చాణక్య నీతి: ఈ 9 రహస్యంగా ఉంచాలి

అన్ని విషయాలు అందరితో చెప్పేసుకోవడం కాదు కొన్ని విషయాలు షేర్ చేసుకోకూడదంటాడు చాణక్యుడు

ఎవ్వరితోనూ చెప్పొద్దు అనే లిస్టులో ముఖ్యంగా 9 చేర్చాడు ఆచార్య చాణక్యుడు

వయసు - మీ వయసెంతో చెప్పాల్సిన అవసరం లేదు

ధనం - మీ సంపాదన, మీ దాచిన డబ్బు గురించి చెప్పొద్దు

ఇంటిగుట్టు - ఇంటి వ్యవహారాలు నాలుగు గోడల మధ్య ఉండడమే మంచిది

మంత్రం - కొన్ని ఉపదేశ మంత్రాలుంటాయి..అవి ఎవ్వరికీ చెప్పకూడదు

మీరు సేవించే ఔషధం - అనారోగ్యానికి మీరు వేసుకునే మందుల గురించి చెప్పొద్దు

శృంగారం - ఇది పూర్తిగా మీకు-మీ భాగస్వామికి సంబంధించిన విషయం మాత్రమే

దానం - కుడి చేత్తో చేసిన దానం ఎడమచేతికి కూడా తెలియకూడదు

మానం - శరీరాన్ని బహిర్గతం చేస్తూ దుస్తులు ధరించరాదు

అవమానాలు - మీరు ఎదుర్కొన్న అవామానాలను ఎప్పుడూ బయటపెట్టొద్దు