News
News
వీడియోలు ఆటలు
X

Weekly Horoscope (10-16 April):ఈ వారం ఈ రాశివారికి శుభప్రదం - కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది

Weekly Rasi Phalalu ( April 10 to 16) : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Weekly Horoscope ( April 10 to16):  ఈ ఆరు రాశులవారికి అద్భుతంగా ఉంది..ఇందులో మీ రాశి ఉందా ..

మిథున రాశి

ఈ వారం మిథున రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. వారం మొదటి అర్థభాగంలో మీ పెద్ద కోరిక ఏదైనా నెరవేరుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులుకు సీనియర్లు, జూనియర్ల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారులు వారం ప్రారంభంలోనే లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..ఆదాయం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా  భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగంలో పురోభివృద్ది వల్ల కార్యాలయంతో పాటూ ఇంట్లోనూ గౌరవం పెరుగుతుంది. గతంలో  ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. ప్రేమ సంబంధాలు గాఢంగా ఉంటాయి. మీరు ఈ వారం మీ ప్రేమ భాగస్వామితో మెరుగైన సమన్వయాన్ని చూస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి అదృష్టం కలిసొస్తుంది. ఈ వారం మీరు మీ కెరీర్-వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. మీరు మీ ప్రమోషన్ కోసం లేదా మీరు కోరుకున్న స్థలంలో బదిలీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంటే..అది ముగుస్తుంది. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్‌తో పాటు ముఖ్యమైన బాధ్యతను పొందుతారు.  ఈ వారం మీరు మీ సహోద్యోగులు, మంచి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతును పొందుతారు. మీరు ప్రయత్నించే రంగంలో మీ కోరిక మేరకు విజయం సాధించే అన్ని అవకాశాలు ఉన్నాయి. వారం రెండో భాగంలో మీరు ఎక్కడి నుంచైనా అకస్మాత్తుగా  ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. భూములు, భవనాలు కొనాలన్న కోరిక నెరవేరుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు పెళ్లివరకూ వెళతాయి.  మీరు మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను గడిపే అవకాశాలను పొందుతారు.

Also Read: ఈ వారం ఈ రాశివారు డబ్బు-సమయం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ వారం అనుకున్న కోర్కెలు నెరవేరుతాయి. వారం ప్రారంభంలో వృత్తి-వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా, ఫలవంతంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఉపాధి కోసం చూస్తున్నట్లయితే, ఈ వారం మీకు గొప్ప అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు కావాలన్న మీ కల నెరవేరుతుంది. వ్యాపారాన్ని విస్తరించి ఆశించిన లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది... ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వారం రెండో  భాగంలో మీ మనస్సు సామాజిక-ధార్మిక పనులలో బిజీగా ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా తీర్థయాత్రకు వెళ్లే అవకాం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో తలెత్తే అపార్థాలు తొలగిపోయి ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లల వైపుకు సంబంధించిన ఏదైనా పెద్ద విజయం మీ కుటుంబం  ఆనందానికి పెద్ద కారణం అవుతుంది.

తులా రాశి

తులా రాశి వ్యాపారులు ఈ వారం లాభాలు పొందుతారు. ఈ వారం మీకు వచ్చే లాభం నష్టంగా మారకుండా ఉండాలంటే, మీరు మీ తెలివితేటలను,  విచక్షణను పూర్తిగా ఉపయోగించుకోవాలి. మరియు మీ లక్ష్యం నుంచి మిమ్మల్ని మరల్చడానికి తరచుగా ప్రయత్నించే వ్యక్తుల నుంచి సరైన దూరం పాటించాలి. ఈ వారం ఒకరి ప్రభావంతో లేదా తొందరపడి కెరీర్-వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండండి లేదంటే మీరు నష్టపోతారు. పెట్టుబడులు పెట్టేముందు మరోసారి ఆలోచించడం మంచిది. వారం ద్వితీయార్థంలో దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రయాణంలో మీ ఆరోగ్యం, వస్తువులు రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆలోచనల నిండా ఆధ్యాత్మిక భావనలు నిండిఉంటాయి. ప్రేమ సంబంధాల విషయంలో  ఈ వారం సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Also Read: ఏప్రిల్ 9 రాశిఫలాలు, ఈ రాశివారికి రహస్య విషయాలపై అధ్యయనం చేయాలనే ఆసక్తి పెరుగుతుంది

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదం.  ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో, మీరు గత కొన్ని నెలలుగా మీ ఆందోళనకు ప్రధాన కారణమైన పెద్ద సమస్యకు పరిష్కారాన్ని కనుగొనగలరు. ఈ వారం మీరు మీ రంగంలో లేదా వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా పని చేస్తే, మీరు ఆశించిన విజయాన్ని పొందవచ్చు. ఉద్యోగస్తులు కార్యాలయంలో సీనియర్ ,జూనియర్ ఇద్దరినీ కలిపేందుకు ప్రయత్నిస్తారు. ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను నిర్వహించడంలో స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. ఈ వారంలో మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే సంబంధిత రంగంలో అనుభవజ్ఞుల నుంచి సలహా తీసుకోవడం మంచిది. పొరపాటున కూడా ఉద్వేగానికి లోనుకావొద్దు..మాట విసరొద్దు.  ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి, సానుకూల ఆలోచనను కొనసాగించండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ధనుస్సు రాశి 

ఈ వారం ఈ రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. వారం ప్రారంభం నుంచీ మీరు అనుకున్న పనులు పూర్తి అయ్యేలా చూస్తారు. దానివల్ల మీలో అద్భుతమైన ఉత్సాహం, శక్తి కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీ అన్ని పనులను పూర్తిచేయాలని ప్రయత్నిస్తారు...మీరు ఆహ్లాదకర ఫలితాలను పొందుతారు. వారం మధ్యలో మీరు కెరీర్-వ్యాపారానికి సంబంధించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  రోజంతా బిజీగా ఉంటారు. వారం రెండో భాగంలో ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఉంటుంది. భవిష్యత్తులో లాభదాయకమైన పథకాలలో చేరడానికి అవకాశం ఉంటుంది. వారం చివరిలో ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ప్రేమ సంబంధాలు గాఢంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది.

కుంభ రాశి

 

కుంభ రాశివారికి ఈ వారం బావుంటుంది. వారం ప్రారంభంలో, మీరు వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు. దీని వలన మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఉద్యోగస్తులైతే మీరు పదోన్నతి పొందవచ్చు , వ్యాపారవేత్త అయితే మీరు మీ వ్యాపారంలో చాలా లాభాలను పొందుతారు.  మార్కెట్‌లో బూమ్‌ను సద్వినియోగం చేసుకోగలరు.ఈ వారం చివరి నాటికి, మీరు భూమి-భవనాల అమ్మకం, కొనుగోలు లేదా పూర్వీకుల ఆస్తి కొనుగోలు నుంచి పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. పిల్లల పక్షాన విజయంతో మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో తీవ్రత ఉంటుంది. ఈ వారం మీరు మీ ప్రేమ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశాలను పొందుతారు. మొత్తంమీద, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు.

Published at : 09 Apr 2023 06:11 AM (IST) Tags: gemini weekly horoscope astrology predictions in telugu weekly predictions zodiac signs in telugu Every Zodiac Sign's Weekly horoscope 03 April to 09 april rashifalalu Weekly Horoscope 10 April to 16 April

సంబంధిత కథనాలు

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

టాప్ స్టోరీస్

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Telangana Politics : తెలంగాణలో ముఖాముఖి పోరుకు కాంగ్రెస్ వ్యూహం - బీజేపీని ఎలిమినేట్ చేయగలదా ?

Telangana Politics :  తెలంగాణలో ముఖాముఖి పోరుకు కాంగ్రెస్ వ్యూహం -  బీజేపీని ఎలిమినేట్ చేయగలదా ?