అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Today Horoscope In Telugu: ఏప్రిల్‌ 11 రాశి ఫలాలు - ఆ రాశివారికి నూతన వాహన యోగం - మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి

Horoscope Prediction 11th April 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for April 11th 2024: 

మేష రాశి

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు.

వృషభ రాశి

ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ది కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మిథున రాశి

ఈ రోజు ఈ రాశి వారు వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో శుభకార్యాలు గురించి చర్చిస్తారు. అకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అశాజనకంగా సాగుతాయి. దూరప్రాంత బంధుమిత్రుల నుంచి ఆనందకరమైన సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఈరోజు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. ఆనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

సింహ రాశి

ఈ రాశి వారికి ఈరోజు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంత వరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.

కన్య రాశి

ఈ రాశి వారికి ఇవాళ  నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సబ్యుల నుంచి శుభవార్తలు వింటారు. అవసరానికి మిత్రుల ఆర్థిక సహాయం చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.

తులా రాశి

ఈ రాశి వారికి ఇవాళ సోదరుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ద చెయ్యడం మంచిది కాదు.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఇవాళ వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికి నిదానంగా పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

ధనస్సు రాశి

ఈ రాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మకర రాశి

ఈరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి శుభవార్తలు అందుతాయి.

కుంభ రాశి

ఈరోజు ఈ రాశి వారికి మిత్రుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంబంధిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు.

మీన రాశి

ఈరాశి వారు ఈరోజు సోదరులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. వాహన యోగం ఉంది.

Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ:  మీరు గమనించారా! కార్తీకమాసం - రంజాన్ సేమ్ టు సేమ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
AAA Rangoli Contest: ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
Kurnool News: కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Embed widget