Horoscope Today: నేటి రాశిఫలాలు (04-05-2024)
Daily Horoscope: మే 4 శనివారం ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...
Daily Horoscope
మేష రాశి
మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ఓపికగా ఉంటే మంచి లాభాలు వస్తాయి. కొన్నాళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు.
వృషభ రాశి
ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో అశాంతి తొలగిపోతుంది. పిల్లలకు సంబంధించి కొన్ని ఆందోళనలు ఉంటాయి. ఉన్నత విద్యకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి..వాటిని సద్వినియోగం చేసుకుంటారు.
Also Read: దేశ ఆర్థిక స్థితి ఈ మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది - చాణక్య నీతి
మిథున రాశి
మీ మాటలతో ఆకర్షిస్తారు. అనవసర ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. హృద్రోగులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంచి ఆహారం తీసుకోండి.
కర్కాటక రాశి
ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కొందరు వ్యక్తులు మీ లక్ష్యాల నుంచి మిమ్మల్ని మరల్చడానికి ప్రయత్నించవచ్చు. మానసిక స్థితి కొద్దిగా కలత చెందుతుంది. ఈ రోజు ఎక్కువ దూరం ప్రయాణించకపోవడమే మంచిది.
సింహ రాశి
ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. అందరకీ మీరు విశ్వాసపాత్రులుగా ఉంటారు. వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ప్రణాళిక ప్రకారం అనుకున్న పనులను పూర్తిచేసేందుకు ప్రయత్నించండి.
Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !
కన్యా రాశి
విలాసవంతమైన జీవన శైలి ఉంటుంది. మీ వాగ్ధాటికి ప్రజలు ఆకర్షితులవుతారు..కానీ..అబద్ధాలు చెప్పకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తులా రాశి
మీ జీవితంలో ఇతరుల జోక్యం ఉండనివ్వకండి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మీరు ముందుగా తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవలసి రావచ్చు
వృశ్చిక రాశి
మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుంది. కార్యాలయంలో మీ ఎంపిక ప్రకారం మీ పని ఉండదు. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ తగ్గుతుంది. చెడు సహవాసాలు మీ ప్రతిష్టను తగ్గిస్తాయి.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు కొన్ని చట్టపరమైన విషయాల గురించి ఆందోళన చెందుతారు. స్నేహితులతో పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకుంటారు. కార్యాలయ పనిపై బయటకు వెళ్లావ్సి రావొచ్చు.
Also Read: రోజుని ఇలా ప్లాన్ చేసుకోండి.. మీ ఎదుగుదలని ఎవరు ఆపుతారో చూద్దాం - చాణక్య నీతి!
మకర రాశి
ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. మిమ్మల్ని చూసి అసూయపడేవారి సంఖ్య పెరుగుతుంది. మీ బలహీనతను బయటపెట్టొద్దు. కుటుంబ సభ్యుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. అనవసర పనులకు దూరం పాటించండి.
కుంభ రాశి
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్న అడ్డంకుల తొలగిపోతాయి. రహస్య విషయాలపై అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉంటుంది. కష్టపడి పనిచేసినప్పుడే అర్థవంతమైన ఫలితాలు వస్తాయని గుర్తించాలి. ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందవచ్చు. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ భావన పెరుగుతుంది
Also Read: మీలో అత్యంత మంచి లక్షణం ఏంటో మీకు తెలుసా!
మీన రాశి
పనిలో అసమతుల్యత ఉంటుంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.