Today Horoscope In Telugu: జూలై 20 రాశిఫలాలు - ఈ రాశివారి పురోగతికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి..సద్వినియోగం చేసుకోవడం మంచిది!
Horoscope Prediction 20th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for july 20th 2024
మేష రాశి
మీ సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి. అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దు. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి
వృషభ రాశి
మీ పురోగతికి అద్భుతమైన అవకాశాలొస్తాయి. ఈ అవకాశాలను ఉపయోగించుకోండి. ప్రతిష్టాత్మక వ్యక్తులతో మీ పరిచయాలు పెరుగుతాయి. దిగుమతి-ఎగుమతి సంబంధిత వ్యాపారంలో మెరుగైన ఫలితాలుంటాయి. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మిథున రాశి
మీ సహోద్యోగులతో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. కార్యాలయంలో ఇతరులు చేసిన తప్పులకు మీరు మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. ఈ రోజు పెద్దల నుంచి మార్గదర్శకత్వం తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు తిరిగి ప్రారంభించాల్సిన సమయం ఇది.
Also Read: ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు.. కూరగాయలతో అమ్మవారిని ఎందుకు అలంకరిస్తారు!
కర్కాటక రాశి
సన్నిహితులతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో కొత్త స్నేహితులు ఏర్పడతారు. వ్యాపారంలో మార్పులుంటాయి. వైవాహిక జీవితం బావుంటుంది.
సింహ రాశి
వాస్తవాలు తెలుసుకోకుండా మీ అభిప్రాయాలను వ్యక్తం చేయకండి. శత్రువులు పొంచి ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి చేతిలో డబ్బు లేకపోవడంతో ఆందోళన చెందుతారు. గుండె సంబంధిత సమస్యలున్నవారు అనవసర ఒత్తిడికి దూరంగా ఉండాలి. మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు. మీ పనితీరు మెరుగుపడుతుంది.
కన్యా రాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభదినం. కుటుంబ బాధ్యతలను విస్మరించవద్దు. ఈ రోజు వ్యాపారంలో ఊహించని లాభం పొందుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది.
Also Read: పురాణాల్లో ఉపాధ్యాయ దినోత్సవం..గురుపౌర్ణమి ( జూలై 21) విశిష్టత ఇదే!
తులా రాశి
ఈ రాశివారు ఏ విషయాల్లోనూ అజాగ్రత్తగా ఉండొద్దు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం వల్ల విభేదాలొస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలోని వ్యక్తుల ప్రవర్తన మీకు అనుకూలంగా ఉండదు . వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేసుకోవాలి
వృశ్చిక రాశి
ఈ రాశివారికి కుటుంబంలో సంతోషం ఉంటుంది. కమీషన్ సంబంధిత పనుల్లో లాభం ఉండదు. మీ ప్రియమైన వారి మాటల వల్ల మీరు చాలా నష్టపోతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితులతో ఆనందంగా ఉంటారు.
ధనస్సు రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు పనితీరులో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో అసంతృప్తి వెంటాడుతుంది. భవిష్యత్ గురించి భయపడతారు. ఉహించని విధంగా ఆస్తినష్టం ఉండొచ్చు. భూమి, ఆస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
Also Read: చాతుర్మాస్య దీక్ష మొదలైంది..ఈ నాలుగు నెలలు పాటించాల్సిన నియమాలేంటి!
మకర రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. సాంకేతికతకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తిచేస్తారు. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది
కుంభ రాశి
ఈ రాశివారి ఆలోచనలు చాలా సృజనాత్మకంగా ఉంటాయి. వృత్తి , ఉద్యోగాలలో కొత్త ఆలోచనల ద్వారా ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతారు. స్నేహితుల కోసం ఖర్చు చేస్తారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో ఉండేవారు సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
మీన రాశి
మీన రాశివారికి కలిసొచ్చే సమయం ఇది. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలి అనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మీ మాటతీరు ఆకర్షణీయంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి.. చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేయాలి - ఈ దీక్ష ఎన్ని రకాలు!