Venus Retrograde: వక్రంలో శుక్రుడు, ప్రేమ బంధాలపై తీవ్ర ప్రభావం! మీ రాశిపై ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి
Venuss Influence on Love Life: శుక్రుడు తిరోగమనంలో ఉంటే ప్రేమ, అందం, వైవాహిక జీవితం, భౌతిక సుఖాలపై ప్రభావం చూపుతుంది. మరి మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉందో ఇక్కడ తెలుసుకోండి

Venus Retrograde: శుక్రుడు తిరోగమనంలో సంచరించినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని ప్రేమ, సౌందర్యం, భౌతిక సుఖాలు, వైవాహిక జీవితం , ఆకర్షణకు కారకంగా భావిస్తారు. శుక్రుడు వక్రించినప్పుడు అది నేరుగా వ్యక్తి యొక్క సంబంధాలు, ప్రేమ జీవితం , భావోద్వేగ బంధంపై ప్రభావం చూపుతుంది. శుక్రుడు వక్రించినప్పుడు, అది సంబంధాలలో దూరాన్ని పెంచుతుందా లేదా సాన్నిహిత్యాన్ని పెంచుతుందా? తెలుసుకుందాం.
శుక్రుడు వక్రించడం అంటే గ్రహం తిరోగమనంలో కదులుతోందని అర్థం. ఖగోళ శాస్త్రంలో ఇది ఒక భ్రమణం మాత్రమే కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
సంబంధాలపై శుక్రుడి వక్రత్వం యొక్క ప్రభావం ఏంటి?
పాత సంబంధాలు తిరిగి రావచ్చు
శుక్రుడు తిరోగమనంలో ఉన్నప్పుడు గత ప్రేమ లేదా అసంపూర్ణ సంబంధాలు మళ్లీ కలుసుకోవచ్చు. ఇది వ్యక్తి జీవితంలో పాత ప్రేమ తిరిగి వచ్చే సమయం.
తప్పుడు అవగాహనలు పెరగడం
శుక్రుడు తిరోగమనంలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ అహంకారాన్ని పక్కన పెట్టి, సహనంతో భాగస్వామితో మాట్లాడండి.
భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు
కొన్ని రాశులవారికి శుక్రుడు తిరోగమనంలో ఉన్నప్పుడు వారి సంబంధాలలో స్తబ్దత ఉండవచ్చు. ఈ సమయంలో భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి.
బలమైన సంబంధాలు మరింత లోతుగా మారతాయి
బలమైన సంబంధాలు ఉన్నవారికి ఇది స్వీయ విశ్లేషణ , సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక ముఖ్యమైన సమయం.
శుక్రుడి వక్రత్వం ఏ రాశిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?
శుక్ర గ్రహానికి తులా , వృషభ రాశులవారి సంబంధాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ సమంలో వీరు వ్యక్తిగతజీవితం, ప్రేమ జీవితంలో జాగ్రత్తగా వ్యవహించాలి,అనవసర వివాదాల జోలికి పోరాదు. మాటపట్టింపులు పెట్టుకోవద్దు. ప్రేమ భాగస్వామి, జీవితభాగస్వామితో అనవసర చర్చలు పెట్టుకోవద్దు.
కర్కాటక రాశి, మకర రాశి, మీనరాశివారికి గత సంబంధాల జ్ఞాపకాల్లో మునిగితేలుతారు
శుక్రుడు తిరోగమనంలో ఉన్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
మీ సంబంధాలలో కమ్యూనికేషన్ కొనసాగించండి..చిన్న చిన్న మనస్పర్థలకు అవకాశం ఇవ్వొద్దు
ప్రేమలో పారదర్శకత ఉండాలి...మోసం చేయాలనే ఆలోచన కూడా రానివ్వకండి
సంబంధాలలో పాత సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.
శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించండి. దీనితో పాటు సుగంధ పుష్పాలను సమర్పించండి.
శుక్రుడి వక్రత్వం సంబంధాలకు ఒక ముఖ్యమైన సమయం. ఇది దూరాన్ని పెంచగలదు, సాన్నిహిత్యాన్ని తీసుకురాగలదు. ఇది మీ సంబంధాన్ని మీరు ఎలా నిర్వహిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రేమలో పరిపక్వత, భాగస్వామ్యం రెండూ సంబంధాలను విజయవంతం చేస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు...ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మహాభారతం ప్రకారం విజయం, సంతోషం కోసం నిత్యం ఈ నాలుగు పాటించాలి.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి





















