(Source: ECI/ABP News/ABP Majha)
Vastu Tips In Telugu: మీ రాశిప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశగా ఉంటే మంచిది!
వాస్తు శాస్త్రం ప్రకారం సాధారణంగా మీ ఇంటి తలుపును ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే వాస్తు శాస్త్రంలో వివిధ రాశుల ప్రకారం ఇంటి ప్రధాన తలుపును ఉంచాలని కూడా సూచించారు.
Vastu Tips In Telugu: ఇంటి యజమాని రాశిని బట్టి ఇంటి ముఖద్వారం వల్ల కలిగే శుభ, అశుభ ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు కూడా ఒక్కోసారి కలిసి రాకుండా పోతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కలలు కని నిర్మించుకున్న సొంత ఇల్లు కొన్ని సార్లు ఆ ఇంటిలోని వారికి నష్టాన్ని కలుగజేస్తుంది. ఎన్నో పూజలు శాంతులు, హోమాలు జరిపించినా పరిస్థితులు చక్కబడక చాలామంది నిరాశకు గురౌతుంటారు. గతంలో పడిన ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందాలనే ఆశతో కొత్తింట్లో అడుగుపెట్టాక కొన్ని ఇబ్బందులు వెంటాడుతుంటాయి. ఇంటి లోపల వాస్తు బాగానే ఉందనుకోవడం కాదు సింహద్వారం ఎలా ఉందో చూసుకోవాలి. అయితే మీ రాశిని బట్టి మీ ఇంటి సింహద్వారం ఏ దిశగా ఉండాల చెబుతారు పండితులు
Also Read: జూన్ 17 వటసావిత్రీ వ్రతం, పెళ్లైన వారికి చాలా ముఖ్యం!
మీ రాశి ప్రకారం ఏ దిక్కు ద్వారం మంచిది
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మేషరాశివారికి తూర్పు ద్వారం ఉన్న ఇల్లు కలిసొస్తుందని చెబుతారు వాస్తునిపుణులు.
వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
వృషభ రాశివారికి దక్షిణ ద్వారం శుభఫలితాలనిస్తుంది
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మిథునరాశివారికి పశ్చిమ ద్వారం ఉన్న ఇల్లు సానుకూల ఫలితాలనిస్తుంది
కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
కర్కాటక రాశివారికి ఉత్తర ద్వారం కలిసొస్తుంది
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
సింహ రాశివారికి తూర్పు ద్వారం ఉన్న ఇల్లు కలిసొస్తుందని చెబుతారు వాస్తునిపుణులు.
కన్యా రాశి (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
కన్యారాశివారికి పశ్చిమ ముఖంగా ఉన్న ఇంట్లో ఉంటే మంచి ఫలితాలొస్తాయి
తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
తులా రాశివారికి దక్షిణ ద్వారం ఉన్న ఇల్లు కలిసొస్తుందటారు నిపుణులు.
వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
వృశ్చిక రాశివారికి ఉత్తర ద్వారం బాగా కలిసొస్తుందట.
Also Read: 4 నెలల పాటూ ఈ రాశులవారికి అత్యద్భుతంగా ఉంది!
ధనుస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ధనస్సు రాశివారికి తూర్పు ద్వారం ఉన్న ఇల్లు బావుంటుందని వాస్తునిపుణులు చెబుతారు
మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మకర రాశివారికి దక్షిణ దిశగా ఉండే ఇల్లు కలిసొస్తుందంటారు
కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కుంభరాశివారికి పశ్చిమ ముఖంగా ఉన్న ఇంట్లో ఉంటే మంచి ఫలితాలొస్తాయి
మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
మీన రాశివారికి ఉత్తర ద్వారం బాగా కలిసొస్తుందట.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ నక్షత్రాన్ని బట్టి కూడా ఇంటి ప్రవేశ ద్వారం ఏ దిశగా ఉండాలన్నది మారుతుంది. ఇవి కేవలం రాశుల ఆధారంగా చెప్పినవి మాత్రమే. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.