అన్వేషించండి

Today Horoscope In Telugu - జులై 13 రాశి ఫలాలు: ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభం, కానీ వాటితో జాగ్రత్త

Horoscope Prediction 13th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for july 13th 2024: 

మేషం

ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.

వృషభం

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

మిథునం

ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రామాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయ్యడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్న లోపం లేకపోయినా ఫలితం ఉండదు.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన విషయంలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

సింహం

ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల ఉంటాయి.

కన్య

ఈరోజు ఈ రాశి వారికి భూ సంబంధిత వ్యవహారాలలో లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి అకస్మిక ధన లాభం పొందుతారు. సంఘంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి  చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

తుల

ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్యర్యం కలిగిస్తుంది.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. గృహమున చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి.

ధనస్సు

ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మకరం

ఈ రాశి వారికి ఈరోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.

కుంభం

ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. దూరపు బంధువులతో స్వల్ప విబేధాలు ఉంటాయి.

మీనం

ఈరాశి వారికి ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో పదొన్నతులు వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు, వాహన లాభాలు పొందుతారు.

Note: ఒక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయం గురించి ఈ విషయాలు తెలుసా? 1813లో ఏం జరిగింది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget