభారం ఉంటుంది..శారీరక , మానసిక అలసటను కలిగిస్తుంది. ఆ ప్రభావం మీ మాట, ప్రవర్తనపై పడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఆచరణాత్మకంగా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోలేరు. ఈ సమయంలో, మీ ప్రియమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను ఏ విధంగానూ నొప్పించకండి ఎందుకంటే వారే మీ నిజమైన బలం. వ్యాపారులు మార్కెట్లో తమ విశ్వసనీయతను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ప్రేమ బంధంలో ఏ విషయంలోనూ తొందరపడటం తగదు. ప్రతిరోజూ సుందరకండ్ పఠించండి.

ధనుస్సు రాశి 

ఈ రాశివారి వ్యక్తిగత జీవితం ఈ వారం  కొన్ని సమస్యలతో నిండి ఉంటుంది..ఈ కారణంగా కొంత కలత చెందుతారు.  వృత్తి-వ్యాపారాలలో అదృష్టం కలిసొస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ వారం మీరు మీ కుటుంబంలో సంతోషాన్ని నింపేందుక ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల మాటవిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. వారం మధ్యలో, వృత్తి-వ్యాపార పర్యటనలు మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తాయి. ఈ సమయంలో మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మనోభావాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. ప్రతిరోజూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించండి.

Also Read: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

మకర రాశి 

మకర రాశి వారికి ఈ వారం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలు ఈ వారం చాలావరకు పరిష్కారమవుతాయి.  ఉద్యోగులు అదనపు బాధ్యతలు పొందుతారు అయితే  మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీరు మరింత కష్టపడాలి.  ఆదాయంతో పోలిస్తే ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అదికపని వల్ల ఒత్తిడికి గురవుతారు.  సహోద్యోగితో లేదా కుటుంబంలో బంధువుతో విభేదాలు ఉండవచ్చు. ఆ గందరగోళం నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే మీ పనులు అంత త్వరగా పూర్తవుతాయి.  ప్రేమ సంబంధంలో జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రతిరోజూ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి.

కుంభ రాశి

ఈ రాశివారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది.  మీ ఆలోచనా కార్యాలు సకాలంలో పూర్తవుతాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటలు  ప్రవర్తన ద్వారా మీ పనిని పూర్తి చేయగలుగుతారు. వారం ప్రారంభంలో ఏదైనా శుభ, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. చాలా కాలం తర్వాత ప్రియమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా విదేశాల్లో  వృత్తి లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే సానుకూల ఫలితాలను అందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు శుభవార్త అందుతుంది. వారం ద్వితీయార్థంలో భూ నిర్మాణం లేదా పూర్వీకుల ఆస్తుల సేకరణలో అడ్డంకులు తొలగుతాయి. కుటుంబంతో ఆనందంగా గడపడానికి  సమయం అనుకూలిస్తుంది.  ప్రతిరోజూ శ్రీకృష్ణుడికి అటుకులు సమర్పించాలి.

మీన రాశి 

ఈ వారం ఈ రాశివారు డబ్బు , సమయం రెండింటినీ చక్కగా నిర్వహించడం ద్వారా ముందుకు సాగాలి. మీరు మీ జీవితంలో అన్ని రకాల సవాళ్లను సులభంగా ఎదుర్కోగలుగుతారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మానసికంగానే కాకుండా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారం ప్రారంభంలో, మీరు ఆకస్మిక ఇంటి మరమ్మతులు లేదా మరేదైనా అవసరానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుడి  రోగ్యం కూడా మీకు ఆందోళనకు ప్రధాన కారణం అవుతుంది. మీరు జీవనోపాధి కోసం చూస్తున్నట్లయితే మరికొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది.  మీ వ్యాపారాన్ని బాగా నడపడానికి ఎక్కువ సమయం తీసుకోవాలి ,డబ్బుకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వారం మీరు ఒక ప్రణాళికలో ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఈ వారం మీరు ఆర్థికంగానే కాకుండా శారీరకంగా కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. క్లిష్ట సమయాల్లో జీవిత భాగస్వామి మీకు నీడలా ఉంటారు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget