Today Rasi Phalalu : ఆ రాశివారికి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి.. బంధువులతో మాత్రం జాగ్రత్త
Today Horoscope in Telugu (29/03/2024) : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? మార్చి 28వ తేదీన కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం.
![Today Rasi Phalalu : ఆ రాశివారికి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి.. బంధువులతో మాత్రం జాగ్రత్త Today Rasi Phalalu daily horoscope in Telugu for March 29th 2024 arise to Pisces zodiac sign astrology predictions in Telugu Today Rasi Phalalu : ఆ రాశివారికి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి.. బంధువులతో మాత్రం జాగ్రత్త](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/28/a38187218efa95a4826e86441a7023ed1711634322090874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Daily Horoscope for March 29th 2024 : ఈ రోజు రాశి ఫలాలు.. ఏయే రాశివారికి ఎలా ఉన్నాయంటే..
మేష రాశి
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పనిలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరిగే అవకాశముంది. పెళ్లి విషయంలో తీపి కబురు వింటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వృషభ రాశి
సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనండి. గౌరవం పెరుగుతుంది. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. జీవిత భాగస్వామి మీకు మద్ధతు ఇస్తారు. పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆఫీస్‌లో కూడా పరిస్థితులు సానుకూలంగా మారుతాయి.
మిథున రాశి
విద్యార్థులకు చాలా మంచి రోజు. ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార సంబంధ ఒప్పందాలపై సంతకం చేసేప్పుడు కాస్త అలెర్ట్‌గా ఉండాలి. డబ్బు విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఆరోగ్యం బాగుంటుంది కానీ.. పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.
కర్కాటక రాశి
ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి.. అలాగే సవాళ్లు కూడా పెరుగుతాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశముంది. బంధువులతో జాగ్రత్త. భాగస్వామిని బాగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డబ్బుతో కూడిన డీలింగ్స్ చేసేప్పుడు జాగ్రత్త.
సింహ రాశి
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొందరికి పెళ్లి ఫిక్స్ అవ్వొచ్చు. ఆఫీస్ పనులను బాధ్యతతో నిర్వహించండి. దీనివల్ల కొత్త ఆదాయాలు వచ్చే అవకాశముంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. మీ భాగస్వామికి సమయం వెచ్చించండి.
కన్య రాశి
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జీవితంలో ఊహించని మార్పునకు సిద్ధంగా ఉండండి. ఇబ్బందులకు భయపడవద్దు. కొత్త జాబ్ కోసం ఎదురు చూసే వాళ్లు శుభవార్త వింటారు. ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ చూపండి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
తుల రాశి
ఈరోజు మీరు కుటుంబంతో కలిసి ట్రిప్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. పని బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. బిజినెస్ పార్టనర్‌తో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమ మంచిది.
వృశ్చిక రాశి
శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. అన్ని పనులలో విజయం సాధిస్తారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.
ధనస్సు రాశి
ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తగా ఆదాయాలు వచ్చే అవకాశముంది. ఆఫీసు పనులు పూర్తి చేసేందుకు కొత్త వ్యూహలు చేస్తే మంచిది. కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. బిజినెస్ పార్ట్నర్లతో జాగ్రత్త. వారి వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి.
మకర రాశి
మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆఫీస్‌లో సహోద్యోగలతో కలిసి పనిచేయండి. భావోద్వేగాలకు తావు ఇవ్వకండి. కుటుంబంతో సమయాన్ని వెచ్చించండి. కుదిరితే టెంపుల్‌కి వెళ్లి రిలాక్స్ అవ్వండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
కుంభ రాశి
జీవితంలో ఊహించని మార్పులకు సిద్ధంగా ఉండండి. సవాళ్లకు భయపడవద్దు. ఓపికతో ఉండండి. ప్రశాంతంగా ఉంటూ.. నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటుతో ఉండొద్దు. కుటుంబంతో సమయాన్ని గడపండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు కాస్త సవాళ్లు ఎక్కువగా ఉంటాయి. డ్రైవింగ్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి. భాగస్వామితో టైమ్ స్పెండ్ చేయండి. డబ్బుకు సంబంధించిన దీర్ఘకాలిక వివిధాల నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇది కుటుంబం ఆనందంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.
Note: ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)