Today Horoscope In Telugu: ఏప్రిల్ 4 రాశి ఫలాలు - ఆ రాశి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది
Horoscope Prediction 4th April 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for April 4th 2024:
మేష రాశి
ఈ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
వృషభ రాశి
ఈరోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో కలిసిరాదు. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ అయ్యే చాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి పాత అప్పుల బాధలు తీరతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తికరమైన వాతావరణం నెలకొంటుంది. మానసిక ఉల్లాసం ఉంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధు మిత్రులతో ఉన్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పై అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది.
సింహ రాశి
ఈ రాశి వారు ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
కన్య రాశి
ఈ రాశి వారికి ఇవాళ ఈ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పనులలో జాప్యం వల్ల నిరాశకు లోనవుతారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
తులా రాశి
ఈ రాశి వారికి ఇవాళ చేపట్టిన పనులలో విజయం చేకూరుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలలో సంతృప్తికరమైన వాతావరణం నెలకొంటుంది. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఇవాళ ఆర్థికపరమైన విషయాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు కోనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే సూచనలున్నాయి.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలలో నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. బంధు మిత్రులతో విబేధాలు కలిగే సూచనలున్నాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో నష్టపోయే అవకాశం ఉంది.
మకర రాశి
ఈరాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. నూతన వస్త్ర, ఆభరణాలు కొనే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల సపోర్టు లభిస్తుంది.
కుంభ రాశి
ఈరోజు ఈ రాశి వారు తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. అకస్మిక ధన ప్రాప్తి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి
ఈరాశి వారికి ఈరోజు దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదాలు వస్తాయి. ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది.
Note: ఒక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
ALSO READ: భద్రాద్రి రామయ్య భక్తులకు గుడ్ న్యూస్ - ఇలా చేస్తే మీ ఇంటికే రాములోరి కల్యాణ తలంబ్రాలు